తుపాకుల లెసైన్స్‌పై వాగ్యుద్ధం | Arguments so high between TDP and TRS over assembly sessions | Sakshi
Sakshi News home page

తుపాకుల లెసైన్స్‌పై వాగ్యుద్ధం

Nov 25 2014 1:14 AM | Updated on Aug 10 2018 9:42 PM

తుపాకుల లెసైన్స్(గన్ లెసై న్స్) అంశం సోమవారం తెలంగాణ శాసనసభలో టీఆర్‌ఎస్, టీడీపీ పక్షాల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది.

ఏపీలో క్రిమినల్స్‌కు ఆయుధాలు:టీఆర్‌ఎస్
టీడీపీ సభ్యుల తీవ్ర అభ్యంతరం

 
సాక్షి, హైదరాబాద్: తుపాకుల లెసైన్స్(గన్ లెసై న్స్) అంశం సోమవారం తెలంగాణ శాసనసభలో టీఆర్‌ఎస్, టీడీపీ పక్షాల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ మధుసూదనాచారి జీరో అవర్‌ను చేపట్టారు. వివిధ అంశాలపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడిన అనంతరం చివరలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ.. తుపాకుల లెసైన్స్ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్ని లెసైన్స్‌లు ఇచ్చారో, ఇందుకు అనుసరిస్తున్న మార్గదర్శకాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. లెసైన్స్‌లు కలిగిన కొందరు వ్యక్తులు వాటిని అడ్డంపెట్టుకొని భూ దందాలు, ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపించారు.
 
  ఇదే సమయంలో పక్క రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఫ్రొఫెషనల్ క్రిమినల్స్‌కు ఆయుధాలు ఇచ్చినట్లుగా తెలిసిందని, ఈ దృష్ట్యా తుపాకుల లెసైన్స్‌లపై సమీక్ష నిర్వహించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పక్షం కూడా ప్రతి నినాదాలు చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో రామలింగారెడ్డికి స్పీకర్ మైక్ కట్ చేశారు. అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తమ స్థానాల్లో లేచి అభ్యంతరం తెలపడంతో స్పీకర్ సభకు టీ బ్రేక్ ప్రకటించారు.
 
 అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలకు భద్రత కుదింపు అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మె ల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. మాజీమంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డికి భద్రతను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. హోంగార్డుల జీతాన్ని పెంచాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వక్ప్‌భూములన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని, చేవెళ్లలో ఇటీవలే ఐదు ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, అందులో ఏబీ ఎన్ ఆంధ్రజ్యోతి చానల్ తన కార్యాల యాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిసిందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జాఫర్ హుస్సేన్(మజ్లిస్) ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ఉన్న నిషేదాన్ని ఎత్తేయాలని, దీనిపై సీఎం ప్రకటన చేయాలని పాయం వెంకటేశ్వర్లు(వైఎస్సార్‌సీపీ) కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement