breaking news
-
బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల ముందు ఊహించని షాక్ తగులుతోంది. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఆదివారం సాయంత్రం బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇందుకు ఊతమిస్తోంది. త్వరలోనే తన అనుచరులతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. చిన్నచూపు చూశారనే.. ► విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్ బాబా ఫసియుద్దీన్లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచి్చన తర్వాత బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో తగిన గుర్తింపును ఇచి్చంది. రెండో దఫా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఉద్యమ వీరులను చిన్నచూపు చూసిందని, అసలు లక్ష్యమే పక్కదారి పట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ► మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పారీ్టతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తుండగా... మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెప్పినా బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకో లేదంటూ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో.. ఆయన కాంగ్రెస్‌లో ఆయన చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా నగరంలో పట్టు కోసం బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ టచ్‌లో 20 మంది కార్పొరేటర్లు ► బీఆర్ఎస్కు చెందిన సుమారు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీడిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పారీ్టపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు గులాబీలు చేజారకుండా కట్టడి చేయాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ నుంచి పోతే పోనీ.. వాళ్ల కర్మ అన్నట్లు వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్ బాట పడుతున్నట్లు సమాచారం. -
మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి
సూర్యాపేట రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల పథకాల కంటే ముందు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన తమ పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓలే కారణమని తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ప్రవీణ్ కుమార్ హాజరై తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం మాట్లాడారు. ‘సీఎం ఆరు గ్యారంటీలు అమ లు చేయకపోయినా మాకు నష్టం లేదు. ఇందు కోసమేనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మ ల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆదాయం వచ్చే శాఖలకు మంత్రులను కేటాయించారే గానీ గిరి జన సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం బాధాకరం. భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోతే రెండు నిమిషాలు కూడా మౌనం పాటించకపోవడం హేయమైన చర్య’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైష్ణవి మృతిపై విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగ డంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ పాఠశాల వద్దకు రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు సీఐలు, ఎస్సైలు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. వైష్ణవి కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రవీణ్‌కుమార్‌కు వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల దుష్ప్రచారం నమ్మొద్దు
చందుర్తి (వేములవాడ): రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని సర్వేలు చెబుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ అన్నారు. దీనిని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఆదివారం బండి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కట్టలింగంపేటలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం నమ్మొద్దని కోరారు. స్వయం ప్రకటిత మేధావి గత ఎన్నికల్లో ఎక్కడి నుంచో వచ్చి కరీంనగర్లో పోటీ చేశాడని, ఇప్పుడు సైతం ఇక్కడ ఎంపీగా గెలుస్తానని కలలు కంటున్నాడని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యత లోపించి కూలేందుకు సిద్ధమైందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు నెలల పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయామని భావి స్తున్నారని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
కాంగ్రెస్‌లోకి మాజీ మేయర్ బొంతు?
కుషాయిగూడ(హైదరాబాద్): తెలంగాణ ఉద్యమనేత, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివా రం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు కీలక నేతలు ముఖ్యమంత్రిని కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రామ్మోహన్‌కు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చాలాకాలం వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. బొంతు అసంతృప్తిని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలిపి తెలంగాణ ఏర్పడిన అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మొదటి మేయర్‌గా అవకాశం కల్పించారు. అనంతరం తన సతీమణి బొంతు శ్రీదేవిని చర్లపల్లి కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. మేయర్‌గా కొనసాగుతూ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానంపై బొంతు కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు కూడా ఉప్పల్ స్థానం కోసం పోటీపడగా కేసీఆర్ బండారికే టికెట్ ఖారారు చేశారు. పార్టీ టికెట్ ఇవ్వలేదని మనస్తాపం చెంది కొన్ని రోజులపాటు మౌనంగా ఉన్న రామ్మోహన్‌తో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడి సర్దిచెప్పారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లో ఏదైనా ఒకచోట పోటీ చేసే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పెద్దలను బొంతు కోరినప్పటికి టికెట్ దక్కే చాన్స్ కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. సోమవారం తన మనసులో మాటను మీడియాకు వెల్లడించనున్నట్లు సమాచారం. -
బడ్జెట్లో కానరాని ‘కల్యాణలక్ష్మి’
సిద్దిపేట జోన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బడ్జెట్లో విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారు లకు నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదన్నారు. అలాగే మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పి నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. బడ్జెట్లో మైనార్టీలకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, నేడు రూ.2,200 కోట్లే కేటాయించిందని, రెండు నెలలుగా వృద్ధులకు పింఛన్లు కూడా అందడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.12 వేల కోట్ల ఆర్థిక సాయం చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి కనీసం 16 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన మైనార్టీల ఉమ్రా యాత్ర కోసం తన సొంత డబ్బు వెచ్చిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. -
తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్
