breaking news
-
‘జనజాతర’ అదరాలి!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు జాతీయ స్థాయిలో శంఖారావంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న నిర్వహించనున్న జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయడంపై ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. 60 ఎకరాల మైదానంలో నిర్వహించే ఈ సభ ఏర్పాట్లను మంత్రివర్గ సహచరులు, పార్టీ ఎంపీ అభ్యర్థులతో కలసి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నేతలతో వివిధ కమిటీలు ఏర్పాటు చేసిన సీఎం... గురువారం సాయంత్రం స్వయంగా సభా వేదిక వద్దకు వెళ్లి, మంత్రులు, పార్టీ నేతలతో సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా 10 లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, పలువురు ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. 10 లక్షల జనం తరలాల్సిందే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత ప్రియాంకా గాంధీ హాజరయ్యే ఈ సభ ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సత్తా చాటాలని రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సభా వేదిక నుంచే జాతీయ స్థాయిలో పార్టీ మేని ఫెస్టోను విడుదల చేయడంతోపాటు అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఐదు గ్యారంటీలను కూడా రాహుల్ గాంధీ ప్రకటించనున్న నేపథ్యంలో సభకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించనుందని రేవంత్ పేర్కొన్నారు. అందువల్ల సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 10 లక్షల మంది ప్రజలను సభకు తరలించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ఎంపీ అభ్యర్థులు కూడా శ్రద్ధ తీసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ జరపాలని రేవంత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సభ జరిగే మైదానం పక్కనే సుమారు 300 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండటంతో సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. జగ్జీవన్ జీవితం స్ఫూర్తిదాయకం: రేవంత్ సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవ లు చిరస్మరణీయమని సీఎం రేవంత్ కొనియాడా రు. జగ్జీవన్‌రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. -
ఈసీ, గవర్నర్ జోక్యం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల సంఘం, గవర్నర్, ఇతర దర్యాప్తు సంస్థలు సుమోటోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ ద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. దీనిపై గవర్నర్ ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. అలాగే గతంలో ఎన్నికల నిబంధనలు బీఆర్ఎస్ ఉల్లంఘించినందున ఈసీ కూడా జోక్యం చేసుకోవాలన్నారు. 2014 నుంచి ఎన్నికలు, ఇతర సందర్భాల్లో పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినందున బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు కారణం ఎవరో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక షాడో సీఎం గా వ్యవహరించిన కేటీఆర్ ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్‌తో రూ. కోట్లు వసూలు చేశారు.. ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రయత్నం చేసినా బీజేపీ విడిచిపెట్టబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రిటైరైన ఓ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం మామూలు విషయం కాదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల ఫోన్లతోపాటు, బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల ఫోన్లను బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రూ. కోట్లలో వసూళ్లు చేసినట్లు, ఇందులో కేసీఆర్, అయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. రైతు హామీలను కాంగ్రెస్ అమలు చేయదేం? రైతులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎందుకు అమలు చేయట్లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. రుణమాఫీ ఏ డిసెంబర్ 9న చేస్తారో తెలియదు? రైతులకు రూ. 500 బోనస్ బోగసేనా? రైతులకు కొత్త రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు’అని ఆయన నిలదీశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. -
నేతన్నలపై ఎందుకీ కక్ష?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కళకళలాడిన చేనేత రంగం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తిరిగి సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో నేత కార్మీకులు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. కార్మీకుల పొట్టకొట్టొద్దు..!: ‘ఉపాధి కోల్పోయిన నేత కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. రైతాంగ సంక్షోభం తరహాలో నేత కార్మీకుల సంక్షోభం తీవ్ర రూపం దాల్చక ముందే శాశ్వత పరిష్కారం చూపండి. గత ప్రభుత్వంపై కోపంతో నేత కార్మికుల పొట్ట కొట్టకుండా గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తూనే అదనపు సాయం అందేలా చూడండి. ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో కార్మీకులు నేత పనికి దూరం కావడంతోపాటు పవర్ లూమ్స్‌కు ఆర్డర్లు లేక మూతపడ్డాయి. ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో కార్మికులు రోజూ దీక్షలు, ధర్నాలతో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. నేత కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మీకుడు ఉరేసుకొని చనిపోవడాన్ని ప్రభుత్వ హత్యగానే కార్మీకులు భావిస్తున్నారు’అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. మా పాలనలో రూ. కోట్ల విలువైన ఆర్డర్లిచ్చాం.. ‘సమైక్య రాష్ట్రంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేత కార్మీకులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. నేతన్నల వేతనాలు రెట్టింపు చేసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడటంతోపాటు చేనేత మిత్ర, నేతన్నకు చేయూత వంటి పథకాలను ప్రారంభించాం. రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లతో నేత కార్మీకులకు చేతి నుంచి పని కల్పించాం. బతుకమ్మ చీరల పథకం ద్వారా కార్మీకులకు చేతి నిండా పని దొరకడంతోపాటు కార్మీకులకు ఉపాధి పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో రూ. కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు పోకుండా కొనసాగించడంతో పాటు బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించిప జీవోను విడుదల చేయాలి. ఇది 35 వేల మంది కార్మీకులు, వారి కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్య కాబట్టి వెంటనే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. యార్న్ సబ్సిడీ విడుదల, చేనేత మిత్ర కొనసాగింపు, పరిశ్రమకు రావాల్సిన రూ. 270 కోట్ల బకాయిల విడుదల చేయాలి. కార్మీకులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తిపడి తమిళనాడు, సూరత్‌కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది’అని కేటీఆర్ లేఖలో ఆరోపించారు. -
నేడు కరీంనగర్‌కు కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మైండ్ గేమ్: మాజీ మంత్రి గంగుల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతానంటున్న ప్రచారం ఊహజనితమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తేల్చిచెప్పారు. కరీంనగర్లో ఆయన గురువారం పార్టీ మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని, తనను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో తనపై దు్రష్పచారం చేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్లో గులాబీ జెండా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసులో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయ్’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని కేంద్రమంద్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని అన్నారు. రిటైర్డ్ అధికారుల నేతృత్వంలో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని దుయ్యబట్టారు. రాజకీయపరమైన కక్ష సాధింపు చర్య రాజకీయపరమైన లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు కిషన్‌రెడ్డి. వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం, నియమాల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యహరించిందన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అక్రమంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారన్నారు. ఉప ఎన్నిక సమయంలో తమ అభ్యర్థులు, నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల, సమాజంలో పెద్దల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిదిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై కిషన్ రెడ్డి రియాక్షన్ పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ఒక ఎజెండాగా పెట్టుకుందన్నారు కిషన్ రెడ్డి. కుక్కలు, నక్కలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ అంటున్నారని.. కుక్కలు, నక్కలను పార్టీలో ఎందుకు పెట్టుకున్నారో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయాన్ని కాలరాసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని ప్రశ్నించారు. . దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి పార్టీ మారాలని అన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదని పేర్కొన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రూ. కోట్లు దోపిడికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగింది. ఫోన్ ట్యాపింగ్ వెనక కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉందని విచారణలో బయటపడింది. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలి. కేంద్రహోంశాఖ అనుమతి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు. కేటీఆర్ మొన్న అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఫోన్లు ట్యాపింగ్ చేయవచ్చు అన్నారు... నిన్న నాకేం సంబధం అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో షాడో ముఖ్యమంత్రిలాగా కేటీఆర్ వ్యవహరించలేదా? ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి బీఆర్ఎస్ గుర్తుపై పునరాలోచన చేయాలి’ అని తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలులో హ్యాండ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్‌లో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకు వచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో కూడా ప్రణీత్ రావు అండ్ కో టీమ్ కీలకంగా వ్యవహరించినట్టు వెల్లడయింది. వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎపిసోడ్‌కు కర్త, కర్మ, క్రియగా ఇద్దరు పోలీసు అధికారులు వ్యవహరించినట్టు తాజా విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను అనధికారికంగా ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యేల సంభాషణలను రికార్డు చేసిన ప్రణీత్‌రావు.. వాటిని ప్రభుత్వం అందజేయగా.. అలర్ట్ అయినట్లు విచారణలో తేలిసింది. ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా చేపట్టే బాధ్యతను రాధాకిషన్ అండ్ కోకు అప్పగించినట్టు సమాచారం. దీంతో రాధాకిషన్ తన బృందంతో ఒక రోజు ముందు వెళ్లి సీసీ కెమెరాలను పక్కాగా అమర్చినట్టు వెల్లడైంది. గెస్ట్ హౌజ్‌లో ఏ రకమైన వ్యవహారమైనా పక్కాగా రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలను, మైక్‌లను అమర్చినట్టు తాజా విచారణలో బయటపడింది. ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ తరపున వచ్చిన బీఎల్ సంతోష్‌లను పక్కాగా ట్రాప్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఈ టీమ్‌లో ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. త్వరలోనే మరికొందరిని కూడా పోలీసులు విచారించనున్నట్టు తెలిసింది. నోటీసులిచ్చేందుకు ప్రత్యేక విమానామా? ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో స్పెషల్ విమానంలో ఆనాటి సిట్ బృందం తిరిగినట్లు విచారణలో తేలింది. అయితే, కేసు విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం సాధారణమే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్కు సంబంధించిన ఓ కీలక నేతకు చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లారు. బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇవ్వడానికి పోలీసు అధికారులు ఈ స్పెషల్ ఫ్లైట్ ను వినియోగించారు. ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారు అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’
హైదరాబాద్, సాక్షి: చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోవట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తాజాగా ఓ ఘాటు లేఖ రాశారాయాన. ‘‘నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష?. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా??. పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అని లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమను నమ్ముకున్నవాళ్ల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ఆరోపించారు కేటీఆర్. చేనేత మిత్రా వంటి పథకాల్ని కాంగ్రెస్ సర్కార్ పక్కనపెట్టిందని ప్రస్తావించారాయన. ‘‘గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి, అవసరం అయితే మరింత సాయం చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు.. .. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇండియన్ టెలికం యాక్ట్‌పై కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా స్వీకరించొచ్చు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? ఆ పార్టీ నేతలు అవగాహన రాహిత్యంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ..పరోక్షంగా బీఆర్ఎస్కు సహకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న వారు ఎంతటి పెద్దమనుషులైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుని పోతోంది’అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు స్పష్టం చేశారు. తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన జనజాతర మహాసభ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే...బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించింది. మా ఫోన్లు కూడా ట్యాప్ చేసింది. వీటిని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు పేరుతో తిన్న కమీషన్లు కక్కిస్తాం. ధరణి ఫోర్టల్‌ను అడ్డుపెట్టుకొని వారు కొల్లగొట్టిన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్ భూములను వెనక్కి తీసుకుంటాం. ఆర్థిక దోపిడికి పాల్పడిన వారికి జైలుకు పంపిస్తాం. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. మీరు మా తాట తీయడం కాదు.. ప్రజలే మీ తాట తీస్తారు అని హెచ్చరించారు. కర్రుకాల్చి వాత పెట్టినా సిగ్గురాలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరువొచ్చిందని బీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. కరువుకు కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటీ? కాంగ్రెస్ డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు వర్షపు చినుకు కురవలేదు. వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఏడాది 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని సెపె్టంబర్ 5న త్రిసభ్య కమిటీ ప్రకటించింది. ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని కేఆర్ఎంబీ కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో కరువొస్తే...కాంగ్రెస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు తెలివైనవారు. ఎవరు ఏమిటో వారికి తెలుసు. ఇప్పటికే ఒకసారి కర్రుకాల్చి వాతపెట్టారు. అయినా సిగ్గురాలే. మళ్లీ వారికి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనజాతరకు భారీగా తరలిరావాలి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇదే స్ఫూర్తితో ఇదే వేదికపై నుంచి ఈ నెల 6న కాంగ్రెస్ జాతీయ గ్యారంటీలను ప్రకటించనుంది. ఏఐసీసీ ముఖ్యనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు లక్షల మందికి తగ్గకుండా సభకు తరలించాలని నిర్ణయించింది. సభలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నాం. వారికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నాం. సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం’అని మంత్రులు వివరించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నేత దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ స్థానం మన ఖాతాలోకే...
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానం ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మెదక్ స్థానంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని స్పష్టం చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మెదక్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖతోపాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ నేతలు కాటా శ్రీనివాస్‌గౌడ్, ఆవుల రాజిరెడ్డి, చెరు కు శ్రీనివాస్‌రెడ్డి, పూజల హరికృష్ణ, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, బీజేపీని కూడా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రచారా్రస్తాలుగా చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కోరారు. మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలనీ, నేతలు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకోవడం ద్వారా పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. -
‘జన జాతర’కు ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్‌సభ స్థానంతో పాటు పార్టీకి విజయావకాశాలున్న పలు చోట్ల ఆమె చురుగ్గా ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించిన కారణంగానే ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న ‘జనజాతర’సభకు హాజరు కానున్నట్టు సమాచారం. తొలుత ఈ సభకు రాహుల్‌గాందీ, మల్లికార్జు న ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. తుక్కుగూడ సభతో పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఏఐసీసీతో సమ న్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో.. మరుసటి రోజే తుక్కుగూడ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ఈనెల ఐదో తేదీన మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే తుక్కుగూడలో సభ జరుగుతుండడం, సభకు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర ముఖ్యులు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. భారీ జనసందోహం మధ్య లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ నుంచే ఏఐసీసీ జంగ్ సైరన్ మోగిస్తుందని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న ఐదు గ్యారంటీలను తెలుగులో విడుదల చేయనున్నారు. అచ్చొచ్చిన చోట.. పది లక్షల మందితో తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సభకు కనీసం పదిలక్షల మంది హాజరవుతారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్ తరలివచ్చేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే రేవంత్ నేతృత్వంలో టీపీసీసీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెపె్టంబర్ 17న ఇక్కడ నిర్వహించిన సభకు సోనియాగాంధీ హాజరై ఆరు గ్యారంటీలను ప్రకటించారు. విజయభేరి పేరుతో సభ నిర్వహించిన ఈ ప్రాంతం కలిసివచ్చిందని, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ప్రారంభ సభ ప్రాంతాన్నే లోక్‌సభ ఎన్నికల కోసం ఎంచుకున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ స్ఫూర్తితోనే దేశంలో పదేళ్లనియంతృత్వ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు తెరదించుతామని చెబుతున్నాయి. ఆసక్తి రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు గత ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందని అప్పటి పీసీసీ అధ్య క్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9న కొలువుదీరే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహా్వనితులేనని చెప్పుకొచ్చారు. ఈనెల 6న జరిగే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు రెండురోజుల కిందట తుక్కుగూడకు వచ్చిన సీఎం.. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. దీంతో తుక్కుగూడ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీ.. ప్రధానమంత్రి తాపీ మేస్త్రీ..
వికారాబాద్: ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఇద్ద రూ తెలంగాణకు సమాధి కట్టేందుకు కలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ’’అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ రేవంత్‌కు సహకారం అందించిండు.. .ఇప్పుడు రేవంత్ మోదీకి సహకరిస్తున్నడు’’అని ఆరోపించారు. బుధవారం వికారాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఓ గుంపు మేస్త్రీ.. ప్రధాన మంత్రి ఓ తాపీ మేస్త్రీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ’’ప్రధానిగా మోదీ పదేళ్ల పాలన వెలగబెట్టిండు.. పేదలకే కాదు దేశానికి కూడా చేసిందేమీ లేదు.. అందుకే ఇప్పుడు ఎన్నికలు రాగానే రాముని పేరుతో ఓట్లడుగుతుండు. రాముడు మన క్కూడా దేవుడే.. రాముడికి మనం కూడా మొక్కుదాం.. కానీ బీజేపీని పండబెట్టి తొక్కుదాం’’అని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్‌తో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసిన మోదీకి ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. మోదీ మన ప్రియమైన ప్రధాని కాదు.. ఆయన ఓ పిరమైన ప్రధాని అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీకి ఓట్లేయాలి.. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చారని ఓట్లేయాలా...? రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా...? రూ. 15 లక్షలు పేదల అకౌంట్లో వేశారా..? అని నిలదీశారు. బీజేపీ నాయకులు చెబుతున్నట్టు మోదీ హవా ఉంటే పక్క పార్టీల నుంచి ఎందుకు క్యాండెట్లను తెచ్చుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. పదేళ్ల నిజానికి, అబద్ధాలకు పోటీ ఇది కాంగ్రెస్ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు.. పదేళ్ల నిజానికి వందేళ్ల అబద్ధాలకు మధ్య జరుగుతున్న పోటీ ఇది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను మోసం చేసి వెళ్లిపోయిన వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. ’’బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల లిస్టు చూడండి అందరూ మన పార్టీ నుండి పోయిన వారేనని’’అన్నారు. ’’సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా పరిపాలన నాచేతిలో లేదు.. ఎన్నికల కమీషన్ చేతిలో ఉంది అంటున్నాడు. రేవంత్ ఇంకా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడుతున్నడు.. ఓడిపోతామని తెలిసే మల్కాజ్గిరి, చేవెళ్లలో డమ్మి అభ్యర్థులను పెట్టిండు.. కత్తెర జెబులో పెట్టుకుని తిరిగేందుకు రేవంత్ ఏమైనా బోటి కొట్టెటోడా..?’’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఇద్దరూ విశ్వాస ఘాతకులే అని కేటీఆర్ విమర్శించారు. కష్టకాలంలో పోటీకి సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. తెలంగాణ భవన్లో ఇఫ్తార్ విందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొన్నారు. పార్టీ నేతలు మహమూద్ అలీ, ఫారుక్ హుస్సేన్‌లకు కేటీఆర్ ఖర్జూరం తినిపించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేత పద్మారావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్ -
ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా?
సాక్షి యాదాద్రి: ఆరు గ్యారంటీలపై మంత్రులు చర్చకు సిద్ధంగా ఉన్నారా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందని, ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బుధవారం భువనగిరిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్ మాట్లాడారు. ప్రభుత్వంలోని పెద్దలు పాలనను పక్కనబెట్టి బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్‌రెడ్డి, పట్నం సునీత నాలుగో స్థానంలో ఉంటారని జోస్యం చెప్పారు. పార్టీ మారుతున్న స్వార్థపరులను ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారని హరీశ్‌రావు చెప్పారు. రాహుల్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనుడీయన భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘనుడని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్‌రెడ్డి, ప్రియాంకా గాంధీ ఈ భువనగిరిలోనే హామీ ఇచ్చారని, కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు కాంగ్రెస్‌కు ఓటేస్తే నష్టపోతామన్న విషయం అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు. దేవుడిని అడ్డంపెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందనీ, దేవుడి పేరుతో ఎన్నాళ్లు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందనీ, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్రమ కేసుల గురించి దిగులు చెందవద్దని, కేసుల పరిష్కారానికి తెలంగాణ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామని హరీశ్ భరోసానిచ్చారు. కార్యకర్తలంతా కలిసి నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుస్తారని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నా వ్యక్తిత్వ హననానికి రేవంత్‌రెడ్డి యత్నం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘నాకు ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాలతో, ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంటూ లీకు వీరుడు రేవంత్‌రెడ్డి నా వ్యక్తిత్వ హననానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు బయట పెట్టే దమ్ము లేదు. పోలీసు రిమాండులో ఉన్న వారి ఫోన్ల నుంచి కూడా లీకులు వస్తున్నాయి. నేను ఎవరో హీరోయిన్లను బెదిరించినట్లు మంత్రి కొండా సురేఖ మెదడు లేని విమర్శలు చేస్తోంది. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మనాకేంటి? ఎవరి ఫోన్లూ ట్యాపింగ్ చేయాల్సిన, బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. అడ్డగోలుగా చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాటతీస్తాం.. న్యాయపరంగా ఎదుర్కొంటాం..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌పై 2004 నుంచే విచారణ జరిపించాలి ‘2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు, అప్పుడు ఎంపీలుగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. అందువల్ల విచారణ పరిధి పెంచి 2014 నుంచి కాదు 2004 నుంచి ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపించాలి. పోలీసు అధికారులు మహేందర్‌రెడ్డి, శివధర్‌రెడ్డి, రవిగుప్తా తదితరులు 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పోస్టుల్లో పనిచేశారు. కేసీఆర్ మాత్రమే బాధ్యులు అని లీకులు ఇస్తున్నవారు ఆ ఆధికారులను ఎందుకు విచారణకు పిలవడం లేదు. గతంలో నా ఫోన్ మీదా నిఘా ఉన్నట్లు ఆపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంటూ యూ ట్యూబ్‌లు, పనికి మాలిన ఛానళ్లకు రిమాండు రిపోర్టు పేరిట లీకులు ఇస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ‘రుణమాఫీపై వెకిలిగా నవ్వుతున్న రేవంత్‌రెడ్డి మొగోడు అయితే రైతులకు ఊరటనివ్వాలి. కాళేశ్వరం, గొర్రెలు..బర్రెల స్కీంలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంటూ రోజుకో అంశం తెరమీదకు తెస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోని పక్షంలో ఇద్దరి పదవులు ఊడగొట్టేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన 218 మంది రైతుల వివరాలను వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి పంపిస్తాం. గతంలో ప్రకటించినట్టుగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీటి నిర్వహణ చేత కావడం లేదు ‘రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి ధన వనరులు తరలిస్తున్న రేవంత్‌రెడ్డికి జలరాశులు తరలింపునకు ఓపిక లేదు. బీఆర్ఎస్ పాలనలో రూ.38 వేల కోట్లతో మిషన్ భగీరథ పూర్తి చేయడంతో పాటు హైదరాబాద్ నగరానికి వచ్చే 50 ఏళ్ల పాటు తాగునీతి కొరత రాకుండా చేశాం. రాష్ట్రంలో 14 శాతం అధిక వర్షపాతం నమోదైనా నీటి నిర్వహణ చేత కావడం లేదు. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే నాగార్జునసాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నా ప్రజలు ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీటి కోసం ఢిల్లీని దేబిరించాల్సిన పరిస్థితిని రేవంత్ ప్రభుత్వం కల్పించింది. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని పంటలు ఎండబెట్టారు కాళేశ్వరం నీళ్లను దాచి పెట్టడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మేడిగడ్డకు మరమ్మతులు చేసి ఉంటే సాగు, తాగునీటి కష్టాలు ఉండేవి కావు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే పంటలను ప్రభుత్వం ఎండబెట్టింది. కాంగ్రెస్‌కు హైదరాబాద్ నగర ఓటర్లు ఓటు వేయలేదనే కక్షతోనే నీటి సరఫరా చేయడం లేదు. తాగునీటి సమస్యపై అవసరమైతే జలమండలి ఎదుట ధర్నా చేస్తాం. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌పై కాకుండా వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: కేటీఆర్
సాక్షి, వికారాబాద్ జిల్లా: రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్‌లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా పాత బీఆర్ఎస్ నేతలేనన్నారు. చెవెళ్లలో కొండా, రంజిత్ రెడ్డి.. మల్కాజిగిరిలో ఈటల, సునీతా.. వరంగల్‌లో ఆరురి, కడియం కావ్య.. ఆదిలాబాద్‌లో నగేష్, భువనగిరిలో బూర.. వీరంతా బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్లేనన్నారు. పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్నుంచి తీసుకెళ్లారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నాకు ఎలాంటి సంబంధం లేదు ‘ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము. తాట తీస్తాం. నేను భయపడను’ అను కేటీఆర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కొరత: కేటీఆర్ ఫైర్ -
ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కొరత: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ ఢిల్లీకి నిధులు పంపించడంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జల వనరులను తరలించడంపై సీఎం రేవంత్‌కు అసలు శ్రద్ధ లేదని అన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయని చెప్పుకొచ్చారు. కాగా, కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అసమర్థ ముఖ్యమంత్రికి డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదు. సాగునీరు, తాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయి. ఇది ప్రకృతి కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత ఇది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. చేతనైతే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తాలి. హైదరాబాద్ చుట్టూ ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు ఉన్నా.. నగరంలో నీటి ఎద్దడికి కారుకులు ఎవరు?. మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్నారు. మంచి నీళ్లు మహాప్రభో అంటూ ప్రజలు అల్లాడుతున్నారు. రేవంత్ మాత్రం గొంగు చించుకుని తిడుతున్నారు. 2023లో నవంబర్లోనే మేము స్పష్టంగా చెప్పాము. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని. కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తాం.కాంగ్రెస్‌కు హైదరాబాదీలు ఓటు వేయదు. అది అందరికీ తెలుసు.. అందుకే హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టావా రేవంత్?. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీగా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. కచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కోర్టుకు వెళ్తాం. ఘన్పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారు. ఆయనకు నా అభినందనలు. అలాగే, ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదని మళ్లీ చెబుతున్నాను. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము.. తాట తీస్తాం. నేను ఎవరికీ భయపడను అని వార్నింగ్ ఇచ్చారు. -
ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కొరత: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ ఢిల్లీకి నిధులు పంపించడంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జల వనరులను తరలించడంపై సీఎం రేవంత్‌కు అసలు శ్రద్ధ లేదని అన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయని చెప్పుకొచ్చారు. కాగా, కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అసమర్థ ముఖ్యమంత్రికి డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదు. సాగునీరు, తాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయి. ఇది ప్రకృతి కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత ఇది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. చేతనైతే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తాలి. హైదరాబాద్ చుట్టూ ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు ఉన్నా.. నగరంలో నీటి ఎద్దడికి కారుకులు ఎవరు?. మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్నారు. మంచి నీళ్లు మహాప్రభో అంటూ ప్రజలు అల్లాడుతున్నారు. రేవంత్ మాత్రం గొంగు చించుకుని తిడుతున్నారు. 2023లో నవంబర్లోనే మేము స్పష్టంగా చెప్పాము. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని. కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తాం. కాంగ్రెస్‌కు హైదరాబాదీలు ఓటు వేయదు. అది అందరికీ తెలుసు.. అందుకే హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టావా రేవంత్?. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీగా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. కచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కోర్టుకు వెళ్తాం. ఘన్పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారు. ఆయనకు నా అభినందనలు. అలాగే, ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదని మళ్లీ చెబుతున్నాను. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము.. తాట తీస్తాం. నేను ఎవరికీ భయపడను అని వార్నింగ్ ఇచ్చారు. -
2014 నుంచి ట్యాపింగ్‌లపై విచారణ జరిపించాలి: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయిన 2014 జూన్ 2 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ జరిపించి.. తప్పు చేసిన వారిని శిక్షించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తాను ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమాజం ఎదుట ఇన్ని ఆధారాలు పెట్టినా కూడా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని, అన్ని తెలిసి కూడా సీఎం సగం మాత్రం బయటపెట్టడం కూడా సరికాదన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. 2015లో జరిగిన ఓటుకు కోట్లు కేసులో జరిగిన రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టి 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్ల కేసుపై కూడా విచారణ జరిపితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. 2015లో జరిగిన తన టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ‘రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఎస్ఐబీలో ఉన్నది ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్... రేవంత్‌రెడ్డి ఇవ్వన్ని ఎందుకు దాచిపెడుతున్నారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బయటపడిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో అప్పటి సీఎం, అప్పటి డీజీపీలను ఎందుకు ముద్దాయిలుగా చేర్చడం లేదని ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ పేరును ఎందుకు ఇందులో చేర్చడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి ముద్దాయిగా కేసీఆర్, ఆ తర్వాత హరీశ్‌రావు, వెంకట్రాంరెడ్డి, కేటీఆర్, నవీన్‌రావు, సందీప్రావుల పేర్లు వరుసగా చేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అవగాహనతోనే విచారణ ప్రస్తుతం ఈ కేసు విచారణ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య కుదిరిన అవగాహనతోనే జరుగుతోందని రఘునందన్‌రావు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రూ.3.5 కోట్లు పట్టుకున్నా, ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడకు పోయాయని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో సెలెక్టివ్ విచారణ జరుగుతున్నదనే అనుమానం కలుగుతోందన్నారు. ‘దుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ జరిగిందని డీజీపీకి చెప్పాను. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావును ముద్దాయిగా చేయాలని చెప్పిన. ఎందుకు చేర్చుతలేరో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంగారు దుకాణాల ఓనర్లను బెదిరించి వాళ్ల దగ్గర తెచ్చిన బంగారంతో యాదగిరి టెంపుల్ కట్టారా అని ప్రశ్నించారు. రఘునందన్‌రావుపై కేసు నమోదు సంగారెడ్డి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
రేవంత్ బీజేపీలోకి వెళ్లడం పక్కా
శామీర్‌పేట్: సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డే అని వ్యాఖ్యానించారు. అలియాబాద్‌లో మంగళవారం జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీని చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ మాత్రం మోదీ హమారా బడే భాయి ( పెద్దన్న ) అంటున్నారని గుర్తు చేశారు. అసలు సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కోసం పని చేస్తున్నాడా లేక నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడా అనే సందేహం కలుగుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లిక్కర్‌స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయ మని అంటున్న రేవంత్ కవిత అరెస్టు కరెక్ట్ అని ఎలా అంటారని నిలదీశారు. మందికి పుట్టిన బిడ్డ లని తమ బిడ్డలని చెప్పుకోవడమే సీఎం రేవంత్ తత్వమని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తాను చేశానని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని, ఆయన పక్కనే ఉన్న నల్లగొండ, ఖమ్మం మానవ బాంబులతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఆ తర్వాతే ఈటల ఓట్లడగాలి: మల్కాజ్‌గిరిలో బీజేపీతోనే బీఆర్ఎస్కు పోటీ అని, కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యరి్ధని పెట్టిందని కేటీఆర్ అన్నారు. అందుకే మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి అభివృద్ధికి కేసీఆర్ ఏం చేశారో తాము చెప్పగలమని,, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏం చేసిందో చెప్పి ఈటల రాజేందర్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా కంటోన్మెంట్ భూములు కావా లని అడిగితే బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని, చివరికి తెలుగు అధికారి గిరిధర్ వల్ల పైల్ కదిలిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేయలేదని ఈటల అనడం సిగ్గు చేటని, ఆయన ఆరి్ధకమంత్రిగా ఉన్నప్పుడే రూ. 16 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జ్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు వికారాబాద్‌లో కేటీఆర్ పర్యటన సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వికారాబాద్‌లో పర్యటించనున్నారు. వికారాబాద్‌లోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11:30 గంటలకు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. -
6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే?
ఇల్లెందు: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన గత నెల 12న మణుగూరులో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సభకు సైతం హాజరయ్యారు. మంగళవారం ఇల్లెందులో జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్ సమావేశంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంకట్రావును వివరణ కోరగా త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. వ్యవస్థలను కేసీఆర్ నాశనం చేశారు: తుమ్మల ఇల్లెందు సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్తవి కూడా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజనూ కొంటామన్నారు. ఇప్పటికే 92.36 శాతం రైతుబంధు పంపిణీ పూర్తి చేశామని, పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. -
ఎన్నికల వేడి.. కరువు దాడి
సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాల విడుదలపై రాజుకున్న వివాదానికి మంగళవారం తెరపడింది. కొన్ని రోజులుగా కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు నిలిపివేయడంతో ఆ వాగు ఆయకట్టు ప్రాంతంలోని వరి పొలాలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే తామే మల్లన్నసాగర్ గేట్లను తెరుస్తామని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మల్లన్నసాగర్ గేట్లను ఎత్తి కొండపోచమ్మ సాగర్ కాల్వలోకి నీటిని వదిలారు. సాయంత్రం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ సాగర్ కాల్వ నుంచి కూడవెల్లిలోకి గోదావరి జలాలను వదిలారు. – గజ్వేల్ సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారాయి. కరువు పేరిట రాజకీయ యుద్ధానికి తెరలేపుతున్నాయి. రైతు సంబంధిత అంశాలను అ్రస్తాలుగా మార్చుకుంటున్నా యి. విపక్షాలు, అధికార పక్షం ఒకదానిపై మరొకటి మాటల దాడులు చేసుకుంటున్నాయి. రైతు సంక్షేమానికి పాటు పడేది తామేనంటూ ఏకరువు పెడుతున్నాయి. ఎండిన పంటల పరిశీలన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో చేసిన పర్యటనతో కరువు రాజకీయం ముదురు పాకాన పడింది. కాంగ్రెస్ తెచ్చిన కరువన్న కేసీఆర్ జిల్లాల పర్యటనలో కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని ధ్వజమెత్తారు. అంతేకాకుండా రైతుల పక్షాన కార్యాచరణలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టింది. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ పార్టీ నేతలు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈనెల 5వ తేదీన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనలకు సైతం కేసీఆర్ సిద్ధమవుతుండగా, 6వ తేదీన వరి పంటకు బోనస్ డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు రిజర్వాయర్ల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. భరోసా పేరిట బీజేపీ బీజేపీ కూడా రైతుల పక్షాన ఆందోళనలకు దిగింది. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసమంటూ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మంగళవారం కరీంనగర్ వేదికగా రైతుదీక్ష చేపట్టారు. ఇదే క్రమంలో ఈనెల ఐదో తేదీన రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతూ విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతోంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఇతర మంత్రులు ధీటుగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. -
కరువుకు, కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటి?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని, చనిపోయిన వారు నిజంగా రైతులే అయితే వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు సవాల్ విసిరారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే.. ఏ ఊరిలో? ఏ రైతు చనిపోయాడో? 48 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. ఎన్నికల తర్వాత వారి కుటుంబాలను సచివాలయానికి పిలిపించి మాట్లాడటమే కాకుండా వారిని ఆదుకునేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో ఈ నెల 6న తెలంగాణ జనజాతర పేరిట జరగనున్న కాంగ్రెస్ మహాసభ ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయినట్లుగా కేసీఆర్ చెబుతున్నారంటూ ఓ విలేకరి ప్రస్తావించగా సీఎం స్పందించారు. వర్షాకాలంలో వానలు పడకే కరువు ‘80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు వానాకాలం ఎప్పుడొస్తుందో.. చలికాలం ఎప్పుడు వస్తుందో తెలియదా? కరువుకు, కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది చలికాలంలో. చలికాలంలో వర్షాలు కురుస్తాయా? వర్షాకాలంలో వానలు పడక పోవడం వల్ల ప్రస్తుతం కరువొచ్చింది. కేసీఆర్ పాపాల వల్లే వరుణ దేవుడు భయపడి పారిపోయాడు. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయడం సమంజసమా?..’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 64 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు నగదు వేశాం ‘వంద రోజులు కాలేదు. కానీ అప్పుడే అది చేయలేదు. ఇది చేయలేదని అంటున్నారు. వంద రోజుల్లోనే 64,75,000 మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు వేశాం. 69 లక్షల ఖాతాలు ఉండగా, ఇప్పటికే 64 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేశాం. అసెంబ్లీలోనే ఈ లెక్కలు బయట పెట్టా. నువ్వు వస్తావని ఆశించా. కానీ రాకుండా పారిపోయావు. లెక్కల్లో తప్పులు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే..’అని సీఎం అన్నారు. 30 సెకన్లు కూడా కరెంటు పోలేదు ‘సూర్యాపేటలోని ఏ సబ్‌స్టేషన్‌లోనూ 30 సెకన్లు కూడా కరెంట్ పోలేదు. ఆయన పెట్టుకున్న మైకుకు జనరేటర్ ఉంది. దానిలో ఎవరు వేలు పెట్టారో ఎవరికి తెలుసు? పదేళ్లు ప్రతి పక్షంలో ఉన్నాం. ఏ ఒక్క రోజైనా మమ్మల్ని బయటికి వెళ్లనిచ్చావా? ప్రతిపక్షాల గొంతులు నొక్కి, గొర్రెలను ఈడ్చుకెళ్లినట్లుగా ఈడ్చుకెళ్లి జైళ్లలో పెట్టించావు. కానీ మేము ప్రతిపక్ష నేతకు పూర్తి రక్షణ కల్పించాం. ప్రజా సమస్యలపై తొలిసారిగా బయటికి వచ్చావు. కనీసం ఇలాగైనా పాపాలు కడుక్కుంటారని అనుమతి ఇచ్చాం..’అని రేవంత్ ఎద్దేవా చేశారు. రూ.100 కోట్లు పంచినా సానుభూతి వచ్చేది ‘పలు రకాల కమీషన్ల రూపంలో వచ్చిన రూ.1,500 కోట్లు నీ ఖాతాల్లో ఉన్నాయి. ఆ పాపపు సొమ్ములో రూ.100 కోట్లు పంచినా..ప్రజలకు మేలు జరిగేది. రైతుల పట్ల నీకు సానుభూతి ఉందని ప్రజలు అనుకునేవారు. ప్రజల పంట ఎండిపోతే..దాన్నుంచి కూడా ఎన్నికల్లో లబ్ధి పొందాలని నక్కజిత్తుల వేషాలు వేశావు. పొగ పెడితే ఎలుకలు బయటికి వచ్చినట్లు..ఎన్నికలనే పొగ పెట్టడంతో కేసీఆర్ బయటికి వచ్చాడు. లేదంటే ఆయన ఫాం హౌస్ కూడా దాటి వచ్చేవాడు కాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఆగమాగమవుతుండు..’అని సీఎం వ్యాఖ్యానించారు. కూలగొట్టిన సంసారాన్ని నిలబెడుతున్నాం ‘వరికోతలు ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే 700కు పైగా ఐకేపీ కేంద్రాలు తెరిపించాం. నీలాగా క్వింటాల్‌కు 10 కేజీలు కోత కోసే అలవాటు లేదు. ఎవరైనా అలా చేస్తే వారి తిత్తి తీస్తాం. నీలాగా మేము కమీషన్ల దందా చేయం. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్టుకు క్లియరెన్స్, నిధులు తీసుకొచ్చామే కానీ నీలాగా కమీషన్ల కోసం పని చేయలేదు. రాష్ట్రంలో కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రూ.22,500 కోట్లతో ఇళ్లులేని పేదలకు ఇళ్లు ఇచ్చాం. ఆడ బిడ్డల కళ్లల్లో సంతోషాన్ని చూసి ఆయన కడుపులో నిప్పులు పోసుకుంటున్నాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదన్నట్లు, కేసీఆర్ శాపనార్థాలు మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు. కేసీఆర్ చెల్లని రూ.1,000 నోటు లాంటి వాడు. చెల్లని వెయ్యిని జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం..’అని రేవంత్ అన్నారు. తాగునీటి సరఫరాకు ప్రణాళికలు ‘నేను ఫాం హౌస్‌లో పడుకోవట్లే.. సినిమా వాళ్ల గెస్ట్ హౌసుల్లో పడుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా పునరుద్ధరించాలనే అంశంపై చర్చిస్తున్నాం. తాగు నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. హైదరాబాద్ నగరానికి సరిపడా తాగునీరు ఇస్తున్నాం. కృష్ణా జలాలు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో వచ్చే 90 రోజులకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. తుక్కుగూడ వేదికగా జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించనుందని చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, జూన్ 9న రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతోందని అన్నారు. సభకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. -
రైతులను ఆదుకునే శ్రద్ధ ఉందా?
