breaking news
-
పంటల పరిశీలన: జనగామలో రైతులను పరామర్శించిన కేసీఆర్
Live Updates.. జనగామ జిల్లాలో కేసీఆర్ బస్సు తనిఖీ.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు తనిఖీ అనంతరం మళ్లీ బయలుదేరిన కేసీఆర్. ►జనగామ జిల్లాలో ఎండిన పంటపొలాలను పరిశీలించిన కేసీఆర్ అలాగే, రైతులను పరామర్శించిన కేసీఆర్ రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో తిరుమలగిరి మండల కేంద్రం చేరుకోనున్న కేసీఆర్ అటు నుంచి అర్వపల్లి మండలం వెలుగుపల్లిలో ఎండిన పంటల పరిశీలన అనంతరం, పంట నష్టంపై రైతులతో మాట్లాడనున్న కేసీఆర్ తిరుమలగిరి, అర్వపల్లిలో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు ►జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకున్న కేసీఆర్ ►పంట పొలాలను పరిశీలించేందుకకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ►అయితే, రాష్ట్రంలో సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ రైతులను కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. కేసీఆర్ పర్యటన ఇలా.. ►ఈరోజు ఉదయం 10:30 గంటలకు చేరుకుని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ, సూర్యాపేట మార్గంలో ప్రయాణించి 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ►మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడ రెండు గంటలకు భోజనం చేసి మూడు గంటలకు మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి 4.30కు నల్లగొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీ చోటా రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయల్దేరి నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, భువనగిరి మీదుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు. -
వాళ్లను రాళ్లతో కొట్టినా పాపం లేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో రాజకీయ అవకాశాలు పొంది, పదవులు అనుభ వించి పార్టీలు మారుతున్న నేతలను రాళ్లతో కొట్టినా త ప్పులేదని బీఆర్ఎస్ నాయ కులు ఎర్రోల్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు కొందరు రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలతో కలిసి శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో అవకాశాలు లేక రాజకీయంగా వెంటిలేటర్‌పై ఉన్న నేతలకు కేసీఆర్ పదవులతో సంజీవని ఇచ్చి బతికించారు. ఎంతో మంది నేతలున్నా కడియం శ్రీహరికి కేసీఆర్ వరుస అవకాశాలు కల్పించారు. కడియం కారణంగానే తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారు. ఉద్యమంలో మేము త్యాగాలు చేస్తే కడియం లాంటి వాళ్లు భోగం అనుభవించారు. బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవులకు పార్టీ నుంచి బయటకు వెళ్లే వారు రాజీనామా చేయాలని, లేని పక్షంలో గతంలో రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టి, రాళ్లతో కొట్టాలి. కడియం లాంటి నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండకపోతే మా తరహాలోనే నష్టపోతారు. కేసీఆర్‌ను తప్పు పట్టే అర్హత కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు లేదు. చంద్రబాబు డైరెక్షన్లోనే కొందరు నేతలు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కేకే, కడియంకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలి’అని ఎర్రోల్ల శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
సీఎం రేవంత్‌రెడ్డికి కేకే విందు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇత ర కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తన ఇంట్లో విందు ఇచ్చారు. కేకే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ కార్యక్ర మం ఏర్పాటు చేశారు. కేకే శుక్రవారమే సీఎం నివాసానికి వెళ్లి.. తన ఇంట్లో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. పలువురు మంత్రులు, నేతలను కూడా రావాలని కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్‌యాదవ్, సీనియర్ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి వెళ్లారు. శనివారం ఉదయమే కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి వారికి స్వాగతం పలికారు. కేకే ఆతిథ్యాన్ని స్వీకరించాక రేవంత్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కేకే ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారు, ఎవరి సమక్షంలో చేరుతారన్న దానిపై నేతలు చర్చించారు. అయితే కేకే ఆదివారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కడియం శ్రీహరి, కావ్య నేడు చేరే చాన్స్! బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారన్న దానిపై స్పష్టత రాలేదు. శనివారం తన అనుచరులతో సమావేశమైన కడియం.. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పారు. మరోవైపు లోక్‌సభ అభ్యరి్థత్వాల ఖరారు కోసం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆదివారం ఢిల్లీలో సమావేశం కానుంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేయనున్నట్టు సమాచారం. కడియం కుమార్తె కావ్య వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో ఉంటారన్న చర్చ నేపథ్యంలో.. శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారమే కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌లో విజయలక్ష్మి చేరిక బంజారాహిల్స్ (హైదరాబాద్): కేకే కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి క్యాంపు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌ల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు. -
పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టం
గజ్వేల్: పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టేదిలేదని, అన్ని లెక్కలు రాసి పెడుతున్నామని వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. శనివారం సిద్దిపేట జి ల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయ కుల సమావేశం మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలలు ఓపిక పట్టండి.. భవిష్యత్ మనదే అంటూ నాయకులకు భరోసా ఇచ్చారు. భూకబ్జాలకు పాల్పడిన వారు మాత్రమే ప్రస్తుతం పార్టీ మారుతున్నారని దుయ్యబట్టారు. వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీ, పౌరసరఫరాల కార్పొరేషన్లు దివాళా తీయడం ఖాయమన్నారు. పింఛన్ రూ.4వేలకు పెంపు, రైతు బంధు రూ.15వేలకు పెంపు, వ్యవసాయకూలీలకు రూ.12వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.150 కోట్ల పనులను రద్దు చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక పెద్దగా చేసిందేమీ లేకుండా ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దుబ్బాకలో మోసం చేస్తే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావును బండకేసి కొట్టారని చెప్పారు. గజ్వేల్‌పై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ రఘునందన్‌కు ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రఘునందన్‌పై గ్రామస్థాయిలో చర్చ పెట్టాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న గజ్వేల్‌లో నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపుపై కార్యాచరణ రూపొందించుకుందామని చెప్పారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడున్నరేళ్లు జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేసే అవకాశం కల్పించిన మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావును ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. రూ.100 కోట్లతో స్థాపించాలనుకుంటున్న పీవీఆర్ ట్రస్టు ద్వారా కార్యకర్తల పిల్లలకు విస్తృతంగా విద్యావకాశాలు కలి్పస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పదవులు అనుభవించిన వారే పార్టీలు మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
'కూల్చివేత'పై కుతకుత!