సాక్షి , హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో మూడో సారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచన ప్రజల్లో ఉందన్నారు. ఈనెల 20 నుంచి బీజేపీ చేపట్టనున్న విజయ సంకల్పయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ , మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీకి సానుకూల వాతావ రణం కనపడుతోందన్నారు. కేంద్రంలో ఏర్పాట య్యే నరేంద్రమోదీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యమయ్యేలా, ప్రజల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ రాష్ట్రశాఖ 5 బస్సు యాత్రలు నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్–బీజేపీ మధ్యనే పోటీ ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును బీజేపీనే కైవసం చేసుకుంటుందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. నరేంద్రమోదీకి ఎదురు నిలబడే శక్తి ఏ కూటమికి లేదని, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల నుంచి కూడా మోదీకి 80 శాతం మంది ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ సమా వేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షు రాలు శిల్పారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు. ఐదు యాత్రలు ఇలా... విజయ సంకల్ప యాత్ర పేరుతో ఫిబ్రవరి 20వ తేదీన ఐదు బస్సు యాత్రలు ప్రారంభమై మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతాయని కిషన్‌రెడ్డి చెప్పారు. ► మొదటిది కొమురం భీం యాత్ర కాగా.. ఇది ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో ► శాతవాహన యాత్ర కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల సెగ్మెంట్లలో ► కాకతీయయాత్ర ఖమ్మం, వరంగల్, మహ బూబాబాద్లలో ► భాగ్యనగర యాత్ర భువనగిరి, హైదరాబా ద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలలో ►కృష్ణమ్మ యాత్ర మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లలో ఉంటుందని, ఈ ఐదు యాత్రలు భాగ్య నగరంలో కలిసేవిధంగా ప్రణాళిక రూపొందించినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. -
వీరయ్యకు పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీపీఎం పర్యవేక్ష ణ బాధ్యతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్యకు అప్పగించారు. రాష్ట్ర రాజధాని హై దరాబాద్‌లో ఉంటూ పార్టీని నడిపించాల్సిన బాధ్య తను ఆయనకు అప్పగిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావే శాలు జరిగాయి. ఆ భేటీల్లో ఈ నిర్ణయం తీసుకు న్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఏఐజీలో ఆయన చికిత్స పొందారు. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులు జరిగిన పార్టీ సమావే శాలకు కూడా తమ్మినేని కొద్దిసేపు మాత్రమే హాజర య్యారు. కాగా తమ్మినేని సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వంలోనే వీరయ్య పనిచేయాలని స్ప ష్టం చేస్తూ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. అవసరాన్ని బట్టి తమ్మినేని హైదరాబాద్‌లో, అలాగే ఖమ్మంలోనూ ఉంటారు. మూడు నెలల పాటు వీరయ్య ఈ బాధ్యతలు నిర్వర్తించాలని సీపీఎం నిర్ణయించింది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వీరయ్యపై పడింది. ఈయన గతంలో ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, నవ తెలంగాణ ఎడిటర్‌గా పనిచేశారు. రెండు ఎంపీ సీట్లలో పోటీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తమ్మినేని ఒక ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏవో రెండింటిలో పోటీ చేయాలని సీపీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నేతల గురి ప్రధానంగా మహబూబాబాద్, భువనగిరి స్థానాలపై ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానమే ఇస్తాననడంతో పొత్తు కుదరలేదు. ఇక రెండ్రోజులు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలపై సీపీఎం చర్చించింది. కాంగ్రెస్‌తో అవగాహన చేసుకొని ఉంటే సానుకూల ఫలితాలు వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఒక స్థానంలో సీపీఐ పోటీ! సీపీఐ కనీసం ఒక లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలకు మద్దతు కోరి ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించవచ్చని అనుకుంటున్నారు. 16న సమ్మెకు మద్దతు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌కు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజలంతా పాల్గొనాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. -
ఈ నెల 20 నుంచి బీజేపీ బస్సు యాత్రలు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విజయ సంకల్ప యాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 1025 కి.మీ మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు కొనసాగుతాయని తెలిపారు. 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు నిర్వహిస్తామన్నారు. యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామన్న కిషన్‌రెడ్డి.. పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణలో 17 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎంను మట్టి కరిపిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన బీహార్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నుంచి 19 మంది బీహార్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రానికి బయలుదేరారు. ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల శిబిరం కొనసాగింది. రేపు బీహార్ శాసనసభలో బల నిరూపణకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జార్ఖండ్ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్ రాజకీయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్‌కు చెందిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీహార్‌లో ఇండియా కూటమి నుంచి జేడీయూనేత నితీష్‌కుమార్ బయటకు వచ్చి.. ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవాలని ఏఐసీసీ భావించింది. అందుకే వెంటనే వారిని కాపాడే టాస్క్‌ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌లో వసతి కల్పించారు. ఇదీ చదవండి: ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా? -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. సీఎం రేవంత్‌తో బొంతు రామ్మోహన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నగరంలో పట్టు పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా.. సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, సీఎం రేవంత్‌ను కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బీఆర్ఎస్పై బొంతు రామ్మోహన్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనూహ్యంగా ఆ నియోజకవర్గ టికెట్‌ను బండారు లక్ష్మారెడ్డికి కేటాయించడంతో బొంతు రామ్మోహన్‌లో అసంతృప్తి రగిలింది. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ సీటు కూడా దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా? -
కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్.. క్షమాపణలు చెప్పాల్సిందే..
