మెతుకుసీమ నిప్పుల కుంపటిలా మారింది. భానుడు నిప్పులు కక్కడంతో గురువారం మెదక్‌లో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మెదక్, న్యూస్‌లైన్: మెతుకుసీమ నిప్పుల కుంపటిలా మారింది. భానుడు నిప్పులు కక్కడంతో గురువారం మెదక్‌లో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రచండభానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక జనం విలవిల్లాడిపోయారు. పెరుగుతున్న ఎండలతో జన మంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే గురువారం ఎంసెట్ పరీక్ష ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండవేడిమి భరించలేక అల్లాడిపోయారు. మరోవైపు గురువారం వివాహాలు కూడా అధికంగా ఉండ డంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లోకి వచ్చిన ప్రజలు ఉక్కపోతతో చెమటలు కక్కారు. ఉదయం 10 గంటల నుండే సూర్యుని ప్రతాపం ప్రారంభం కావడంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రతతో గ్రామాల్లో సైతం ఉపాధి పనులు సాగడం లేదు. వరి కోతలు కూడా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకే చేపడుతున్నారు.