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందన్న వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. రెండు జాతీయ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు కారణమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేయాలని చూస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 48 గంటలు చాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అంతేకాదు.. ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారనడం.. ఏక్నాథ్ షిండే తరహాలో ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహరించేందుకు సిద్ధమయ్యారనడం.. కోమటిరెడ్డి కేంద్ర మంత్రులు గడ్కరీ, అమిత్ షాలను కలిశారనడం కలకలం రేపింది. దీనితో ఇంతకుముందు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందంటూ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అధికార పార్టీ నేతలను బీజేపీ టచ్‌లోకి తెచ్చుకుంటోందంటూ ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని, కానీ ఇక్కడ అలా సాధ్యం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఏలేటి వ్యాఖ్యలు మోదీ, అమిత్ షాల ఆలోచన తీరును తెలియచేస్తున్నాయని విమర్శించారు. ‘‘నిన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్లు ఈ పాట పాడారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు ఎత్తుకున్నారు. దమ్ముంటే టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది..’’ అని సవాల్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. దమ్ముంటే అమిత్ షా, గడ్కరీలను భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చి ప్రమాణం చేయించాలని, తాను కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ చేశారు. మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఎవరూ స్పందించకపోయేసరికి ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదని, అనవసర ఆరోపణలు పద్ధతికాదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేస్తుందన్నారు. -
‘దానం’పై వేటు వేయకుంటే కోర్టుకు వెళతాం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చి 12 రోజులు కావస్తున్నా స్పందన లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. దానం అనర్హత పిటిషన్‌పై స్పీక ర్ చర్య తీసుకోని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపా ల్, బండారి లక్ష్మారెడ్డితో కలిసి శనివారం తెలంగాణ భవన్లో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనర్హత వేటుకు సంబంధించి అదనపు అఫిడవిట్ సమరి్పంచేందుకు శనివారం సభాపతిని కలిసేందు కు వెళ్లినా అసెంబ్లీలో ఎవరూ అందుబాటులో లేరన్నారు. కార్యదర్శి కూడా అందుబాటులో లేకపోవడంపై ఆయనపై ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యరి్థగా దానంను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తే దేశమంతా హర్షిస్తుందని కౌశిక్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లినా కనీసం తమ వినతిపత్రం కూడా తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక పార్టీ లో గెలిచి మరో పారీ్టలోకి వెళ్లడం సిగ్గుచేటని, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమే అని పేర్కొన్నారు. -
టచ్ చేసి చూడండి..ఏం జరుగుతుందో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మొన్నటివరకు బీఆర్ఎస్ పాట పాడిందని.. ఇప్పుడు బీజేపీ నేతల నోట అదే పాట వినిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యా నించారు. తలచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలే టి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో’అని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పొన్నం శనివారం గాం«దీభవన్‌లో టీపీసీసీ నేతలు నిజాముద్దీన్, కోట్ల శ్రీనివాస్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఏమైనా జ్యోతిష్యం చదువుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు బీసీని అధ్యక్షుడ్ని చేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్ ఏర్పాటైన 23 ఏళ్లలో ఒక్క బీసీ నేత అయినా ఆ పారీ్టకి అధ్యక్షుడయ్యారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అయినా, లేక ఎన్నికల్లో ఓడిపోయాక అయినా బీసీలకు అధ్య క్ష పదవి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత, ప్రతిపక్ష నేత, మండలిలో ప్రతిపక్ష నేత.. ఇలా ఏ పదవిని కూడా బీసీలకు ఇవ్వకుండా.. బీసీలను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తమ ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి, రూ.150 కోట్లు నిధులు ఇచి్చందని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌తోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పారీ్టలో బీసీలకు అన్యాయం జరిగితే పారీ్టలో అంతర్గతంగా అడుగుతామని, బీఆర్ఎస్లో అలా అడిగే స్వేచ్ఛ కొంచెమైనా లేదని విమర్శించారు. బీసీని అధ్యక్ష పదవి నుంచి తీసేసి.. బలహీనవర్గాల నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసిన బీజేపీ.. బీసీ నేతను సీఎం చేస్తామని చెప్పడం ఏమిటని పొన్నం నిలదీశారు. అవినీతి చేసినందుకే బండి సంజయ్‌ను తీసేశామని కిషన్‌రెడ్డి వర్గం చెప్తుంటే.. కిషన్‌రెడ్డిని కేసీఆర్ నియమించుకున్నారని బండి సంజయ్ వర్గం అంటోందని వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారని మీడియా ప్రస్తావించగా.. తనను అలాంటి చర్యకు పాల్పడాలని అడిగే ధైర్యం ఎవరికీ లేదని, కలలో కూడా బీజేపీ ఊసెత్తనంటూ మంత్రి పొన్నం మీసం మెలి తిప్పారు. -
ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తా నా గురించి మాట్లాడేది?