సాక్షి, నల్లగొండ: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ నల్లగొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి ఆదివారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు. ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడు. బీఆర్ఎస్ నల్లగొండను నాశనం చేసింది. త్వరలో ఇక్కడికి కేసీఆర్ వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ వస్తున్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి. బీఆర్ఎస్ సభ రోజున ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ప్రసంగించాలి. కేసీఆర్ మాట తప్పడంపై జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన చేపడుతున్నాం. కేసీఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే, రాష్ట్ర బడ్జెట్‌పై కూడా కోమటిరెడ్డి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైంది. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాం. కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలి. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టింది కేసీఆర్, హరీష్‌రావే అని వ్యాఖ్యలు చేశారు. -
గ్రేటర్‌పై సర్కారు కుట్ర
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రే ఓటుకు నోటు కేసులో దొరికిన ఓ దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు వస్తే వాస్తవాలను బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కుంగిందని, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. చిన్న చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపాలి కానీ దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై పగ పట్టినట్లుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అయోమయంగా కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ సర్కార్ రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజాపాలన అందిస్తామంటూ పగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్.. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరగకుండా ఆపుతోందని దుయ్యబట్టారు. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతింటుందన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పాలన అయోమయంగా ఉందన్నారు. 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు 420 హామీల అమలుకు రూ. 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కోసం రూ. 50వేల కోట్లకుపైగా అవుతుందన్నారు. రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో బడ్జెట్లో చెప్పలేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. పార్టీ మారితే వచ్చే నష్టమేమీ లేదు ఒక్కరో ఇద్దరో పార్టీ మారితే వచ్చే నష్టం ఏమీ లేదని.. అది వారి ఖర్మ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పని చేశారన్నారు. ప్రతీ కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషితోనే నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందని గుర్తు చేశారు. అధికారులు సహకరించడం లేదు: మేయర్ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశానన్నారు. ఒక సాధారణ కార్పొరేటర్‌గా ఉన్న తనకు పార్టీ మేయర్‌గా అవకామిచి్చందన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారని.. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి తమ బడ్జెట్ కొత్తగా అనిపించవచ్చని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లుగా పెడితే వాస్తవంగా వ చ్చినది రూ.2.20 లక్షల కోట్లేనని చెప్పారు. నీటిపారుదల శాఖ చేసిన అప్పులపై రూ.16 వేల కోట్లను వడ్డీ కింద కట్టాల్సి వస్తోందన్నారు. అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. శనివారం శాసనసభ వాయిదాపడ్డాక అసెంబ్లీలోని తన చాంబర్లో రేవంత్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘ఈ బడ్జెట్ ప్రతిపాదనలు మొదట్లో నిషూ్టరంగా అనిపించినా.. మిగతా ఏడాదంతా వాస్తవాలు చెప్పవచ్చన్నదే మా ఉద్దేశం. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ రూపొందించేందుకు ఉన్న కాస్త సమయంలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రయతి్నంచారు..’’అని వివరించారు. మేడిగడ్డకు అందరినీ ఆహ్వానిస్తున్నాం.. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శన కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను తీసుకెళతామని రేవంత్ చె ప్పారు. ‘‘బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ వస్తారా, ఇతరులను పంపుతారా అనేది వారి ఇష్టం. 13న నల్ల గొండలో బీఆర్ఎస్ సభ ఉన్నందున.. మరో తేదీన వస్తామని బీఆర్ఎస్ వాళ్లు చెప్పినా తీసుకెళ్లేందుకు మేం సిద్ధం. కాళేశ్వరంపై కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతాం. విజిలెన్స్ ప్రాథమిక విచారణ ఆధారంగా అధికారులపై చర్యలు చేపట్టాం. సాంకేతిక నిపుణుల బృందం నివేదిక, జ్యుడీషియల్ విచారణలో తేలే అంశాల ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపడతాం. ఇతర శాఖలపైనా సమీక్షించి మోతాదుకు మించి తప్పిదాలు జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం..’’అని రేవంత్ పేర్కొన్నారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై 12న వివరంగా చర్చిస్తామని తెలిపారు. ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని, అవసరం లేకున్నా కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ‘అమరుల జ్యోతి’పైనా విచారణ! హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన అమరుల జ్యోతి, అంబేడ్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియట్ నిర్మాణ అంచనాలు, చెల్లింపులు, నాణ్యతా లోపం మీద విచారణకు ఆదేశిస్తున్నామని రేవంత్ చెప్పారు. ‘‘అమరుల జ్యోతి దేనికోసం కట్టారో, అందులో ఏముందో తెలియదు. అద్భుతాల పేరిట తక్కువ ఖర్చులో పూర్తయ్యే పనికి ఎక్కువ ఖర్చు చేయడం సరికాదు. ఫార్ములా–ఈ రేసింగ్‌పై సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు అక్రమంగా భూములు కొనుగోలు చేసిన అంశంపై ఏసీబీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం..’’అన్నారు. గతంలో జాతీయ రహదారులు, గుట్టలు, సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని.. తాము సాగుచేసే రైతులు, కౌలుదారులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తున్నామన్నారు. మహిళలకు లబ్ధి చేకూరే పథకాలను ముందుగా చేపడుతున్నట్టు వివరించారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఆరోగ్యభద్రత కార్డుకు రేషన్‌కార్డు లింక్‌ను వేరుచేస్తామని తెలిపారు. అసెంబ్లీ బీఏసీ భేటీకి హరీశ్‌రావును అనుమతించడం స్పీకర్ విచక్షణకు సంబంధించినదన్నారు. 2014లో టీడీపీ తనను బీఏసీకి నామినేట్ చేసినా ఎర్రబెల్లికి ఒక్కరికే అవకాశమిచ్చి తనను బయటికి పంపారని గుర్తు చేశారు. నేను మాట్లాడేది తెలంగాణ భాష విపక్ష నేతలను దూషిస్తున్నట్టుగా వస్తున్న విమర్శలపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘ఆ మాటల విషయానికి వస్తే.. నేను మాట్లాడుతున్నది తెలంగాణ భాషే కదా..’’అని వ్యాఖ్యానించారు. తనను కలసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనుమానించడం సరికాదన్నారు. తమ నేత జగ్గారెడ్డి చెప్పినట్టుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
పూట గడవడమూ కష్టమే!
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా తెలంగాణలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోవడం సంతోషకరమని.. కానీ గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రానికి కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించి, పూటగడవడం కూడా కష్టమనే స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని మండిపడ్డారు. ప్రణాళిక, హేతుబద్ధత లేకుండా చేసిన అప్పులు సవాల్‌గా మారాయన్నారు. అయితే రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంతోషాలే తమ ముఖ్యమని, మెరుగైన సంక్షేమ పాలన అందించడం తమ లక్ష్యమని.. ఇప్పటికే దుబారా ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టామని వివరించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గత ప్రభుత్వ ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. రాష్ట్ర రాబడిని పెంచి చూపి.. ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనే భ్రమ కల్పించారు. దళితబంధు పథకానికి గత బడ్జెట్లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తే.. ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. కాగ్ లెక్కల ప్రకారం.. 2021–22 బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే ఎస్సీల అభివృద్ధికి రూ.4,874 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.2,918 కోట్లు, బీసీల అభివృద్ధికి రూ.1,437 కోట్లను ఖర్చు చేయలేదు. 2014–15 నుంచి 2023–24 వరకు వడ్డీలేని రుణాల కోసమని.. రైతులకు రూ.1,067 కోట్లు కేటాయించి, రూ.297 కోట్లే ఖర్చు చేశారు. మహిళలకు రూ.7,848 కోట్లు కేటాయించి, రూ.2,685 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి.. దానికి అనుగుణంగా పథకాలకు కేటాయింపులు చేసింది. 100 శాతం ఇళ్లకు నీళ్లు అబద్ధం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రక్షిత తాగునీరు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం రూ.35,752 కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ పూర్తి చేశామని గొప్పలు చెప్పింది. కానీ రాష్ట్రంలో రక్షిత మంచినీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. తప్పుడు నివేదికలతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు రాలేదు. రైతుబంధుతో అనర్హులకే ఎక్కువ లాభం రూ.2 లక్షల రుణమాఫీకి త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. రైతుల ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రైతులకు పెట్టుబడి సాయం పేరిట గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. కానీ దీనిద్వారా అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారు. సాగులో లేని, సాగు యోగ్యంకాని కొండలు, గుట్టలు, రోడ్లు ఉన్న భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు రైతుబంధు సొమ్ము అందింది. ఇది అక్రమం. దీనిని పునఃసమీక్షించి అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. ఫసల్ బీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం. కొందరికి ఆభరణంగా.. అందరికీ భారంగా.. ధరణి కొందరికి భరణంగా, మరికొందరికి ఆభ రణంగా, చాలా మందికి భారంగా మారింది. గత ప్ర భుత్వ తప్పులతో చాలా మంది సొంత భూమిని అ మ్ముకోలేకపోయారు. ధరణి సమస్యల పరిష్కారా నికి ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించాం. కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు.. గత ప్రభుత్వం నిపుణులు, మేధావుల సూచనలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో.. సాగునీటి, ఆర్థిక రంగాలను అతలాకుతలం చేసింది. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. రూ.లక్షల కోట్ల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అవినీతి, అనాలోచిత విధానాలు, అవకతవకతలపై విచారణ జరిపిస్తాం. ఓటాన్ అకౌంట్ ఎందుకంటే.. కేంద్రం ఈ నెల 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ పెట్టాల్సి వచ్చింది. కేంద్రం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక.. రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించాం..’’ అని భట్టి తెలిపారు. -
రామ రాజ్యమా.. రాక్షస రాజ్యమా..? : బండి సంజయ్
కోరుట్ల/మేడిపల్లి/కొండగట్టు: మోదీ రామరాజ్యం కావాలా?.. రాహుల్ రాక్షస రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివా రం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ప్రజాహిత యా త్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రాహుల్ కాదు.. రౌల్.. అంటే స్పానిష్ భాషలో తోడేలు లాంటి వాడని అర్థమని, అలాంటి రాహుల్ గాందీని ప్రజలు నమ్మరని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నిలిచి, దేవుడిని హేళన చేసే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని, మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే అక్కడ బాబ్రీ మసీదు కట్టిస్తారని విమర్శించారు. అయోధ్యలో రాముడు పుట్టాడని చెప్పడానికి ఆధారాలేమిటని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఏనాడూ గుర్తించలేదని, పీవీ ఘాట్ కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే, కాంగ్రెస్ కనీసం నోరు మెదపలేదన్నారు. పీవీ ఘాట్‌పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తామని వారి్నంగ్ ఇచ్చి న పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ప్రధాని మోదీ కులాన్ని ప్రశ్నించడం రాహుల్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం..: బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు కావాలంటే కనీసం రూ.5 లక్షల కోట్లు కావాలని, ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని చెప్పారు. ఇచ్చి న హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు ఏమాత్రం సంబంధం లేదని, హామీలు నెరవేర్చలేమని కాంగ్రెస్ పరోక్షంగా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ తాంత్రిక నిలయం..: కేసీఆర్ ఫామ్‌హౌస్ తాంత్రిక పూజలకు నిలయమని సంజయ్ ఆరోపించా రు. ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికి ప్రస్తుతం ఎవరూ సాహసం చే యడం లేదన్నారు. ‘నా కాళ్లు, చేతులు పడిపోవాలని, నేను చనిపోవాలని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తాంత్రిక పూజలు నిర్వహించారు’అని ఆరోపించారు. ఇతరుల నాశనం కోరుకునే వారు ఎవరైనా చివరకు వారే నాశనం అవుతారని బండి పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానా లు గెలవడమే ప్రజాహిత యాత్ర ముఖ్య ఉద్దేశమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం జగిత్యాల జి ల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజ లు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ లయ అర్చకులు సన్మానించి, స్వామివారి ప్రసాదం అంద జే శారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ, మోదీని మూడో సారి ప్రధాని చేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు కేటాయిస్తానని వాగ్ధానం చే సి ఇవ్వలేదని విమర్శించారు. దేవుళ్లను, ప్రజలను మోసం చే సిన ఘనత బీఆర్ఎస్ పా ర్టీదేనని అన్నారు. ఈనెల 15 వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ 420 హామీలునెరవేరాలంటే అదనంగా రూ.1.25 లక్షల కోట్లు కావాలి
రాంగోపాల్‌పేట(హైదరాబాద్): ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇ చ్చిన 420 హామీలు నెరవేరాలంటే అదనంగా రూ.1.25 లక్షల కోట్లు అవసరమని, ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.53 వేల కోట్లు కేటాయించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన శనివారం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో సనత్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ‘మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలు 1.67 కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తే నెలకు రూ.4500 కోట్లు... సంవత్సరానికి రూ.54 వేల కోట్లు అవుతుంది. మిగతా పథకాలు ఎలా అమలు చేస్తారు. 100 రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే వారి భరతం పడతాం. రుణమాఫీకే రూ.39వేల కోట్లు కావాలి. రైతుభరోసాకు రూ.24వేల కోట్లు కావాలి. ఇవన్నీ అమలు చేస్తే అదనంగా 1.25లక్షల కోట్లు అవసరం. కానీ నేటి బడ్జెట్ మేడిపండు చందంగా ఉందని’విమర్శించారు. బీఆర్ఎస్ను 100 మీటర్ల బొంద తవ్వి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, గడ్డపారలు పట్టుకొని లంకెబిందెల కోసం తిరగడం ఆయనకు అలవాటేనని, అందుకే తవ్వుడు గురించి మాట్లాడుతున్నాడన్నారు. 24 ఏళ్లలో కేసీఆర్‌ను ఖతం చేస్తాం అంటూ ఎంతోమంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేకపోయారని, నీలాంటి బుడ్డర్ఖాన్లతో ఏమవుతుందని ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను ధారాదత్తం చేస్తూ ఈ దద్దమ్మ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 13వ తేదీన నల్లగొండలో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పద్మారావు, ముఠాగోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం కట్టింది మేము..చూడాల్సింది మీరే ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం, దానిని కట్టింది మా ప్రభుత్వమే. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవచ్చు. కాళేశ్వరం కట్టిందే మేము.. అయితే చూడాల్సింది కాంగ్రెస్ పా ర్టీనే’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో కేటీఆర్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాజెక్టులో ఏవైనా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటే సరిచేయాలి. అందుకు అవసరమైన పూర్తి యంత్రాంగం ప్రభుత్వం వద్ద ఉంది. మేడిగడ్డ సమస్యను చూపుతూ మొత్తం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేయడం.. సూర్యుడి మీద ఉమ్మడం లాంటిదే. ప్రాజెక్టులో తప్పులు జరిగితే బయటపెట్టాలని, ఏ విచారణకైనా సిద్ధమేనని గతంలోనే పదులసార్లు చెప్పాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం గొప్పతనంతోపాటు కాలువలు, పంప్‌హౌస్‌లు ఎన్ని ఉన్నాయని కాంగ్రెస్ తెలుసుకోవచ్చు. కానీ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నేతలకు కనీస ఇంగిత జ్ఞానం లేదు.అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక క్రిమినల్. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదు. అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎవరిపైనైనా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ మోసం బయటపడింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన మోసం బయటపడిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్‌ది అంకెలతో పాటు మాటల గారడీ సర్కార్ అని విమర్శించారు. ‘‘మొత్తంగా ఈ బడ్జెట్.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోంది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసం’’అని మండిపడ్డారు. బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలను చూస్తే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చి న గ్యారంటీ.. ఇక అమలు కానట్టేనన్నారు. ‘ౖసాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు (రూ. 28 వేల కోట్లు) ఏమాత్రం సరిపోవు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీకి కూడా ఈ నిధులు సరిపోవు’అని వ్యాఖ్యానించారు. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’అమలవుతుందా? బడ్జెట్లో వైద్యరంగానికి రూ.11వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమ లు చేస్తుందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారు? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మైనారిటీలకు (15 శాతం జనాభాకి) రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 50 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసిందని విమర్శించారు.వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని, మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఇక ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు లేనట్టేనా? కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో... మొదటి సమావేశంలోనే బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామన్నారనీ కానీ ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలను నిలువునా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంబేడ్కర్ మాటలను ఉటంకించారు. కానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ‘కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి గొప్పగా చెప్పుకున్నరు. బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ. 7,700 కోట్లు. మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే.. ఇచ్చింది రూ.7,700 కోట్లు మాత్రమే’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
నాథుడు లేని పార్టీకి అందలమెలా..
