మురికి కాలువలో ఆడశిశువు | Baby girl found dead in canal | Sakshi
Sakshi News home page

మురికి కాలువలో ఆడశిశువు

Oct 30 2015 5:37 PM | Updated on Mar 28 2018 11:11 AM

ఆడపిల్లను వదిలించుకోవాలనుకున్న తల్లిదండ్రులు చిన్నారిని మురికి కాలువలో వదిలేసి వెళ్లారు.

తాండూరు (రంగారెడ్డి) : ఆడపిల్లను వదిలించుకోవాలనుకున్న తల్లిదండ్రులు చిన్నారిని మురికి కాలువలో వదిలేసి వెళ్లారు. దీంతో చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం సీతారాంపేట గ్రామ శివారులో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులకి మురికి కాలువలో కొట్టుకొస్తున్న పసికందు కనిపించింది. రక్షించి చూడగా అప్పటికే మృతిచెందింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement