breaking news
-
వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్
సాక్షి, హైదరాబాద్: ‘మీరు అధికారంలో ఉన్నారు. మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరపండి. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. మేము తప్పు చేయలేదు. భయపడేది లేదు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నమే తప్ప, రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేయడం లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలని చేస్తున్న యత్నాన్ని విరమించుకొని, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో చేసిన మంచి పనులు కనిపించకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తే అంతిమంగా ప్రజలే నష్టపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరమంటూ అది ‘వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్’ అని ఎద్దేవా చేశారు. మిడ్‌మానేరు జలాశయం నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో పూర్తైందని రుజువు చేస్తే రాజీనామా చేసి మళ్లీ సభలో అడుగుపెట్టనని సవాల్ చేశారు. శనివారం శాసనసభలో ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... సీడబ్ల్యూసీ సూచనల మేరకే... ‘కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ఏడేళ్లలో కనీస అనుమతులు తీసుకురాలేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టుకు అనుమతి రాలేదు. దీనికోసం 2014 వరకు రూ.6,116 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీ సీఎంకు ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు, చేసే ఖర్చు వృథా అవుతుందని లేఖ రాశారు. అయినా పట్టించుకోలేదు. ఆ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అనుమతుల కోసం యత్నించినా, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, జలాశయాల సామర్థ్యం సరిపోదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ సూచనల మేరకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు తక్కువ వచ్చిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. మీరు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారమే కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు వచ్చింది. కాళేశ్వరం ద్వారా నిండిన చెరువులు, కుంటలు, స్టేజ్–1, స్టేజ్–2లలో జరిగిన స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చాం. ఏ ప్రాజెక్టుకైనా ప్రారంభించిన వెంటనే కొత్త ఆయకట్టు రాదు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ఎడమకాలువ, దేవాదుల, కల్వకుర్తి మొదలైనప్పుడు అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇదే. శ్వేతపత్రంలో అబద్ధాలనే పొందుపరిచారు. మిడ్ మానేర్‌కు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేమొచ్చాక రూ.775 కోట్లు ఇచ్చాం. మేమే పూర్తి చేసి నీళ్లిచ్చాం. రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నారు... అది తప్పు. కేఆర్ఎంబీకి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదని చెప్పడం కూడా తప్పే. మేము దీన్ని వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్‌కు రిఫర్ చేయాలని చెప్పాం. కేఅర్ఎంబీకి అప్పగించింది మేం కాదు. మేడిగడ్డను పునరుద్ధరించి నీళ్లివ్వండి మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరించకుండా సాగదీస్తున్నారు. మొత్తం కూలిపోతే రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు అనుమానం వస్తోంది. వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణ పనులు చేయాలి. పదేళ్లలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం. 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం. ప్రాజెక్టుల అంచనాలు పెరగడం కొత్త కాదు. కాళేశ్వరం ఒక్కటే పెరగలేదు. నాగార్జున సాగర్ అంచనా 9.7 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల అంచనాలు పెరిగాయి. కృష్ణా నుంచి 299 టీఎంసీలు కాదు, 600 టీఎంసీలకు పైగా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. టీవీలో నా ముఖం చూపించడం లేదట.. శ్వేతపత్రంపై చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అడ్డుతగిలారు. దీంతో హరీశ్‌రావు పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ ‘నేను శ్వేతపత్రంపై వివరణ ఇవ్వాలో లేదా మంత్రులు మాట్లాడే మాటలకు వివరణ ఇవ్వాలో తెలియట్లేదు?’ అని పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన స్పీకర్‌నుద్దేశించి ‘నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే టీవీలో నా మొహం చూపిస్తలేరంట. ఇప్పుడే మా ఆవిడ ఇంట్లో టీవీ చూసి కాల్ చేస్తే.. మా పీఏ కాగితం పంపించాడు. గొంతు వినిపిస్తోందట కానీ నా ముఖం బదులు స్పీకర్ లేదా సీఎంను చూపిస్తున్నారట. నా ముఖం కూడా చూపించండి’ అని అన్నారు. దానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ ‘మీరు సీనియర్ సభ్యులు. అలా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడితే వారినే చూపిస్తారు’ అని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబుతో హరీశ్ భేటీ... భోజన విరామ సమయంలో లాబీల్లోని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు గదికి హరీశ్‌రావు వచ్చారు. అప్పుడు శ్రీధర్ గదిలో లేకపోవడంతో వెనక్కు తిరిగారు. అంతలోనే లాబీల్లో శ్రీధర్‌బాబు ఎదురుపడి హరీశ్‌ను తన వెంట తీసుకెళ్లారు. శ్వేతపత్రంపై చర్చ ఎంత సేపు జరగనుంది, సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై మాట్లాడతారా అన్న విషయాల గురించి హరీశ్ అడిగినట్టు తెలిసింది. నీటిపారుదల ప్రాజెక్టులపై చాలా మంది సభ్యులు మాట్లాడతామని కోరుతున్నారని, వారందరికీ అవకాశం కల్పిస్తామని శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టింది స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టిందని, దీనిపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమల్ని ఇరికించబోయి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుందని, నాలుగు ఎంపీ సీట్లలో గెలుపు కోసం దీన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన అన్న విషయాన్ని గుర్తుచేశామని, ఇదే కాగ్ తమను ఎన్నోసార్లు మెచ్చుకుందని చెప్పారు. -
ఇంత అవినీతి ఎక్కడా లేదు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్వాతంత్య్ర భారత చరిత్రలో మరెక్కడా జరిగి ఉండదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశ సాగునీటి రంగంలో మరెక్కడా జరగకూడదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో ప్రారంభించి ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున పెంచుతూపోయి... చివరికి రూ.4,500 కోట్లకు చేర్చారని చెప్పారు. వందేళ్లు నిలవాల్సిన బ్యారేజీ.. అవినీతి, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్వహణ–పర్యవేక్షణ లోపాలతో మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించారు. అధికారం అప్పజెప్తే మరమ్మతులు చేయిస్తామనే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ శనివారం రాష్ట్ర సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదికలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలోని ముఖ్యాంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సభలో ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 7 వరకు కూడా నాటి సీఎం కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదు. బ్యారేజీ నిర్మాణానికి పెద్ద మనుషులు వాళ్లే.. చీఫ్ ఇంజనీర్లు వాళ్లే.. చీఫ్ డిజైనర్లు వాళ్లే. ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని (యూజ్లెస్) ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మేడిగడ్డ తరహా డిజైన్లతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని.. వాటిలో కూడా నీళ్లు నింపవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ నిపుణులను రమ్మని కబురు పంపాం. రెండు రోజుల్లో వస్తామన్నారు. సత్వరమే బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ బ్యారేజీలను కట్టినవారు సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాగ్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికలో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలున్నాయి. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. రూ.35,800 కోట్ల అంచనాతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తప్పుబట్టింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ అనుమతివ్వడానికి ముందే కాంట్రాక్టర్లకు తొందరపడి పనులు అప్పగించారని ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని చెప్పింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లుకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను నడిపితే రోజుకు గరిష్టంగా 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉంటుందని తేలి్చంది. మల్లన్నసాగర్ బ్యారేజీ కింద భూగర్భంలో చీలిక ఉందని, చిన్న భూకంపం వచ్చినా బ్యారేజీ దిగువన ఉండే ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించింది. కాళేశ్వరం అప్పులు చెల్లించడానికి రూ.15వేల కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.10వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాపంగా, గుదిబండగా మారింది. బ్యారేజీలను పునరుద్ధరిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం చాలా తీవ్రమైనది. మా ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెట్టబోదు. వాటిలోని లోపాలను గుర్తించి, మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను ఎన్డీఎన్ఏకు అప్పగించాం. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే మరమ్మతులపై ముందుకు వెళ్తాం. బ్యారేజీలను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్‌కు మంచిపేరు రావొద్దనే రీఇంజనీరింగ్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దని, తమ సొంత ముద్ర ఉండాలనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసింది. వాటి అంచనా వ్యయాన్ని అనేక రెట్లు పెంచింది. కాళేశ్వరం నిర్మించాలనేది తప్పుడు నిర్ణయం. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూ.41వేల కోట్లతో పూర్తయ్యేది. పైగా ఆ డ్యామ్ కూలింది.. ఈ డ్యామ్ కూలిందంటూ మేడిగడ్డ కుంగిపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలా ముందుకు సాగాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ముందుకు సాగుతాం. ఫాస్ట్‌ట్రాక్ కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కొడంగల్–నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, డిండి, ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్‌మానేరు, కొమురంభీం, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలోగా 7లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించుకోవడానికి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో కలిసి నీటివాటాల గురించి చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు జరుగుతున్న సమయంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తలపెడితే.. వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలం అర గంట జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్టు టెండర్లు ఆగిపోయేవి. కానీ ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాకే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
వా‘ఢీ’.. వే‘ఢీ’!
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది రోజులపాటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నడుమ తీవ్ర వాగ్యుద్ధాల నడుమ సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024–25 సమావేశాలు శనివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన భేటీలో ‘తెలంగాణ సాగునీటి రంగంపై శ్వేతపత్రం’పై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమైన సమావేశాలు 8 రోజులపాటు సాగాయి. 8 రోజుల్లో 45 గంటల 32 నిమిషాలపాటు సభ జరగ్గా, 59 మంది సభ్యులు ప్రసంగించగా, జీరో అవర్‌లో 64 మందికి మాట్లాడే అవకాశం దక్కింది. రెండు ప్రభుత్వ తీర్మానాలు, మూడు బిల్లులను పెట్టగా, ఒక స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలిసారిగా సభకు ఎన్నికైన సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించడంతోపాటు వారి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో సుదీర్ఘంగా జీరో అవర్ నిర్వహించారు. మేడిగడ్డ సందర్శన.. చలో నల్లగొండ ఈ నెల 8న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. 10న రూ.2.75లక్షల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశ పెట్టారు. 11న విరామం ప్రకటించి.. 12న తిరిగి సమావేశమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగాల్సి ఉండగా, ఎజెండాను వాయిదా వేసి ‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు’కు తాము విధించే షరతులను ఆమోదిస్తేనే నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగిస్తామంటూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చ కూడా విమర్శలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పక్షాలను ఆహ్వానించారు. 13న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎలాంటి ఎజెండాను చేపట్టకుండానే వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా అధికార కాంగ్రెస్‌తో పాటు ఎంఐఎం, సీపీఐ సభ్యులు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ అదే రోజు బీఆర్ఎస్ నిర్వహించిన ‘చలో నల్లగొండ’సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. 14న బడ్జెట్ ఆమోదం ఈ నెల 14న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై అసెంబ్లీ చర్చించగా, 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానంతో ఆమోదం పొందింది. అదే రోజు ద్రవ్య వినిమయ బిల్లుపైనా చర్చించి ఆమోదించారు. 16న కులగణన బిల్లుపై చర్చించి సభ ఆమోదించింది. 17న సాగునీటి రంగం శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతించకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఇరుకైన గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లును సభ ఆమోదించింది. బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేందుకు ఉభయ పక్షాలు పోటాపోటీగా చేసిన ప్రసంగాలు హోరాహోరీగా సాగగా.. పలుమార్లు రగడకు దారితీశాయి. విపక్ష బీజేపీ, ఎంఐఎం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్పై సున్నిత విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకున్నాయి. సీపీఐ ఏకైక సభ్యు డు కూనంనేని సాంబశివరావు అధికార కాంగ్రెస్‌ను సమర్థిస్తూనే ఉభయ పక్షాల వైఖరిని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ సభకు గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ పదేపదే ప్రస్తావించింది. -
మీలా ఆత్రుత పడం.. తప్పులు చేయం
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరాన్ని తొందరగా కట్టేయాలనే ఆత్రుత తప్ప అసలు ఆ ప్రాజెక్టు మనుగడ గురించి ఆలోచించలేదు. కటాఫ్‌వాల్ డిజైన్ మార్చకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఆర్సీసీతో కట్టి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఇసుకను సరైన విధంగా గట్టిపర్చలేకపోవడం వల్ల నష్టం జరిగింది. ఆర్సీసీతో వాల్ కట్టి ఉంటే రాఫ్ట్ కుంగేది కాదు.. డ్యామ్ కుచించుకుపోయి పగుళ్లకు ఆస్కారం ఏర్పడేది కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలోని ఈ మూడు పిల్లర్లే కాదని, అన్నారంలో కూడా బుడగలు వస్తున్నాయని, సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ మొదలైందని చెప్పారు. ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆత్రుత పడేది లేదని, తప్పులు చేసేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిందే తానని, తన మెదడులోనే ప్రాజెక్టు డిజైన్ ఉందని చెప్పే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి ఉంటే తనకున్న సమస్యకు పరిష్కారం చెప్పేవారు కదా అని ఎద్దేవా చేశారు. నాడు ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కలిసి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పవిత్ర దేవాలయం అని చెప్పిన కేసీఆర్‌కు అదే ప్రాజెక్టు బొందలగడ్డ ఎలా అయిందని ప్రశ్నించారు. పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే.. కనీస పరిశోధనలు లేకుండానే కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించి ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేశా రని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మట్టి పరీక్షలు, ఇతరాత్ర పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే ప్రాజెక్టులను కట్టడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వ్యవసాయానికి నీటిని అందించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న వాదన అర్థరహితమన్నా రు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేరా అని కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని, అక్టోబర్ 21, 2023 రోజునే పిల్లర్లు కుంగిపోయాయని, అప్పటి నుంచి దాదాపు 45 రోజుల పాటు కేసీఆరే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నా రని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అంచనాలు పెంచి అవినీతి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డు వచ్చిన భట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ల అంచనాలు పెంచారని చెప్పారు. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిట్టనిలువునా చీలిపోవడానికి గత పాలకులే కారణమని, అన్నారం, సుందిళ్ల కూడా అవే పరిస్థితుల్లో ఉన్నాయన్నా రు. 15.5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రూ.38 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వివిధ పను ల కోసం ఖర్చు చేయగా, మరో రూ.28 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతితో వ్యయం పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇంది రా సాగర్ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, రీ డిజైనింగ్ పేరుతో రూ.23 వేల కోట్లకు పెంచి ఇప్పటివరకు ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు ఖర్చు, నిర్వహణ ఖర్చు కలిపి ఏటా రూ.20 వేల కోట్లు అవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా కట్టాలని భట్టి ప్రశ్నించారు. -
రాష్ట్రానికి చెదలు పట్టించింది మీరే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని కాదని, అది తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్, హరీశ్ కలసి తెలంగాణకు చెదలు పట్టించారని, వారు ఎంత ద్రోహం చేశారో ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ పుర్రెలోనే పురుగులా పుట్టిందని, ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారని విమ ర్శించారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు అవాంఛనీయమని, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని ఐదుగురు సభ్యుల రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పినా పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఖజానాను కొల్లగొట్టడానికే దుర్మార్గానికి తెగబడ్డారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతున్న సమయంలో.. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించింది. నాడు ప్రాణహిత నది మీద తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 1,850 ఎకరాల పట్టా భూమి మునుగుతుందని, గ్రామాలేవీ ముంపునకు గురికావని తేల్చారు. అదే 150 మీటర్ల ఎత్తుతోనే కడితే 1,250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని గుర్తించారు. ప్రాణహిత–చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు నాటి మహారాష్ట్ర సీఎంతో, ఉమ్మడి ఏపీ సీఎం చర్చించారు. 2012లో స్టాండింగ్, కో–ఆర్డినేషన్ కమిటీలు వేశారు. మేడిగడ్డ నిరుపయోగమని చెప్పినా.. తెలంగాణ వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు.. గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరామ్ నేతృత్వంలో ఐదుగురు ఇంజనీర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ 14 పేజీలతో నివేదిక ఇచ్చింది. అప్పటికే శంకుస్థాపన కూడా చేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కాకపోతే 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించాలని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు అవాంఛనీయమని తేల్చి చెప్పింది. అయినా మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టడం సరికాదంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇచి్చన నివేదిక ఆధారంగా 2015 సెపె్టంబర్లో ‘సాక్షి’ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. సభలో క్షమాపణలు చెప్పాలి కేసీఆర్, హరీశ్ కలసి ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టి.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టారు. రూ.38వేలకోట్ల నుంచి రూ. 1.47 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశారు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగబడ్డారు. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీశ్‌రావుకు గౌరవం ఉండేది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశి్నస్తారా? ప్రాజెక్టులు ఫక్కున పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా? హరీశ్‌రావును నేను నిలదీస్తున్నా.. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు వద్దు. ప్రాణహిత–చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. నాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క ఇప్పుడు మౌనంగా హరీశ్‌రావు గారిని సమరి్ధస్తున్నారా? జరిగిన తప్పులకు హరీశ్ క్షమాపణ చెప్పాలి. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినపుడు.. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో నాటి మంత్రులు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పులు ఒప్పుకోవాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు సభను సజావుగా నడిపించడంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రేవంత్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సాగునీటి రంగంపై శాసన సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చ నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం ఈ మేర కు ప్రకటన చేశారు. కేంద్రమంత్రి, మంత్రి, సీఎంగా వివిధ హోదాల్లో 40 ఏళ్లు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తన పాత్ర పోషించారని తెలిపారు. -
Ts: ప్రభుత్వానిది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్‌పేపర్: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని బీఆర్ఎస్ చెప్పించిందని, ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాపాయింట్లో హరీశ్‌రావు మాట్లాడారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో కేఆర్ఎంబీపై ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు. ‘ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై నిలదీశాం. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వారి ప్రెజెంటేషన్లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియజేయాలి.మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామంటే వినడం లేదు. కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మాజీ ప్రధాని మీ మన్మోహన్ సింగ్ గారే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్‌ను తప్పుపట్టారు. ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నది. ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సంక్షేమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. బీజేపీ నేత ఈటల క్లారిటీ -
తెలంగాణలో బీజేపీ పొత్తులు.. గుజ్జుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేనతోనూ ఈసారి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోము. కొంతమంది జోకర్లు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటింగ్ శాతం రెట్టింపయింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నాం’ అని ప్రేమేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. ఈటల క్లారిటీ -
TS: కాంగ్రెస్‌లో చేరిక.. ఈటల క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చేరనున్నారన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదని తెలిపారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో వారిద్దరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను కొందరు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. మైనంపల్లి, పట్నంను రాజకీయాల కోసం కలవలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నానని,పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆ జెడ్పీచైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ -
కాంగ్రెస్‌లో చేరిన వెంటనే.. ఆ జెడ్పీ చైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్‌రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బర్త్ డే విషెస్ -
మామా అల్లుళ్లు రాష్ట్రాన్ని చెదలు పట్టించారు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి ప్రాజెక్ట్‌ల పేరుతో దోచుకున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గోదావరి జలాల వినియోగంపై అధికారులు పూర్తి నివేదిక ఇచ్చారు. రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికలోని అంశాలను సభ ముందు ఉంచుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారమని అప్పుడే నిపుణులు చెప్పారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది. 14 పేజీలతో రిటైర్డ్ ఇంజినీర్లు ఈ నివేదిక ఇచ్చారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ కట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన. మేడిగడ్డ వద్దే ప్రాజెక్ట్‌లు కట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజానీకానికి కళంకంగా మారింది. దోచుకోవాలని దాచుకోవాలనే ఆలోచనతోనే మేడిగడ్డ కట్టారు కూలిన ప్రాజెక్ట్‌ను చూసి మీరు సిగ్గుపడాలి. ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తుంది. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది కూడా మేమే. తప్పులు ఒప్పుకోండి.. కప్పిపుచ్చుకోండి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆటంకాలు తొలగించడానికి బోర్డు, కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. హరీష్‌రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. వాళ్లు నియమించుకున్న ఇంజినీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు. తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్ట్ కట్టాలని నివేదిక ఇప్పించుకున్నారు. మేడిగడ్డ మేడిపండేనా సాక్షిలో కథనం కూడా వచ్చింది. ప్రజలు నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు. కాళేశ్వరంతో చేవేల్లకు అన్యాయం చేశారని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారు. నేడు ఇదే సభలో హరీష్ అబద్దాలు చెబుతుంటే ఏం మాట్లాడకుండా సెలైంట్‌గా చూస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు సాగు నీటి మంత్రిగా కొనసాగి.. ఆ తరువాత హరీష్‌ను ఎందుకు బర్తరఫ్ చేశారు. విచారణకు వెళ్లి ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి అంటూ విమర్శలు చేశారు. -
హరీష్ రావు Vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖపై అధికార కాంగ్రెస్ నేతలు వర్సెస్ మాజీ మంత్రి హరీష్‌రావు అన్నట్టుగా వాడీవేడి చర్చ నడుస్తోంది. మంత్రులు, హరీష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సభలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం వల్లే రీడిజైన్ చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ జలాలు పెరిగాయి. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. ఎస్ఆర్ఎస్పీ-2కు నీళ్లిచ్చిన ఘనత మాది. కేసీఆర్ వచ్చాకే రెండు పంటలకు నీరిచ్చాం. కాంగ్రెస్ పాలనలో నీరు రాలేదు ఎందుకు.. కేసీఆర్ వచ్చాకే ఎలా నీళ్లు వచ్చాయి. ►బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రతీసారి అబద్ధాలే చెబుతున్నారు. గోబెల్స్ అవార్డు ఉత్తమ్‌కే ఇవ్వాలి. ►30 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు వచ్చింది. కల్వకుర్తి ప్రాజెక్ట్ కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్‌ది సెల్ఫ్‌గోల్. కాగ్ నివేదికకు ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. కాగ్ రిపోర్ట్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పుపట్టాయి. కాగ్ నివేదిక తప్పులతడక అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాగ్ నివేదికల్లో ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. ►రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నాలుగు అంశాలు అబద్ధాలే. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశాం. ►ఖర్చులు వర్సెస్ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది. ►రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్పటి ప్రభుత్వం (బీఆర్ఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లో ఈ జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం. మేం అసలు ఫిర్యాదే చేయలేదనే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు అంటూ కామెంట్స్ చేశారు. -
అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే విషెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేత పత్రంపై అధికార-ప్రతిపక్షం నడుమ వాడీవేడిగా వాదనలు జరుగుతున్న టైంలో.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సీటులోంచి లేచారు. మాజీ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే.. ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ పున్నర్మిణంలో.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన. కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలని.. ఆయన మరింత కాలం తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని తమ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. -
‘రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్కరోజే కాళేశ్వరానికి..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా గత బీఆర్ఎస్ సర్కార్ పాలన, నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ సభలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విస్తరుపోయే విషయాలను కాగ్ చెప్పింది. కాగ్ సూచించిన అంశాలపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్ట్‌లను కొనసాగించారు. 81వేల కోట్ల ప్రాజెక్టుకు CWC అనుమతి ఇస్తే ఒక లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెంచారు. 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు. మొత్తం ఖర్చు 54,234కోట్లు. 2014 వరకు ఒక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు. 2014-23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు. కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు. ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు. పీక్ ఎనర్జీ డిమాండ్ ఉన్న రోజు 203 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. ►కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి చుస్తే ఖర్చు రెండు లక్షలకు పోయే ప్రమాదం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజుకే అవసరమవుతుంది. ఏడాదికి పదివేల ఐదు వందల కోట్లు కరెంట్ బిల్లులు కాళేశ్వరానికి అవసరం అవుతుంది. ►మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మల్లన్న సాగర్ కూడా ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని CAG స్పష్టం చేసింది. ►అన్నారం బ్యారేజ్‌లో నిన్నటి నుంచి లీక్ మొదలైంది. NDSAకు సమాచారం ఇస్తే నీళ్లను వదిలిపెట్టాలని వాళ్ళు సూచించారు. మేడిగడ్డ తరహాలో అన్నారం కుంగిపోయే ప్రమాదం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ఆపరేషన్ చేయలేదు. ►1800 కోట్లకు మేడిగడ్డ టెండర్ పిలిచి నాలుగు వేలకోట్లు చెల్లించారు. మేడిగడ్డ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. డిజైన్, క్వాలిటీ లోపం స్పష్టంగా ఉంది. ►అక్టోబర్‌లో డ్యామ్ డ్యామేజ్ అయిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ►మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదు. కాళేశ్వరం నిర్మాణంలో అలసత్వం వహించిన అధికారులను ఇప్పటికే కొందరిని తొలగించాం. ►ప్రాజెక్ట్‌ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీ వాడుకుంటున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కృష్ణా జలాలను ఏపీ ప్రబుత్వం యథేచ్చగా మళ్లించుకుంది. ►కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట 68 శాతం ఉంటే గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది. పోలింగ్ రోజు ఏపీ ప్రభుత్వం సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించింది. కాంట్రాక్టర్లకు వేల కోట్లును కట్టబెట్టారు. ►గత ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్‌లు అప్పగిస్తూ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం మూడేళ్లలోనే కుంగిపోయింది. ఇలా కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్లను నింపే ప్రక్రియను ఆపేసింది. ►కడెం ప్రాజెక్ట్‌ను పట్టించుకోకపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో, ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మూసీ ప్రాజెక్ట్ గేటు కూడా కొట్టుకుపోయింది. ►మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. ►ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి అయ్యింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. గత పదేళ్లలో ప్రాజెక్ట్‌లకు అనాలోచితంగా ఖర్చు చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్ట్‌లను నిర్మించాలి. ఐదేళ్లలోనే కాళేశ్వరం మూలకు పడింది. ►తెలంగాణ రైతుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు బ్యారేజ్‌లను NDSAకు అప్పగించి విచారణ చేయిస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లపై విచారణ NDSA రిపోర్ట్‌తో చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాము. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లను గుర్తించారు. రిపేర్ చేయాలని 18-05-2020న ఇరిగేషన్ శాఖ ఎల్ అండ్ టీకీ నోటీసులు జారీ చేసింది. 28-04-2023న మరోసారి సీసీ-బ్లాకులు కొట్టుకుపోయాయి. ఇరిగేషన్ శాఖ సూచనల మేరకు పనులు జరగలేదు. తనిఖీ నివేదికలు లేకుండా డీవియేషన్లకు ఆమోదం తెలిపారు. 2019 నుంచి బ్యారేజ్ నిర్వాహణ చేయలేదు. బ్యారేజ్ నిర్మాణం తర్వాత షీట్ ఫైల్స్, కాఫర్ డ్యామ్‌ను తొలగించలేదు. పనులు పూర్తి చేయకముందే ఏజెన్సీకి బ్యాంకు గ్యారెంటీలు విడుదల చేయాలని ఈఎన్సీ సిఫారసు చేసింది. -
తెలంగాణ అసెంబ్లీ: ఇరిగేషన్‌పై మాటల యుద్ధం
Updates.. తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ 45 గంటల 32నిమిషాల పాటు నడిచిన అసెంబ్లీ 8 రోజుల శాసనసభ పనిదినాల్లో 59 మంది సభ్యులు మాట్లాడారు జీరో అవర్ లో 64మంది వారి సెగ్మెంట్ అంశాలను ప్రస్తావించారు ప్రభుత్వ ప్రకటనలు రెండు, మూడు బిల్లులకు ఆమోదం, ఒక లఘు చర్చ అసెంబ్లీ ఆవరణలో మల్లా రెడ్డి చిట్ చాట్ వీళ్ళకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదు రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ లీకేజ్ అయింది.. సరి చెయ్యాలి ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ హరీష్ రావు వన్ మెన్ హీరో మేడిగడ్డలో రిపేర్ కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే ఆయనే సరి చేస్తాడు అన్నారం డ్యామేజిపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన అన్నారం డ్యామేజీపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన చేసి చూపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం డ్యామేజి సీరియస్ అంశం మూడు బ్యారేజిలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ(ఎన్డీఎస్ఏ)కు అప్పగిస్తాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారాంగానే నీళ్లు నింపాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు కాళేశ్వరంనకు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్పైపై చర్చ కు ఎందుకు రావడం లేదు ఒకనాడు కేసీఆర్‌కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదు. ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాంలోనే జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా హరీష్‌రావు చిట్ చాట్@అసెంబ్లీ లాబీ నేను అసెంబ్లీలో కీలక అంశం మాట్లాడే టైంgలో మైక్ కట్ చేస్తున్నారు ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారు ఈ రోజు గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేసారు నేను మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు స్పీకర్‌కు స్లిప్ పంపుతున్నారు నా డ్యూటీ విషయంలో నేను వెనక్కి తగ్గను నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీ కి వచ్చాను నిన్ననే అసెంబ్లీ క్లోజ్ చేయమని చెప్పాం 3 గంటలు జీరో అవర్, 3 గంటలు బీసీ బిల్లు, 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు.. మంత్రి భట్టి మాట్లాడుతూ.. కావాలనే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచారు లక్షల కోట్లు వృధా చేశారు హరీష్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు కాళేశ్వరం తెలంగాణకు కళంకంగా మారింది సాగునీటి మంత్రిగా హరీష్‌ను ఎందుకు తప్పించారు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారు ఈ పాపాలన్నింటికి హరీష్, కేసీఆరే కారణం తెలంగాణను చెదలు పట్టించారు హరీష్ మారాడు అనుకున్నా.. కానీ ఇంకా దిగజారాడు చేవెళ్లపై గతంలో సబితక్క(సబితాఇంద్రారెడ్డి) ధర్నా చేశారు ఇప్పుడు సబితక్క మాట్లాడకుండా హరీష్‌ను సమర్థిస్తున్నారు చేవెళ్ల ఎండిపోయినా వారికి కనిపించదు కడియం కూడా మంచోడే.. కానీ, ఆ స్కూల్లో చేరాక అలా తయాయ్యాడు అది వాళ్ల బడి.. అందులో చేరగానే సిలబస్ మారిపోతుంది కూలిన ప్రాజెక్టులు చూసి సిగ్గుపడండి విచారణకు వెళ్లి తప్పు ఒప్పుకుని రండి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మాటలతో ప్రజల్ని నమ్మించలేరు గట్టిగా మాట్లాడినంత మాత్రానా అబద్ధాలు నిజాలు అయిపోవు హరీష్‌రావు మాట్లాడుతూ.. సీఎం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించాం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదుకే క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ గతంలో దేవాదుల పైపులు, పగిలాయి.. టెన్నెల్స్ కూలాయి మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరించాం.. చెరువులు తెగిపోవడం తగ్గింది ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు.. రైతులకు అన్యాయం చేయొద్దు కేసీఆర్ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేశం మేడిగడ్డ.. కేసీఆర్ ఆలోచనే: సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్ఆలోచన అక్కడే కట్టాలని కేసీఆర్ ఆదేశించారు వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు వాళ్లు కూడా తుమ్మడిహట్టి దగ్గరే నిర్మించాలని చెప్పారు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది హరీష్‌రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగింది తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే గోదావరి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలోని వివరాలనే ఇప్పుడు సభ ముందు ఉంచుతున్నాం ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ బయటపెట్టే యత్నం చేస్తున్నారు ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తోంది వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు తప్పు ఒప్పుకోండి.. కప్పి పుచ్చుకోకండి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణా జలాల్లో ఎక్కువ దోపిడీ జరిగింది హరీష్‌రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు గోబెల్స్ హరీష్‌రావు అని పేరు పెట్టుకోండి పదేపదే అబద్ధాలు చెప్పడం మానుకోండి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ మాట్లాడిన ప్రతీసారీ అబద్ధాలే చెబుతున్నారు అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం కాంగ్రెస్ హయాంలోనే అవినీతి.. అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు ప్రాణహిత చేవెళ్లను మేం మార్చాలనుకోలేదు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు గనుకే రీ డిజైనింగ్ చేశాం ఎస్ఆర్ఎసీ-2కి నీళ్లు ఇచ్చిన ఘనత మాది తెలంగాణ ఏర్పాడ్డాక.. భూగర్భ వనరులు పెరిగాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు అవినీతి ఆరోపణలపై ఏ ఎంక్వైరీకైనా రెడీ మంత్రి భట్టి మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ నిట్టనిలువునా చీటింది కాళేశ్వరంలో నాణ్యత లేదు మేడిగడ్డ ఒక్కటే కాదు..మిగతా రెండూ నాణ్యత లేవని NDSA తేల్చింది రూ.94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతోంది గత గవర్నర్ హరీష్‌రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది.. ఆ విషయం కాగ్ కూడా చెప్పింది ఉత్తమ్ చెప్పిన విషయాల్ని నిజమని ఒప్పుకోండి కూలిన దానికి తప్పు ఒప్పుకోండి ఇంకా సమర్థించుకోవడం సరికాదు ఇరిగేషన్‌పై వాడీవేడి వాదనలు ఇరిగేషన్ శ్వేత పత్రంపై శాసన సభలో మాటల యుద్ధం మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని కార్నర్ చేసిన అధికార పక్షం తప్పుమీదంటే మీదంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు లేచి బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి కృష్ణాజలాల విషయంలో అన్నీ సక్రమంగా చేశామని అంటున్నారు: మంత్రి జూపల్లి మరి స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి?: మంత్రి జూపల్లి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హరీష్‌రావు చెప్పిందే పదే పదే చెబుతున్నారు కేసీఆర్, జగన్ చాలాసార్లు నీటివాటాపై చర్చింఆరు అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారు ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్ నొటిఫికేషన్‌ను మేం వ్యతిరేకించాం మళ్లీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి దిగింది ఎన్నికల ప్రచారంలో గోబెల్స్‌ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేశాం సభను ఉత్తమ్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారు హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇరిగేషన్‌పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారు గత ప్రభుత్వంపై బుదర చల్లాలనే శ్వేత పత్రం ప్రవేశపెట్టారు మిడ్‌మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశాం ఇరిగేషన్‌పై చర్చకు 2గం. సమయం అవసరం మంత్రి ఉత్తమ్ ప్రసంగం అనంతరం.. తన సీట్లోంచి లేచి మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సభలో మంత్రి ఉత్తమ్.. లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చు చేసి 57లక్షల ఆయకట్టు సాగునీరు అందించింది అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కు అప్పగించి విచారణ చేయిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై విచారణ NDSA రిపోర్ట్ తో చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాం సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84వేల కోట్ల నిదులు లోన్స్ రూపంలో తెచ్చారు. అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళల్లో రూ. 1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్.. డిజైన్ లోపం ఉంది ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలు అయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిషేదిత ప్రాంతంగా ఉండేది మేడిగడ్డ కుంగుబాటు బాటు వల్ల మిగతా బ్యారేజీల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు సభలో మంత్రి ఉత్తమ్.. గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం అనాలోచితంగా ఖర్చు చేశారు ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరిగింది తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది గతంలో.. అపెక్స్ కమిటీ మీటింగ్ గత సీఎం కూడా పాల్గొన్నారు అప్పుడే కేఆర్ఎంబీకి నోటిఫికేషన్‌ను కేంద్రం రిలీజ్ చేసింది కానీ, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కేఆర్ఎంబీకి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాచింయింది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సూత్రప్రాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీ యధేచ్ఛగా నీటిని వాడుకుంది కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా దారి మళ్లించుకుంది తెలంగాణ వాటా 68 శాతం ఉంటే.. గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది పోలింగ్ రోజు సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీవాడుకుంటున్నా.. బీఆర్ఎస్ అప్పుడు పట్టించుకోలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కుంగిన ప్రాజెక్టులలో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది ఏపీకి నీళ్లను కట్టబెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయి ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ఆర్థికంగా అనుకూలమైనది కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అయ్యే కరెంట్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజే అవసరం మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది కానీ, కాగ్ అనేక లోపాలు బయటపెట్టింది మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది చిన్నపాటి భూకంపాలు వచ్చినా మల్లన్నసాగర్ తట్టుకోలేదు మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని కాగ్ పేర్కొంది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది కానీ, కాగ్ కాళేశ్వరం విషయంలో విస్తూపోయే విషయాలు కాగ్ చెప్పింది కరెంట్ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది డీపీఆర్ అఫ్రూవ్ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు కట్టబెట్టింది కాగ్ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేస్తాం గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లను కొనసాగించారు మెట్టప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం ప్రాణహిత చేవెళ్ల కింద రూ. 81వేల కోట్ల ప్రాజెక్టును సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వఅవినీతి వల్ల రూ.1లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. అవినీతి, నిర్లక్ష్యం, నాసిరకం వల్లే ఈ పరిస్థితి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం ,సుంధిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణం లో క్వాలిటీ లేదు అన్నారంకు క్రాక్స్ వచ్చాయి అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయి వెంటనే ఎన్డీఎస్ఏకి సమాచారం అందించాం నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ఉన్న నీటిని తొలగించమని చెప్పింది సభలో మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బ తింది మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది అక్టోబర్‌లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు అవినీతి, నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్ బాగా దెబ్బతింది గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్.. డిజైనర్ గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదకా జరగలేదు యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరాం నీటి పారుదల శాఖ పై శ్వేత పత్రం 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79లక్షల ఎకరాలు మొత్తం ఖర్చు 54,234కోట్లు 2014 వరకు ఓక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు 2014 నుంచి 23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పపవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయలాంటిది మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయ్ అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయింది వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్.. దురదృష్టవశాత్తూ నాణ్యతా లోపంతో మూడేళ్లకే దెబ్బతింది రూ.1,800 కోట్లకు టెండర్ పిలిచి.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది ప్రాజక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొంది అసెంబ్లీ స్పీకర్ అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించా గతంలో సీఎం గా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా..నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు మంత్రి శ్రీధర్ బాబు.. గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,టెక్నీషియన్ ద్వారా నే ఇచ్చారు స్పీకర్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదు అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావోద్దు టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దు మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి టెక్నీషియన్ ను బయటకు పంపాలి ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం. మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. ఆ మాజీమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా? అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం. మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే మేము పరిమితం కాలేదు. అందుకే సభలో తీర్మానం పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తాం ►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది. ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ►నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది. ►ఇరిగేషన్‌పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్ సర్కార్. ►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం ►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు ►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ►నిన్న జరగాల్సిన ఇరిగేషన్‌పై చర్చ నేటికి వాయిదా ►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు ►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా. -
కాంగ్రెస్ నేతలతో ఈటల ఆసక్తికర భేటీ.. హస్తం గూటికి ప్లాన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అనంతరం, కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి చేరగా.. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఇక, తాజాగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. దీంతో, ఈటల రాజేందర్ కూడా హస్తం గూటికి వెళ్తున్నారనే చర్చ మొదలైంది. అయితే, బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన అనంతరం, ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ నడిచింది. కానీ, అనూహ్యంగా ఈటల.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలో హుజురాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో(హుజురాబాద్, గజ్వేల్) పోటీచేసి ఓడిపోయారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈటల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారుతారా? లేక ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, వీరి భేటీపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ఊపందుకుంది. ఈటల కాంగ్రెస్‌లో చేరి కరీంనగర్లో నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
ఢిల్లీకి కాంగ్రెస్ సూట్‌కేసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కాంట్రాక్టర్లు, బిల్డర్లు, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్‌కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకుడు వెల్లాల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆరోపించారు. ’’కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం.. చెయ్యి గుర్తుకు ఓటేస్తే.. అదే చెయ్యిని ప్రజల తలపై పెట్టి మోసం చేస్తుందని’’ఇప్పుడు మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు. ’’దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పీవీ నర్సింహారావును మోదీ ప్రభుత్వం గౌరవించింది. పీవీ చనిపోతే.. ఆయన పారి్ధవ దేహాన్ని ఏఐసీసీ ఆఫీసులోకి రానివ్వకుండా హైదరాబాద్‌కు పంపిన చరిత్ర కాంగ్రెస్‌ది అని అన్నారు. విజిలెన్స్‌తో అయ్యేది లేదు.. పోయేది లేదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ దొందూ దొదేని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘ఈ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలే. ఇవి మజ్లిస్పంచన చేరి బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయి. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీనే కాబట్టి బీఆర్ఎస్, కేసీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్‌ప్రభుత్వానికి ధైర్యం లేదు. సీబీఐతో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తే.. విజిలెన్స్ పేరుతో కాలయాపన చేస్తోంది. విజిలెన్స్‌తో అయ్యేది లేదు.. పోయేది లేదు. గత బీఆర్ఎస్ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా వారు జీహెచ్ఎంసీ ముందు ధర్నా చేసే దుర్మార్గ స్థితికి తీసుకువస్తే.. కాంగ్రెస్ప్రభుత్వం దాన్ని మరింత దిగజార్చనుంది. హైదరాబాద్‌నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా.. జీహెచ్ఎంసీకి నిధులు ఇవ్వడం లేదు’’అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మోదీతోనే తెలంగాణ అభివృద్ధి... గత తొమ్మిదిన్నరేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ‘రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్, రూ.450 కోట్లతో కాచిగూడ, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. భద్రాద్రి అభివృద్ధికి రూ.50 కోట్లు కేంద్రం ఇచ్చిందని, వరంగల్రామప్ప దేవాలయానికి మోదీ కృషితో యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో రూ.లక్షా 20 వేల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్ఆర్రోడ్డును మోదీ మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారని, తొమ్మిదిన్నర ఏళ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని గుర్తు చేశారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్‌ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారనీ అందులో భాగస్వామ్యమయ్యేందుకు మనం సిద్ధమవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. -
బీజేపీతో టచ్‌లో బీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. బీజేపీలోకి వచ్చేందుకు వారు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తామే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరబోతున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారని, ఎవరూ పార్టీ వీడకుండా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీయేలో చేర్చుకోలేదని, ఇప్పుడు మునిగిపోయే నావ, ఒక్కసీటు కూడా రాని ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ నేతలతో సమావేశమైన సంజయ్, మలిదశ ప్రజాహిత యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అవినీతిపరులను రానీయం ‘కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు. ఒకవేళ అదే జరిగితే బీజేపీలో సగం మంది అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనుకాడతారు. కేసీఆర్ వెళ్లి కలిసినా ఎన్డీఏలో చేర్చుకునేది లేదని మోదీ తెగేసి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన బహిరంగంగానే చెప్పారు. బీజేపీకి సొంతంగానే 400 సీట్లు రాబోతున్నాయి. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించే వాళ్లు, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నోళ్లు ఎవరు వచి్చనా పార్టీ లోకి స్వాగతిస్తాం. అవినీతిపరులను మాత్రం రానీయం. ఇది మోదీ విధానం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు బహిష్కరించబోతున్నారు కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారు. ఈసారి బీజేపీకి ఓటేయాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు..కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు..ఎంఐఎం నేతలున్నరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు. బీఆర్ఎస్ అవినీతిపై కళ్ల ముందు ఇన్ని ఆధారాలున్నా కేసీఆర్, అప్పటి మంత్రులు, బాధ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు మాట తప్పుతోంది? సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తేలి్చన తరువాత కూడా సీబీఐతో విచారణను ఎందుకు కోరడం లేదు? బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్, కేటీఆర్‌ను జైల్లో వేసి, వాళ్ల ఆస్తులు జప్తు చేసే వాళ్లం..’అని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ‘తొలిదశ ప్రజాహిత యాత్రకు మంచి స్పందన లభించింది. ఈనెల 25 నుంచి మలి విడత యాత్రను కొనసాగిస్తాం. మధ్యలో మూడురోజుల పాటు (ఈ నెల 20 నుంచి) రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు బస్సు యాత్రల్లో పాల్గొంటాం. తెలంగాణలో 17కు 17 ఎంపీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ పార్లమెంట్లో బోగస్ ఓట్లు ఏరివేస్తే ఈసారి అక్కడ గెలుపు బీజేపీదే. బీఆర్ఎస్కు ఒక్కసీటు కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది..’అని సంజయ్ చెప్పారు. -
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌ను నియమించారు. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు ఉండనున్నారు.ఇప్పటికే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే -
బీజేపీతో పొత్తు ఉంటుంది: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో BRS పార్టీకి పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న BJP, BRS లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మల్లారెడ్డి ఆ మాటలు చెప్పాడా? లేక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేద" అన్నారు మల్లారెడ్డి మల్కాజి గిరి లోక్‌సభ సీటు గురించి మాట్లాడుతూ.. "మా మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ భద్రంగా వుంది, బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదే. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. నా కొడుకుకు టిక్కెట్ ఇస్తే మాదంతా ఉమ్మడి కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు వుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏం చేయలేను" అన్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? ఇవ్వాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే..
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మున్షీ వీరికి హస్తం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి.. అక్బరుద్దీన్ -
కొత్త ఈక్వేషన్స్.. ఖమ్మం.. రసవత్తర రాజకీయం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఖమ్మం జిల్లాకు నేతలకు రాజ్యసభ అవకాశం కల్పించడం ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారి తీసింది. నిజానికి రాజ్యసభకు వెళ్తున్న ఇద్దరూ ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, పార్టీలు మాత్రం కొత్త ఊహగానాలకు తెరలేపారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కలిపి 65 మంది ఉన్నారు. సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకోనుంది. ఇక బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల సంఖ్య ఆ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గెలుపు కూడా లాంఛనమే కానుంది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరీ అయినా, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు అయినా.. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కావడం విశేషం. రేణుకాచౌదరీ కమ్మ సామాజిక వర్గం కాగా.. వద్దిరాజు రవిచంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. గత కొన్నాళ్లుగా నేనే పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటి చేయకపోతే ఖమ్మం సీటు నుంచి తానే పోటీ చేస్తానంటూ టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ఖమ్మం నుంచి తనకు మాత్రమే అర్హత ఉందని రేణుకా చౌదరీ చెప్పుకోవడం పార్టీలో పెద్ద దూమారమే రేపింది. రేణుకా చౌదరి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా విజయం సాధించారు. అయితే, 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఉండగా రేణుకాచౌదరి 1997–98లో దేవెగౌడ కేబినెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998లో కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే.. ఆమెను ప్రత్యక్ష ఎన్నికల బరినుంచి అధిష్టానం తప్పించి రాజ్యసభకు పంపింది. ఇక ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రేసులో ముగ్గురు ఆశావాహులు ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతోన్న వద్దిరాజు రవిచంద్రది కాపు సామాజిక వర్గం. తెలంగాణలో కాపులు, మున్నూరు కాపులు, రెడ్డి కాపులున్నారు. ఈ ఓట్లు ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మూడు పార్లమెంటు స్థానాలున్నాయి. వద్దిరాజుకు అవకాశం ఇచ్చాం కాబట్టి కాపు ఓట్లపై కన్నేయాలన్న ఆలోచన బీఆర్ఎస్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు టికెట్ దాదాపు ఖారారు అయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్ -
TS: కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ నేతలు బిల్డర్లను బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్‌కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు వెళుతున్నాయని చెప్పారు. సనత్‌నగర్‌కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానిస్తే మోదీ గౌరవించారని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్ -
Ts: ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కులగణణ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కుల గణనపై కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇవ్వలేదని, అయినా సభలో తీర్మానం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తొలుత తీర్మానం చేయాలని సూచించారు. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు. ‘మేం కులగణన తీర్మానానినికి మద్దతు ఇస్తున్నాం. దీనికి సంబంధించి న్యాయమైన అంశాలపై జాగ్రతగా ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్కు సహకరించాం. బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మాత్రం బీజేపీ బి - టీమ్ అంటున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ పనితీరుపై ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారని, తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్ -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ను చేర్చుకొలేదు. ఎటుకాని బీఆర్ఎస్ను పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం. ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు.. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారు?. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కేఆర్ఎంబీపై మాట్లాడుతుంది. మాకు రాముడు, మోదీ ఉన్నారు. రజాకార్లు, ఎంఐఎం పార్టీలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు ఉన్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ. దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్లో కూడా గెలుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పని చేయలేని వాళ్లు తప్పుకోండి