అది ఎంత మహా వృక్షమైనా కావొచ్చు. ఎన్నిఆటుపోట్లనైనా తట్టుకుని ఉండొచ్చు. చివరికి ఓ చిన్నపాటి గాలివాన చాలు.. కూకటి వేళ్ళతో కూలిపోవడానికి.. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దృష్టాంతం అతికినట్లు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చకచకా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాల్సింది పోయి అంతర్గత సమస్యలహో అల్లాడుతూ పఠనం దిశగా సాగుతోంది. మరోపక్క ప్రస్తుత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం అందనంత ఎత్తులో మూడోమారు అందాలన్నీ దక్కించుకునే రేసులో దూసుకుపోతోంది. ఒక జాతీయ పార్టీగా రాజకీయాలను శాసించి.. దిగ్గజాలకు ఆలవాలమై దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిక్కులేని స్థాయికి ఎందుకు దిగజారింది?? ఎందుకీ దుర్గతి పట్టింది..?? ఎన్నికల వేళ పార్టీ ని సరైన పంథాలో నడిపించే నాథుడు లేక ఎందుకు విలాలలాడుతోంది..?? రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రాంతీయ పార్టీగానైనా నిలబడుతుందా..?? నాలుగు దశాబ్దాల కిందట 400 పై చిలుకు స్థానాలతో ప్రత్యర్థులను గడగడ లాడించిన పార్టీ నేడు కనీస సీట్లు అయినా సాధించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది?? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే.. పతనం దిశగా.. వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. కాంగ్రెస్ పఠనం వెనుక కఠోర సత్యాలు కూడా దాచిపెట్టేవి ఏమీ కాదు. పార్టీ ప్రస్తుత దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం స్వయంకృతమేనని చెప్పుకోవాలి. నెహ్రు, ఇందిర, రాజీవ్‌ల హయాం తర్వాత పార్టీ మసకబారడం మొదలైంది. రాజీవ్ మరణానంతరం సోనియా అధికార విముఖతతో ప్రధాని పదవిని చేపట్టిన పీవీ.. మన్మోహన్ సాయంతో దేశాన్ని సంస్కరణల బాట అయితే పట్టించగలిగారు కానీ పార్టీకి అవసరమైన శక్తియుక్తులు నింపడంలో మాత్రం తన చాణక్య నీతిని ప్రదర్శించలేక పొయారనే చెప్పొచ్చు. కారణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. అదీగాక పీవీ హయాంలోనే వెలుగు చూసిన హర్షద్ మెహతా కుంభకోణం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఫలితంగా తొలిసారి వాజపేయి దేశ ప్రధాని అయ్యారు. ఇక 2004 ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‘ నినాదంతో ఎన్డీయే కూటమి బలమైన ప్రభావాన్నే చూపినప్పటికీ గుజరాత్ మత కల్లోలాలు ఆ కూటమిని కాదని యూపీఏ (ఇప్పటి ఇండియా కూటమి) కూటమికి అధికార పగ్గాలు అప్పగించాయి. మన్మోహన్ ప్రధాని అయ్యారు. దశాబ్ద కాలం పాటు రెండు విడతల్లోనూ ప్రధాని అయితే కాగలిగారు కానీ.. మౌన మునిగా ముద్రపడటం.. కర్త, కర్మ, క్రియ అంతా సోనియారాహుల్ లే అయ్యి ముందుకు నడిపించడం ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తికి ఆస్కారం కలిగించింది. దీంతో రానురానూ పార్టీ ప్రాభవం అడుగంటుతూ వచ్చింది. మన్మోహన్ రెండో విడతలో రకరకాల స్కాములు వెలుగు చూడటం, ధరల నియంత్రణ లేకపోవడం, నిరుద్యోగిత రేటు పెచ్చుమీరడం, పార్టీ నాయకుల్లో పొరపొచ్చాలు ప్రతిస్థను అథఃపాతాళానికి దిగజార్చేశాయి. ఎన్డీయే కూటమి ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. మోదీని తెరపైకి తెచ్చింది.. పగ్గాలు దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 51 సీట్లు గెలుచుకోగా.. యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో, అది కూడా కేవలం 20 శాతం ఓటు బ్యాంకు తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అక్కరకు రాని అన్నా చెల్లెల్లు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతోనే యూపీఏకు నూకలు చెల్లడం మొదలైనట్లేనని భావించొచ్చు. ఇంటి పెద్దగా సోనియా పైపైన పెద్దరికం వహిస్తున్నా.. మోదీ, అమిత్ షాల ద్వయాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడ్ని తీర్చిదిద్ద లేకపోవడం కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇందుకు రాహుల్, ప్రియాంకల ఉదంతాలే ఓ పెద్ద ఉదాహరణ. పదేళ్ల కిందట ప్రజల్లోని అసంతృప్తి సెగలతో అధికార పీఠాన్ని వదులుకున్న కాంగ్రెస్ కూటమి తర్వాతి తరుణంలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేక పోయింది. పార్టీకి రాహుల్, ప్రియాంకల రూపంలో యువ నాయకత్వం అందుబాటులో ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది. యువ నాయకునిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీకి మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించలేకపోయాడు రాహుల్.. అంచెలంచెలుగా నాయకునిగా ఎదగాల్సిన చోట తనవల్ల కాదంటూ పార్టీ అధికార బాధ్యతలకు ఆమడ దూరం వెళ్లిపోయాడు ఆయన.. ఒక నెహ్రు, ఇందిరా, రాజీవ్‌ల వంశీకుడైనా ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోలేక పోవడం రాహుల్ ప్రధాన వైఫల్యంగా భావించొచ్చు. ఇక అప్పట్లో ఇందిరమ్మ డైనమిజంతో పోలుస్తూ ప్రియాంకను రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించింది కాంగ్రెస్ కోటరీ. వ్యక్తిగత సమస్యలో, అనుకోని అవాంతారాలో కానీ ఆ యత్నాలేవీ ఫలించలేదు. ఆమె తన ప్రాబల్యాన్ని చూపించి ఉంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మరింత రసవత్తరంగా మారేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడపాదడపా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు అక్కడకు వెళ్లి ప్రచార సభల్లో మొహం చూపించి పోవడం తప్ప ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోయింది ప్రియాంక. కాంగ్రెస్ అంటేనే నెహ్రు వారసులుగా భావించే ప్రజానీకంలో అన్నా చెల్లెళ్ళ వెనకడుగు ఆ పార్టీని మరింత బలహీనంగా మార్చేస్తోంది. పార్టీ బాధ్యతలు ఖర్గే చేతుల్లో పెట్టినా.. ఈయన పాత్ర మరో మన్మోహన్ మాదిరిగానే ఉండొచ్చన్న అభిప్రాయం ప్రజల్లో గూడు కట్టుకుపోవడం పెద్ద మైనస్‌గా భావించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు యే ధీమాతో ఇండియా కూటమికి ఓటు వేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మిత్రులే కానీ.... తలో దారి.. ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్న ప్రస్తుత తరుణంలో విబేధాలను పరిష్కరించుకుని కలిసికట్టుగా సాగాల్సింది పోయి కాంగ్రెస్ మిత్ర గణం చెరో దారీ వెతుక్కుంటూంటే ఇదే అదనుగా ఎన్డీయే పక్షం బలం పెంచుకుంటూ పోతోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇటీవలి బీహార్ పరిణామాల గురించే. కాంగ్రెస్ సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జనతాదళ్ (యూ) అధినేత నితీష్ కుమార్ తాజాగా ఇచ్చిన ఝలక్ బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమే అయింది. ఈ విషయాన్ని ముందస్తు పసిగట్టడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మొన్నీ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిష్ఠ వేసుకుని కూర్చుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, హర్యానా, గుజరాత్‌లలో పెత్తనం ఎటూ బీజేపీదే, కర్ణాటకలో తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, హామీల విషయంలో అక్కడి ప్రభుత్వ వైఖరి అయోమయంలో పడేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే ముందు నోరు మెదిపి పరిస్థితి ఎటూ లేదు. కళ్లు తెరవకపోతే.. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఖర్గే పేరుతో తెచ్చిన దళిత కార్డు ప్రభావం నామమాత్రమేనని చెప్పొచ్చు. ఇక పార్టీకి ఏకైక ఆశాకిరణం రాహుల్ గాంధీయే. ఆయన నేతృత్వం తక్షణ అవసరం.. పరిస్థితి తీవ్రత గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఓటర్లలో ఓ కొత్త నమ్మకాన్ని, ప్రశ్నిచే గళం ఒకటి ఉండనే ధీమాను కలిగించాలి. సరైన రీతిలో పావులు కదిపి మోదీ సర్కారుకు సవాలు విసిరేలా పార్టీ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగలగాలి. సహజంగా అధికార పార్టీలపై ఉండే అసంతృప్తి సెగల్ని సొమ్ము చేసుకుని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోఎలాగైతే అధికారాన్ని అందిపుచ్చుకోగలిగారో.. అదే మాదిరి ప్రయత్నాలు అన్నిచోట్లా చేయాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధ నాయకులను గౌరవ పదవులకు పరిమితం చేస్తూ.. వాళ్ళ సలహాలు, సూచనలతో యువ రక్తాన్ని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాలి. మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను వెతికి పట్టుకుని ఎన్నికల పోరుకు సిద్ధమవ్వాలి. అప్పుడే సార్వత్రిక రణం హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుంది. బహుశా ప్రస్తుతానికి సమయం మించిపోయిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లోనైనా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునే చర్యల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలం పుంజుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తే 2029లోనైనా మళ్లీ కేంద్రంలో కొలువుదీరే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించనంత వరకు ఎన్ని జోడో యాత్రలు చేపట్టినా అవన్నీ కంటితుడుపు చర్యలుగా మిగిలిపోతాయే తప్ప అధికారాన్ని మాత్రం అందించవు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే సరే... లేదంటే ముందే చెప్పినట్లు ఒక చిన్న గాలివాన చాలు.. కాంగ్రెస్ అనే మహావృక్షం కూకటివేళ్లతో సహా కూలిపోవడానికి. తెలంగాణను చూసి మురిసిపోతే.. రెండు నెలల కిందటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ అది సంబరపడేటంత మురిపెమేమీ కాదు. అదే సమయంలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయింది అన్న విషయాన్ని విస్మరించలేం. జోడో యాత్రలో, కాంగ్రెస్‌పై పెరిగిన మమకారమే తెలంగాణాలో ఆధికారాన్ని తెచ్చిపెట్టలేదు. స్థానిక పరిస్థితులు, కేసీఆర్ సర్కారుపై పెల్లుబికిన అసంతృప్తి అధికార మార్పు జరిగేలా చేశాయి. సాధారణంగా రెండు దఫాలు అధికారంలో కూర్చున్న ఏ పార్టీకైనా ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉండటం సహజం. దీనికి నిదర్శనం ఉభయ పక్షాల మధ్య ఉన్న గెలుపు ఓటముల అంతరాలే. భారాసా స్వయంకృత చేష్టలు ఆ పార్టీని 39 సీట్లకే పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్ల బొటాబొటీ మెజార్టీతో అధికార పీఠాన్ని అప్పగించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి లాంటి వాళ్ళ ప్రయత్నాలు, 6 గ్యారంటీల పథకాలు తమవంతు సాయం అందించాయి. మరోపక్క కాంగ్రెస్ గ్యారంటీలు అమలులో ఎంత ఇబ్బందికరమో అనుభవైక వేద్యమవుతోంది. ఇలాంటి హామీలు, యాత్రలను నమ్ముకుని కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం కల్లే అవుతుంది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నపై చెల్లెలి అస్త్రాన్ని ప్రయోగించినా ప్రయోజనం శూన్యమే. ఇటీవల ఇండియాటుడే సమ్మిట్‌లో ఆంధ్ర ముఖ్యమంతి జగన్మోహన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ వైస్సార్సీపీ, టీడీపీ, జనసేనల మధ్యే ఉంటుందని, తన చెల్లెలి చేరిక తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోదని తేల్చిపడేశారు కూడా.. వాస్తవానికి ఆయన చెప్పింది అసెంబ్లీ ఎన్నికల గురించే అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకూ ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు. -బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు ఇదీ చదవండి: కొంప ముంచే డైరీలు..! -
