పాలమూరుకు కేసీఆర్‌ చేసింది ఏమీ లేదు

BJP Leader Jithender Reddy Comments on TRS Government - Sakshi

కందనూలు: టీఆర్‌ఎస్‌ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూర్‌కు చేసింది ఏమీలేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా ప్రసిడెంట్‌ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన  సభ్యత్వ నమోదుకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరుకు శిలాఫలకాలు తప్పా, చేసింది శూన్యం అని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ, దక్షిణ తెలంగాణను ప్రాజెక్టులను పూర్తి చేయకుండ నియంతలా ప్రవర్థిస్తున్నారని ఆరోపించారు. పాలమూర్‌ ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న రిజర్వాయర్‌ ముంపు బాధితులకు న్యాయమైన పరిహారం చెల్లించకుండ, పోలీసులతో హింసించడం ఎంత వరకు సమజసం అన్నారు. మల్లాన్నసాగర్‌ ప్రజలకు రేట్లు పెంచి పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.12లక్షలకు చెల్లిస్తూ ఇక్కడి ప్రజలకు ఎందుకు ద్రోహం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాకు రావల్సిన నీళ్లు రాక పాలమూరు ఆత్మగోశిస్తుందని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూస్తున్నారని, స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. అంతకు ముందు బీజేపీ మొదటి సభ్యత్వం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన దళితుడు మీసాల మషన్న ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఆనంతరం బస్టాండ్‌ వద్ద ఇద్దరు ముస్లిం మహిళలకు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు సుధాకర్‌ రావు, దిలీపాచారి, పార్లమెంట్‌ కన్వీనర్‌ సుధాకర్‌ రెడ్డి, నాయకులు పోల్దాస్‌ రాము, దుర్గాప్రసాద్, శేఖర్‌ రెడ్డి,కృష్ణగౌడ్,అభిలాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top