
కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం అమల్లోకి తెస్తున్న పథకం తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద హెల్త్ స్కీం అని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవుతున్న తరుణంలో దీంతో ప్రజలకు ఎంతో మేలు కలగనుందన్నారు. ఆరోగ్యశ్రీలో రూ.2 లక్షల వైద్య సహాయమే ఉండగా, ఇందులో రూ.5 లక్షల వైద్య సహాయం అందుతుందని చెప్పారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేద ని వార్తలు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం చేపట్టిన అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.