మహేశ్వరం, మలక్‌పేటలలో పర్యటించనున్న కేసీఆర్ | CM KCR to tour in Maheswaram constituency, Malakapet | Sakshi
Sakshi News home page

మహేశ్వరం, మలక్‌పేటలలో పర్యటించనున్న కేసీఆర్

May 19 2015 5:11 PM | Updated on Sep 3 2017 2:19 AM

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్‌కేపురం డివిజన్ ఎన్‌టీఆర్‌నగర్‌లో బుధవారం పర్యటించనున్నారని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్‌కేపురం డివిజన్ ఎన్‌టీఆర్‌ నగర్‌లో బుధవారం పర్యటించనున్నారని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. సభ కోసం సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు.

ముప్పై ఏళ్లుగా ఎన్‌టీఆర్‌నగర్ రెగ్యులరైజేషన్ సమస్య పెండింగ్‌లో ఉందని, ఆ బస్తీ వాసులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా మలక్‌పేట నియోజకవర్గం చావణీ డివిజన్‌లోని పిల్లిగుడిసెల ప్రాంతానికి ముఖ్యమంత్రి బుధవారం రానున్నారు. ఆ ప్రాంతంలోని సయీద్ ఫంక్షన్ హాలులో పిల్లగుడిసెల నివాసితులతో ఆయన సమావేశమై సమస్యలను తెలుసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement