కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
నల్లగొండ: కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం గురువారం ఉదయం నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో జరిగింది. మండలంలోని పాలారం తండాకు చెందిన 14 మంది కూలీలు ఖమ్మం జిల్లాకు మిర్చీ కోత పనికి ఆటోలో వెళుతుండగా మూల మలపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలోని వారు గాయపడ్డారు. అయితే క్షతగాత్రులతో వెళుతున్న ఆటో కూడా మళ్లీ బోల్తా కొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(నడిగూడెం)