సాక్షి, హైదరాబాద్: తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని.. ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తి తన గురించి మాట్లాడటమేమిటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ‘కాంగ్రెస్‌లో చేరుతా.. సాయపడు అన్నా’అని మహేశ్వర్‌రెడ్డి తనను కోరారని.. అలాంటిది ఇప్పుడు తనను టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఓ రాజకీయ జోకర్ అని వ్యాఖ్యానించారు. శనివారం తనపై మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్‌లోకి వస్తా.. మంత్రి పదవి కావాలన్నా అని అసెంబ్లీ సమావేశాల సమయంలో మహేశ్వర్‌రెడ్డి నన్ను అడిగారు. మాకే పూర్తి మెజారిటీ ఉంది. ఎవరినీ చేర్చుకునే ఉద్దేశం లేదని చెప్పాను. అది మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్రంతో ఆరుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారంటూనే.. తమకు అవసరం లేదనడం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే ఏక్నాథ్ షిండే పాత్ర పోషిస్తారనడం మహేశ్వర్‌రెడ్డికి మతిస్థిమితం లేదనడానికి నిదర్శనం. గడ్కరీ, అమిత్ షాలను తాను కలసి షిండే పాత్ర పోషిస్తానని చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై భాగ్యలక్ష్మి ఆయానికి వారిని తీసుకుని వచ్చి ప్రమాణం చేయాలి. నేను కూడా ప్రమాణం చేస్తా.. బీజేపీతో లాభం లేదన్నారు.. ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తమ (బీజేపీ)వాళ్లు రామ మందిరాన్ని పట్టుకున్నారని... దానితో తెలంగాణలో ఓట్లు పడతాయా’అని మహేశ్వర్‌రెడ్డి నాతో చెప్పారు. తాను సొంత ఇమేజీతో ఎమ్మెల్యేగా గెలిచానని, బీజేపీతో లాభమేమీ లేదని కూడా అన్నారు. కాంగ్రెస్‌లోనే ఉండుంటే మంత్రిని అయ్యేవాడిననీ చెప్పారు. నేను షిండే అవునో, కాదో తెలియదుగానీ.. మహేశ్వర్‌రెడ్డి మాత్రం కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దనరెడ్డి లాంటివారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. నేను కాంగ్రెస్‌లోనే పుట్టా.. కాంగ్రెస్‌లోనే పోతా... దిగజారుడు పార్టీ బీజేపీ.. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ. చేరికల కమిటీకి చైర్మన్‌ను కూడా నియమించారు. అయినా ఒక్క కార్పొరేటర్ కూడా ఆ పారీ్టలో చేరలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బు పంపుతున్నారని ఇష్టమొచి్చనట్టు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు మోదీకి, నడ్డాకు డబ్బు పంపుతున్నారా? దేశాన్ని అదానీ, అంబానీలకు దోచిపెట్టిన బీజేపీ ఇతరులను విమర్శించడం సిగ్గుచేటు. నిజానికి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ. ఆ పార్టీకి తెలంగాణ ఏర్పాటు ఏమాత్రం ఇష్టం లేదు. సోనియాగాంధీ పారీ్టకి నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చారు.’’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ షిండే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మరో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీల వద్దకు మంత్రి వెంకట్‌రెడ్డి వెళ్లి తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారన్నారు. కానీ ఆయనపై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే ఆయనకు షిండే పాత్ర ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్‌తో ఆయన టచ్‌లో ఉంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనడం ఏమిటని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని మాట్లాడుతున్నారు. వెంకట్‌రెడ్డితో ఆయన సోదరుడే టచ్‌లో లేరు. అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా టచ్‌లోకి వస్తారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ అలాంటి చరిత్ర లేదు. మా పార్టీ వారిని ముట్టుకునే సాహసం చేయొద్దు. మా పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది. ప్రజలు ఇచి్చన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా సహకరిస్తోంది. వెంకటరెడ్డికి దమ్ముంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యరి్థని గెలిపించుకోవాలి. భయపెట్టి వసూళ్లు చేస్తున్నారు రేవంత్‌రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరో విధంగా మాట్లాడటం సమంజసం కాదు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. రేవంత్ వసూళ్ల చిట్టా, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ పేరిట రూ.3 వేల కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బును దేశవ్యాప్తంగా రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోంది. తుగ్లక్ చేష్టలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై మా పోరా టం కొనసాగుతుంది. కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వం. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఏదో ఒకఅంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇతర పారీ్టల ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్లు ఎలా ఇస్తున్నారు.’’అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాలు చేశాకే ఇతర పారీ్టల వారిని బీజేపీ చేర్చుకుంటోందన్నారు. వాళ్ల మంత్రులే కూల్చుతారు.. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి 48 గంటలు కూడా పట్టదు. కానీ మేం అలా చేయబోం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ల మంత్రులే కూల్చుతారు. ఇప్పటికే పది మంది మంత్రులు సీఎం పీఠంపై కన్నేశారు. ఓటుకు కోట్లు కేసుతోనో, ఇంకో అంశంతోనో తన సీటుకు ప్రమాదం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్‌కు నిద్రపట్టడం లేదు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు? ఇప్పుడు దేనితో వారిని కొట్టాలి. గతంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? ఆయన తరఫున ప్రచారం ఎలా చేస్తారు? వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో బయటపెట్టాలి. -
కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దృఢ సంకల్పం కలిగిన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతి«థిగా హాజరై ప్రసంగించారు. సిమెంట్ లేకుండా ఇల్లు ఎలా కట్టలేమో కార్యకర్తలు లేకుండా కాంగ్రెస్ గెలుపు లేదన్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల వల్లే పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు చిందించిన చెమట వల్ల తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని, ఎంపీ ఎన్నికల్లో కూడా నల్లగొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మెజారిటీ కోసం ఎలా పోటీ పడ్డారో, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. దీపాదాస్ మున్షీ ప్రసంగాన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. కార్యకర్తలు గెలిపించాలి: మంత్రి తుమ్మల మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి 1983 నుంచి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలందించారని, అభివృద్ధికి కృషి చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ, రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల విషయంలో నిబద్ధతతో ముందుకుసాగి కీర్తి గడించారన్నారు ఆయన తనయుడిగా రఘువీర్‌రెడ్డిని కార్యకర్తలు అంతా కలిసి గెలిపించాలన్నారు. రావి నారాయణరెడ్డిని మించిన మెజారిటీతో: మంత్రి కోమటిరెడ్డి దేశంలోనే నల్లగొండ పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజారిటీ సాధించిన రావి నారాయణరెడ్డిని మించిన మెజారిటీతో రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తామంతా టీం వర్క్ చేస్తున్నామని, నల్లగొండ ఎంపీ అభ్యర్థి 6 లక్షల ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, జయవీర్‌రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు: మంత్రి ఉత్తమ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ఉండదని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణకు హామీలు ఇచ్చిన బీజేపీ వాటిని అమలు చేయకుండా, ఈ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఇస్తానని ఇవ్వలేదని దుయ్యబట్టారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోవడం ఖాయమన్నారు. ఈ ప్రాంత సమస్యలపై తాను ఎంపీగా పార్లమెంట్లో గళమెత్తానని, తన స్థానంలో నల్లగొండ ఎంపీగా రఘువీర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎంపీగా తాను ఐదేళ్లలో ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించానన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంతానికి రైల్వేలైన్ మంజూరు చేయించానన్నారు. వేలాది ఎకరాలకు ఎత్తిపోతల ప«థకాలు ఏర్పాటు చేసి సాగునీరు అందించామన్నారు. ఇతర పార్టీల నేతలను తాము బలవంతంగా కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం లేదని, వారే స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు. -
ఓడిపోయే పార్టీ నుంచి కూతురి పోటీ వద్దనుకొనే..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న తన కూతురు కడియం కావ్య ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయొద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. బీఆర్ఎస్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, పార్టీలో కొనసాగడంపై నాయకులు అయోమయంలో ఉన్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నాయకులు బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరడంతో పార్టీ బలహీనపడిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించినందునే తన కూతురు కావ్యకు పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నా, పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకుల నుంచి తనకు సహకారం అందలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నందున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని కడియం చెప్పారు. ఎవరినీ అడగకుండానే నిర్ణయం తీసుకున్నా.. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని ఎవరినీ సంప్రదించకుండానే తీసుకున్నానని... కాంగ్రెస్ ప్రతినిధులు పార్టీలోకి రావాల్సిందిగా తనను ఆహా్వనించినట్లు కడియం తెలిపారు. బీఆర్ఎస్ ఎవరికీ అన్యాయం చేయలేదని, పార్టీ మారకముందే తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారన్నారు. తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరు దయాకర్ పార్టీ మారిన సమయంలో లేని విమర్శలు తనపై ఎందుకని ప్రశ్నించారు. అవకాశాలు అందరికీ వస్తాయని... కానీ వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామనేదే ముఖ్యమన్నారు. కాంగ్రెస్‌లో చేరతామని కొందరు నెలల తరబడి ఆ పార్టీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగినా చేర్చుకోలేదని... కానీ కాంగ్రెస్ నేతలే తన ఇంటికి వచ్చి చేరాలని అడుగుతున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాను తప్పు చేయలేదని, అవినీతి, అక్రమ సంపాదనకు పాల్పడలేదని చెప్పారు. తాను ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకోలేదని, భూకబ్జాలు చేయలేదన్నారు. తనను ప్రశ్నించే హక్కు కేవలం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకే ఉందని కడియం అన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడానికే తన తండ్రి పార్టీ మారుతున్నారని కుమార్తె కడియం కావ్య చెప్పారు. -
భూదందాలకు ఇవిగో ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితాను అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. షామీర్పేట మండలం తూంకుంట, బొంరాస్‌పేట, చేవెళ్ల మండలం చందవెల్లి, మాజిల్‌పూర్ గ్రామాల్లో జరిగిన భూకుంభకోణాలకు సంబంధించిన సమగ్ర ఆధారాలను సమర్పించానని, వీటిపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గాందీభవన్‌లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. షామీర్పేట మండలం తూంకుంట గ్రామంలోని 164/1 సర్వే నెంబర్లోని 26 ఎకరాల అటవీ భూమిని జూన్, 2022లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. బొంరాస్‌పేట గ్రామంలోని 260/2, 261, 265/8, 361/7, 361/9 సర్వే నెంబర్లలో రక్షణ శాఖకు చెందిన భూమిని బాలాజీ అసోసియేట్ అనే సంస్థకు ఇచ్చారని, అదే గ్రామంలోని 65 ఎకరాల ప్రైవేటు భూమిని రైతులకు కాకుండా అప్పట్లో రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుటుంబానికి చెందిన ఎఫ్ఫర్ఎల్ ఫార్మ్ అనే సంస్థకు దారాధత్తం చేశారని నిందించారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూములను 2018లో ఎన్నికలు కాగానే అంబుజ్ అగర్వాల్ పేరిట రిజి్రస్టేషన్ చేశారని ఆరోపించారు. 24లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి వారికి అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారని కోదండరెడ్డి విమర్శించారు. దళితుల భూములను కేటీఆర్ అమ్ముకున్నారు చేవెళ్ల మండలం చందవెల్లి అనే గ్రామంలో దళితుల నుంచి ఎకరం రూ.9 లక్షల చొప్పున 1,500 ఎకరాలు తీసుకుని తనకు అనుకూలంగా ఉన్న మల్టినేషనల్ కంపెనీకి ఎకరానికి రూ.1.30 కోట్లకు కేటీఆర్ అమ్ముకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. మాజిల్‌పూర్ అనే గ్రామంలో ల్యాండ్‌సీలింగ్‌లో ఉన్న 25 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారని చెప్పారు. వీటన్నింటికీ సంబంధించి సమగ్ర ఆధారాలను ప్రభుత్వానికి ఇచ్చానని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. భూములను కాజేయాలనే కుట్రపూరిత ఆలోచనలతోనే కేసీఆర్ ధరణికి రూపకల్పన చేశారని, రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణాలు, అక్రమాలకు కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులని ఆరోపించారు. అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తికాగానే చర్యలకు ఉపక్రమించి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు ఇందుకు బాధ్యులైన ఎంతటి వారిపైన అయినా కఠినచర్యలు తీసుకోవాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. -
టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం 10 సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లతో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు. కేవలం ఒక కుట్ర, ఎజెండాలో భాగంగా తమపై ఈ ప్రచారం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానళ్లపై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. గతంలోనూ తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఆయా సంస్థలు తప్పును సరిదిద్దుకొని, అసత్యపూరిత వీడియోలను తీసివేస్తున్నామని ప్రకటించాయి. ఇదీ చదవండి.. కడియంకు బీఆర్ఎస్ చెక్ -
కడియంకు బీఆర్ఎస్ చెక్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్ నేత కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియంపై అనర్హతవేటు వేసేందుకు సిద్ధమైన్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకు శనివారం మధ్యాహ్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఒకటి అసెంబ్లీకి చేరుకుంది. అయితే.. కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అందుబాటులో లేరని సమాచారం. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసే యత్నం చేయగా.. ఆయన కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కడియంపైన కాకుండా.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు ఫిర్యాదు చేసేందుకు ఈ బృందం వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో ఇద్దరిపైన లేకుంటే ఇద్దరిలో ఒకరిపైనే బీఆర్ఎస్ ఫిర్యాదుకు సిద్ధమైందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎవరి మీద అయినా.. ఆలస్యం చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరనుందని సమాచారం. ఒకవేళ అనర్హత పిటిషన్‌ను స్పీకర్ స్వీకరిస్తే గనుక.. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయా? అనే ఆసక్తి నెలకొంది. మరోపక్క శనివారం ఉదయం అనుచర గణంతో సమావేశమైన కడియం, ఆయన కూతురు కావ్యలు పార్టీ మారబోతున్నట్లు నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. అందుకే తాము తప్పనిసరి స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. కావ్య తాను వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నానని.. తనను గెలిపించాలంటూ వ్యాఖ్యానించారు. -
‘బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అలాగే, తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా మా దగ్గర ఉంది. హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోంది. రంజిత్ రెడ్డిపై గతంలో రేవంత్ చేసిన ఆరోపణలు ఏమయ్యాయి. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడగతారు?. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మా పార్టీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవం. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనతో లేడు అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, కొద్దిరోజలుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి.. సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. -
HYD: కేటీఆర్‌పై పోలీసు కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. డబ్బుల విషయమై సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. కాగా, కేటీఆర్ ఇటీవల రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, శ్రీనివాసరావు హన్మకొండలో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో, బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్?.. ఎన్నికలకు సతీమణి దూరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. అధిష్టానం హామీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ విషయంలో అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. అయితే రాజగోపాల్‌రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండటంతో పాటు రాజగోపాల్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు మంత్రి పదవి వస్తుందని, హోం మినిస్టర్ అవుతానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ ఎన్నికల తరువాత తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. -
పార్టీ మారినా.. నో ఫియర్!!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా ఆమె పదవికి ఢోకా లేదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆమె పదవికీ నష్టం లేదు. ఎన్నికైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారితే అనర్హత వేటుపడే ప్రమాదం ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్లకు మాత్రం పదవులు పోయే ప్రమాదం లేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పారీ్టలు మారినా వారి పదవులు పోయే అవకాశం లేదు. మొత్తం పాలక మండలిలో మెజార్టీ సభ్యుల అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారి పదవులు పోయే ప్రమాదం ఉన్నా, బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే వారు ఏ పారీ్టకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి çపదవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత బాధ్యతలు స్వీకరించింది 2021 ఫిబ్రవరి 11న. 2025 ఫిబ్రవరి 10 వరకు వారి పదవులకు వచి్చన ముప్పు ఏమీ లేదు. ఒకవేళ వారి పనితీరు బాగాలేదనో, మరో కారణంతోనో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అనేవి అసలు అంశమే కాదని అటు అధికారులతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు. నాలుగేళ్ల గడువు తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవులకు మిగిలి ఉండేది స్వల్ప సమయం మాత్రమే. అప్పటికి పార్టీల బలాబలాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మారనున్న బలాబలాలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేయర్ పార్టీ మారుతుండగా, ఇదివరకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత, శోభన్‌రెడ్డిలు సైతం కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. ఇదే వరుసలో దాదాపు ఇరవైమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సైతం కొందరిని లాగే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఫలించిన కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచే జీహెచ్ఎంసీ మేయర్‌గా ప్రతిపక్ష పార్టీ వారుండరాదనే పట్టుదలతో ఉంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది తమ ప్రభుత్వమే అయినందున మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా తమ పార్టీ వారే ఉండాలనే వ్యూహంతో పనిచేసింది. ఆ దిశగా సఫలమైన కాంగ్రెస్ ఇక కార్పొరేటర్లపైనా వల వేయనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచింది ఇద్దరే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య డజనుకు చేరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 30 మంది వరకు కాంగ్రెస్‌లో చేరతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఎమ్మెల్యేలు పారీ్టలు మారితే వారి అనుయాయులు, అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారని చెబుతున్నారు. తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే, అందుకు అవసరమైన నిధులు పొందాలంటే అధికార పారీ్టలో ఉంటేనే సాధ్యమని కార్పొరేటర్లు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. -
కేసీఆర్ పాపాల వల్లే కరువు
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలే. గొర్రెలు, చేప పిల్లల పంపిణీలో కూడా అవినీతి చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోనూ అవినీతే. దళితబంధుకూ కమీషన్లు తీసుకున్నారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే ఆయన చేసిన మొదటి తప్పు. దేవుడి పేరుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సర్వనాశనం చేశారు. ఇలాంటి కేసీఆర్ పాపాల వల్లనే ఇప్పుడు కరువు వచ్చిది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక్కో పెయింటింగ్ రూ. 3–4 కోట్లు ‘నేను ఎన్నో దేశాలు చూశా. కానీ ప్రగతిభవన్ లాంటి ఖరీదైన నిర్మాణం ఎక్కడా చూడలేదు. అక్కడ బాత్రూంను ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. ప్రగతిభవన్‌లోని ఒక్కో పెయింటింగ్ ఖర్చు రూ. 3–4 కోట్లుంటుంది. 20 ఏళ్లు అధికారంలో ఉంటామని అనుకొని కేసీఆర్ అలా కట్టించుకున్నారు. ఈ అవినీతి రావుల కోసం ఇప్పుడు జైళ్లు సరిపోవు. ప్రగతి భవన్‌ను జైలు చేసినా సరిపోదేమో. అధికారం పోయేసరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మాతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరచూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అవినీతి అంతా బయటకు తీయాలంటే మాకు 20 ఏళ్లు పట్టేట్టు ఉంది’అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీగా దానం పోటీ కష్టమే.. దానం నాగేందర్ ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి మరో పారీ్టలో ఎంపీగా పోటీ చేయడం కష్టమని, అ లా చేస్తే న్యాయ సమస్యలు వస్తాయని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని గతంలో కడియం శ్రీహరి అన్నప్పటికీ ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకున్నట్లు ఉన్నార ని చెప్పారు. తనతో కడియం మాట్లాడలేదని, కేకే మాత్రం మాట్లాడారని, ఆయన్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అభిప్రాయడ్డారు. ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని, ఆయనకు చట్టప్రకారం పదేళ్ల జైలు శిక్ష తప్పదని కోమటిరెడ్డి హెచ్చరించారు. వైఎస్ వల్లే వేగంగా హైదరాబాద్ అభివృద్ధి హైదరాబాద్‌కు కళ ఓఆర్ఆర్ అని... అది కట్టింది వైఎస్ హయాంలోనేనని కోమటిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. దక్షిణాదిలోనే ఎక్కువ మెజారిటీ నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు వస్తుందని జోస్యం చెప్పారు. తనకు, తన సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మధ్య విభేదాలున్నాయన్న వార్తలను ఖండించారు. తమను విడదీయడం ఎవరి వల్లా కాదని... అయితే బ్రదర్స్ పేరు చెబితేనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని, అందుకే తమపై రూమర్స్ పుడుతుంటాయని చెప్పారు. -
రాజీనామా చేశాకే పోటీ!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ అంశం తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉండి.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం గందరగోళం రేపుతోంది. వాస్తవానికి దానం నాగేందర్ చేరిక సందర్భంగా జరిగిన చర్చల్లో సికింద్రా బాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని, ఖైరతా బాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పష్టతనిచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయా లనే ప్రతిపాదన మేరకే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పార్టీ అధి ష్టానానికి వివరించాకే.. నాగేందర్‌కు ఎంపీ అభ్యర్థిత్వా న్ని ఏఐసీసీ ఖరారు చేసింది. కానీ ఆయన రాజీనామా పై ఊగిసలాటలో పడ్డారు. ఎంపీగా గెలిచాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు ఏం చేస్తారనే చర్చ మొదలైంది. ప్రత్యామ్నాయంపై ఆలోచన! గాంధీభవన్ వర్గాల్లో, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల మేరకు.. దానం నాగేందర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సాధ్యం కాదని ఏఐసీసీ పెద్దలు తేల్చినట్టు సమాచారం. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుందని.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయిస్తే ఆ రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహారాన్ని తప్పుపట్టలేని స్థితికి వెళతామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో నాగేందర్ అభ్యర్థి త్వంపై పునః సమీక్ష చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచా రం. నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా పోటీచేస్తారని.. ఆయన రాజీనామాకు ససేమిరా అంటే మరో అభ్యర్థిని పోటీకి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదా మరో నేతను ప్రత్యామ్నాయంగా పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉంచాలని కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం. కడియం శ్రీహరి విషయంలోనూ! స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్‌లో ఇదే తరహా చర్చ జరుగుతోంది. కడియంతోపాటు ఆయన కుమార్తె కావ్య నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ ఎంపీగా పోటీచేస్తారని, ఖాళీ అయ్యే స్టేషన్‌ఘన్‌పూర్‌లో కావ్యను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారనే చర్చ జరుగుతోంది. లేదా కావ్యను ఎంపీగా పోటీచేయించి.. శ్రీహరి ఎమ్మెల్యేగా కొనసాగుతారని అంటున్నారు. మొత్తమ్మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీచేసే అంశం ఆ పార్టీలో కొంత గందరగోళానికి దారిస్తోంది. -
వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున వరంగల్ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిని బరిలో దించేదిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని తన తండ్రి కడియం శ్రీహ రితో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి చెంది, బీఆర్ ఎస్ అధికారం కోల్పోగానే పార్టీకి దూరమైన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బీఆర్ఎస్ వర్గా లు సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజ య్య చెప్పినట్టు సమాచారం. ఓ వైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమా చారం. పార్టీ తరపున టికెట్ ఆశించిన బోడ డిన్న, నిరంజన్, జింక రమేశ్ తదితరులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు హనుమ కొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇదిలాఉంటే తన అను చరులతో కడియం శ్రీహరి శనివారం హైదరాబా ద్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా స్టేషన్ఘనపూర్ నేతలతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది. -
ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నా..