‘‘బీఆర్ఎస్ ఓటమికి ఆర్టీసీ కార్మికులు కృషి చేశారు’’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో 100 కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ‘కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు అనుకున్నారు కానీ పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని విస్మరించింది. ఎంతో మంది ఆర్టీసి కార్మికులు ప్రాణ త్యాగం చేశారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీ కృషి ఏంతో ఉంది. మహాలక్ష్మి స్కీమ్‌ను మేనిఫెస్టోలో పెట్టాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకం అమలు చేశాం. 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఆర్టీసి లో ఉచితంగా ప్రయాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అంకెలతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గత ప్రభుత్వాల బడ్జెట్ వాస్తవ రూప దాల్చదు అని అధికారులు అన్నారు’అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి.. బడ్జెట్‌పై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు -
Ts: బడ్జెట్‌పై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని, ప్రజాపాలన అబాసుపాలయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వాగ్దాన భంగాలేనన్నారు. బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్‌రావు మాట్లాడారు. ‘బడ్జెట్ ప్రజలకు నమ్మకం ఇవ్వలేదు. అన్నదాతలను అగం చేసే విధంగా ఉంది. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టే విధంగా బడ్జెట్ ఉంది. వ్యవసాయ రంగానికి కేటాయించిన 19 వేల కోట్ల నిధుల్లో రైతు భరోసా ఎలా అమలు చేస్తారు ? రైతు భరోసాకు 22 వేల కోట్ల రూపాయలు అవసరం. రైతు రుణమాఫీ కి మొండి చేయి చూపారు. రైతు బీమకు కేటాయింపులు ఎక్కడ ? పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన మాటలు బోగస్ గా మారాయి. రైతులను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. 24 గంటల కరెంట్ సరఫరా ఎక్కడ ఇస్తున్నారో చూద్దాం పదండి. లాగ్ బుక్‌లు పరిశీలిద్దాం రండి. ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామని చెప్పారు. రెండు సమావేశాలు అయిపోతున్నాయి ఎక్కడ చట్టం ? వంద రోజుల్లో హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తోంది. ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది. జనవరి నెల అసరా పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఇవ్వాల్సి ఉన్నా వాటికి నిధుల కేటాయింపుపై ప్రస్తావనే లేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్‌పై విచారణకు ఆదేశిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చులపై విచారణ జరిపిస్తామన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. శాండ్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం రేషన్ కార్టుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు. కాళేశ్వరం టూర్‌కు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలి. ఒకరోజు ముందు వెనుక అయినా మేం రెడీగా ఉన్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. గత బడ్జెట్ కంటే ఈ సారి 23 శాతం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు. మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నాం. ఇరిగేషన్లో గతంలో రూ.16 వేల కోట్లు అప్పులు కట్టారు. ఇరిగేషన్‌పై శ్వేతపత్రం ఇస్తాం. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను సైతం పిలుస్తాం. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జ్యుడీషియల్ ఎంక్వైరీలో దోషులు తేలుతారు. మాట్లాడదాం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుకు లక్షా 25 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో మాత్రం కేవంల రూ. 53వేల కోట్లు కేటాయించారని విమర్శించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. ప్రతి మీటరుకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్గొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి.. నల్గొండ దద్దరిల్లేలా కేసీఆర్ సభ -
నల్గొండ దద్దరిల్లేలా కేసీఆర్ సభ: జగదీష్‌రెడ్డి
సాక్షి, నల్గొండ: నల్గొండ దద్దరిల్లేలా ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభ ఉంటుందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల సాధాన కోసం బీఆర్ఎస్ నల్గొండలో నిర్వహిస్తున్న చలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీష్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు కేసీఆర్ స్వయంగా హాజరై కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడతారని చెప్పారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామంటున్న రేవంత్‌రెడ్డిది నీచ సంస్కృతి. ఇవాళ దొంగల చేతికి తెలంగాణ పోయింది. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకురాకుంటే కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లో తిరగనివ్వం’ అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఆధీనంలో కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇదీ చదవండి.. సీఎం రేవంత్‌రెడ్డి పర్ఫక్ట్ లీడర్: కేఏ పాల్ -
సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్ అని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి తాను విదేశీ పర్యటనలకు వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నామని వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో కేఏ పాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిపారు. అదానీ, అంబానీకి 25 లక్షల కోట్ల రూపాయిలు మాఫీ చేశారని కేఏ పాల్ ఆరోపించారు. గత 10 ఏండ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్ధిక బడ్జెట్ ను చక్కదిద్దాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడని అన్నారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం -
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం
కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం