చంద్రబాబుకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెబుతారని నాయిని నరసింహారెడ్డి అన్నారు.
తెలంగాణకు ద్రోహం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్ర సోనియాగాంధీ గొప్పదనాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఆయన చెప్పారు.
తెలంగాణ ద్రోహులను గ్రామాల్లో లేకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెబుతారని నాయిని నరసింహారెడ్డి అన్నారు.