బంజారాహిల్స్ (హైదరాబాద్): అవకాశవాద రాజకీయాల కోసం తాను బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న విమర్శలు సరికావని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. తన వయసు 85 ఏళ్లు అని.. 55 ఏళ్లు కాంగ్రెస్‌లో కొన సాగానని, 13 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రేమతోనే మళ్లీ చేరుతున్నానన్నారు. ఇది తనకు తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నట్టుగా ఉందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ఓటు వేయడం వల్లే గెలిచానని, తర్వాత కేసీఆర్ తనకు మరో చాన్స్ ఇచ్చారని కేకే చెప్పారు. తన మాటకు చాలా విలువ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని.. రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ను కుటుంబ పాలన నడిపిస్తోందని ప్రజలు అనుకుంటూ ఉండేవారని.. ఆ సమయంలో బాల్క సుమన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు పార్టీని నడిపిస్తే బాగుండేదని తాను అనుకున్నానని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని పేర్కొ న్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదన్నారు. తాను గురువారం కేసీఆర్‌ను కలిశాననని, తాను పార్టీని వీడుతుండటం పట్ల ఆయన బాధపడ్డారని కేకే చెప్పారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనను తిట్టారని కొందరు తన దృష్టికి తీసుకువచ్చా రని.. దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగించడానికే అధికార పార్టీలోకి..: విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగించడా నికి తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా నని హైదరాబాద్ మేయ ర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏమేం అభివృద్ధి పనులు కావా లో త్వరలోనే సీఎంతో మాట్లాడి చెబుతాన న్నారు. తనతో పాటు 150 మంది కార్పొరేటర్ల సమన్వయంతో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్య మని చెప్పారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తన సోదరుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ను తెరపైకి తీసుకొచ్చి తమ కుటుంబంలో కలహా లు రేపుతున్నారని ఆరోపించారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం విజయలక్ష్మి నివాసానికి రానున్నట్టు తెలిసింది. సీఎం ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. -
నా సోదరి పార్టీకి వెన్నుపోటు పొడిచింది
సాక్షి, హైదరాబాద్: పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధినేత కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన తన తండ్రి కె. కేశవరావు (కేకే) పార్టీని వీడటం బాధాకరమని ఆయన కుమారుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ నేత దాసోజు శ్రవణ్‌తో కలసి శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడిన సమయంలో దుర్భాషలాడిన సీఎం రేవంత్‌రెడ్డి తన తండ్రిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్‌లో ఆత్మస్థై ర్యం నింపేందుకు కేకే తన నిర్ణయాన్ని పునఃసమీ క్షించుకోవాలని సూచించారు. అలాగే తన సోదరి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. పార్టీకి వెన్ను పోటు పొడిచిందని విప్లవ్ మండిపడ్డారు. ఆమెకు మేయర్ పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. తన తండ్రి, సోదరి బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో కి వెళ్లాలని డిమాండ్ చేశారు. అభివృద్ది కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానంటూ తన సోదరి చేసిన వ్యా ఖ్యలను విప్లవ్ తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో చేరకుంటే విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను సీఎం అభివృద్ధి చేయరా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని... ఎట్టిపరిస్థితుల్లోనూ తాను బీఆర్ఎస్ను వీడేది లేదని విప్లవ్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చుతున్నాడని తానూ ఆరోపణలు చేయగలనని పేర్కొన్నారు. దానం.. ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: దాసోజు బీఆర్ఎస్లో ఆత్మగౌరవం లేదని తమ పార్టీ ఖైర తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ తప్పుబ ట్టారు. ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా అవమానించిన రేవంత్‌రెడ్డి దగ్గర ఆత్మగౌరవం దొరుకుతుందా? అని ప్రశ్నించారు. దానం ఎన్నోమార్లు కేసీఆర్ కు పాదాభివందనం చేశారని, ఆయన ఆత్మగౌరవా న్ని కించపరిస్తే ఎందుకు కాళ్లు మొక్కారని నిలదీ శారు. బాత్రూంలో జారిపడటంతో ఆసుపత్రిపా లైన కేసీఆర్ తాత్కాలికంగా ఉండేందుకు తన ఇళ్లను ఇచ్చేందుకు దానం ముందుకొచ్చారన్నారు. కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని దాసోజు డిమాండ్ చేశారు. లౌకికవాదం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు దానం చెప్పడాన్ని పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, బైండ్ల విజయ్‌కుమార్, నారాయణ పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ బెదిరింపు రాజకీయాలు
షాద్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే అక్రమ దందా వ్యవహారాలు బయటపెడతామంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం పాలమూరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చిత్తశుద్ధితో జరగడం లేదన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కాంట్రాక్టర్లను డొనేషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాపానికి రాష్ట్రంలో రాహుల్ గాంధీ ట్యాక్స్‌ను విధిస్తున్నారని నిందించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని, న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.