సాక్షి, సిద్దిపేట: విపక్షనేతల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే సీఎం, మంత్రులు ఇంతవరకు వెళ్లి చూడలేదన్నారు. రైతులను ఆదుకునేందుకు సమయం దొరకడం లేదని, కానీ బీఆర్ఎస్ నేతలను తిట్టడం, కేసులు పెట్టడం బిజీగా ఉన్నారని చెప్పారు. మంగళవారం ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ మనుచౌదరికి హరీశ్‌రావు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం, విద్యుత్ లోపాల వలన రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టాకే సర్కారు కళ్లు తెరిచిందని చెప్పారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా..? భట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నారు. తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీల విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. కలిస్తే జోడీ..లేదంటే ఈడీ గజ్వేల్: ‘కలిస్తే జోడీ..లేదంటే ఈడీ అనే తరహాలో బీజేపీ వ్యవహరిస్తుండగా, వంద రోజుల పాలనలో కాంగ్రెస్ వైఫ్యలాలను మూటగట్టుకున్నదని..ఈ రెండు పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరముంది’అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మెదక్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కోసం పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసిన తర్వాతే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ప్రజల తిరస్కరణకు గురైన రఘునందన్‌రావుకు ప్రజలు ఓటు వేసే అవకాశమే లేదని చెప్పారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే..రూ.100 కోట్ల తన నిధులతో ట్రస్టు స్థాపిస్తానని హామీ ఇచ్చారు. పాల బిల్లులు చెల్లించండి సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాడి రైతులకు చెల్లించాల్సిన రూ.80 కోట్ల పాల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన మంగళవారం లేఖ రాశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు క్రమపద్ధతిలో చెల్లించేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని తన లేఖలో పేర్కొన్నారు. దీంతో 45 రోజులుగా రైతులకు రావాల్సిన రూ.80 కోట్ల మేర పాల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాడి రైతులకు బకాయిలు చెల్లించాలని కోరారు. -
ఎకరాకు రూ.25వేలు పరిహారమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్‌కు వస్తున్నా రని తెలిసే గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి వదులుతున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో చేనేత కారి్మకులను ఆదుకునేందుకు జోలె పట్టిన కేసీఆర్ ప్రస్తుతం రైతులకు ధైర్యం చెప్పేందుకు పంటల పొలాలకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం సమర్పించింది. రైతుబంధు సకాలంలో రాకపోవడం, రైతు రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. 3 నెలల్లోనే 200మందికి పైగా రైతులు మరణించారని, 20 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్‌లోనూ తాగునీటి ఇబ్బందులు తీవ్రమయ్యా యని పేర్కొన్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం, క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. రూ.2లక్షల రుణమాఫీని తక్షణమే అమ లు చేయాలని, రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్‌ను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభా‹Ùరెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి ఉన్నారు. ఎన్నాళ్లు కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు? అనంతరం తెలంగాణ భవన్లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతాంగం కష్టాల్లో ఉందనే సోయి లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మూటలతో ఢిల్లీకి పోవడమే సరిపోతోందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లెత్తాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని, సాగునీటి ప్రాజెక్టుల గేట్లు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నగరాలు, పట్టణాల్లో మంచినీటి కొరత మొదలైనా పట్టించుకోరా? అని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ము లేదని కాంగ్రెస్ లేఖ ఇస్తే తానే కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పిస్తానని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆరుగురే నేతలు మిగులుతారని, కేసీఆర్ కుటుంబలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితలే ఉంటారని ఎద్దే వా చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ‘రైతు దీక్ష’లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు, రుణమాఫీ, సాగునీటి కొరత, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఈ దీక్ష తలపెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలన్న ఆలోచన లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలనే ఆలోచన బీజేపీకి లేదని బండి స్పష్టం చేశారు. కేసీఆర్‌కి 2 బీహెచ్‌కే (బేటా ఔర్ బాప్, హరీశ్, కవిత) పరి స్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నారని బండి విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్.. రూ.600కోట్లతో అమలు చేసినట్లుగా మీడియాలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పంటనష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని పంటలకూ రూ.500 బోనస్ ప్రకటించాలని కోరారు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఎందుకివ్వడం లేదని, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు? గతేడాది చొప్పదండి నియోజకవర్గంలోని రామగుడులో పంట నష్టపోతే రైతులను పరామర్శించిన కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని మాట తప్పారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పిన తరువాతే కేసీఆర్ కరీంనగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. మేం బరాబర్ శ్రీరాముడి ఫొటోతో ఓట్లడుగుతాం.. కాంగ్రెస్‌కు దమ్ముంటే బాబర్ ఫొటోతో ప్రచారం చేసుకోవాలని బండి సవాల్ విసిరారు. -
దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్‌లో కూడా దానం నాగేందర్‌ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్‌రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు.