TS: కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారు: కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారు: కిషన్‌రెడ్డి

Published Fri, Feb 16 2024 3:41 PM

Kishanreddy Allegations On Telangana Congress Leaders  - Sakshi

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.  రాహుల్​ గాంధీ కోసం కాంగ్రెస్‌ నేతలు బిల్డర్లను బెదిరిస్తున్నారన్నారు.  తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్‌కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు వెళుతున్నాయని చెప్పారు.

సనత్‌నగర్‌కు చెందిన వెల్లాల రామ్మోహన్‌ శుక్రవారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​, కేసీఆర్​ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్​ అవమానిస్తే మోదీ గౌరవించారని చెప్పారు. బీజేపీతోనే  తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.  దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. 

ఇదీ చదవండి.. ముందు ఆరు ‍గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement