breaking news
-
బీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఎక్స్ వేదికగా నిర్వహించే ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఇందులో భాగంగా పాదయాత్రపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ‘‘పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్‌లో పాదయాత్ర చేస్తా. రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృతంగా పాదయాత్ర చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం. కాంగ్రెస్ పాలనలో నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం’’ అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ వ్యూహాలతో కేటీఆర్ పాదయాత్రఎన్నికల్లో పరాజయం. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం.రోజురోజుకి పార్టీ బలహీన పడుతుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ఆ హామీల్ని నిలబెట్టుకోలేదని, దాంతో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేస్తున్న కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.దీనికి సంబంధించి ఆయన ఈ మధ్యనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని గులాబీ పార్టీనేతలు చెప్పుకుంటున్నారు.పార్టీని ఉద్యమ పార్టీగా మలచి,ప్రజల అభిమానం గెలుచుకుని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ తిరిగి పార్టీని బలోపేతం చేయడం కోసం పాదయాత్రకి ప్రణాళిక సిద్ధం చేశారట. ఇందులో భాగంగా కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై, ప్రజల సమస్యలను తెలుసుకుని అధికార పార్టీని నిలదీస్తారని ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో నేతలు వ్యవహరించాల్సిన తీరును ఇప్పటికే వివరించారని, త్వరలోనే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు
సాక్షి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవలే పార్టీ కార్యకర్త వరద భాస్కర్‌ను పోలీసులు కొట్టారనే ఆరోపణపై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మరో పదిహేను మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తపై వన్‌టౌన్ సీఐ దౌర్జన్యం చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని బీఆర్ఎస్ కార్యకర్తను రబ్బరు బెల్టుతో సీఐ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐ తీరును వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ పీఎస్ ముందు శ్రీనివాస్‌గౌడ్ ఆందోళనకు దిగుతూ.. పోలీసుల తీరుపై శ్రీనివాస్‌గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజున సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ (#ASKKTR) పేరుతో ఈరోజు సాయంత్రం నుంచి నెటిజన్లతో కేటీఆర్ ముచ్చటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మద్దతుదారులు, నెటిజన్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.#ASKKTR కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. దేశం, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు దారుణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదు. పాలిటిక్స్‌లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా చీప్ పాలిటిక్స్ చేయలేదు. నా రాజకీయ జీవితంలో నా కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నాను. కానీ ప్రజల కోసం నిలబడి.. పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను.1) I personally find it Very difficult to understand why our families are dragged into politics of vendetta. Never done that when we were in GovtIn the last 18 years of being in public life when my family and kids were humiliated, Thought many times of quitting but decided to… https://t.co/2YE160B9Lj— KTR (@KTRBRS) October 31, 2024 ఇదే సమయంలో కేసీఆర్ ఆరోగ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ కొంత సమయం ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి అంటూ ఏమీ లేదు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదు.అలాగే, ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి.. తర్వాత పార్టీ మారిన నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు. పార్టీ మారిన పది స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ బీఆర్ఎస్ నేతలే విజయం సాధిస్తారని అన్నారు. I believe By elections are inevitable in 10 assembly segments where BRS MLAs have defected https://t.co/gQyoYNSR3k— KTR (@KTRBRS) October 31, 2024People in districts believed Congress party’s Fake promises and Propaganda https://t.co/djuF4EuTIA— KTR (@KTRBRS) October 31, 2024మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయకపోవడంపై ఓ నెటిజన్ ప్రశ్నించగా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను అసలు నమ్మకండి. విభజన రాజకీయాలు చేయడంలో ఈ రెండు పార్టీలు ముందుంటాయి. స్థానిక పార్టీకే తమ మద్దతు ఉంటుందని.. ప్రజలు కూడా స్థానిక పార్టీలకే మద్దతు ఇవ్వాలన్నారు. రాహుల్ గాంధీని అసలు నమ్మవద్దంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. బిల్డర్లను భయపెట్టి వారి వద్ద నుంచి డబ్బులు కలెక్ట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారని అన్నారు. Wait and watch https://t.co/n9bHKpSqYh— KTR (@KTRBRS) October 31, 2024 -
ముందు నీ కుర్చీ కాపాడుకో
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్‌రెడ్డీ.. ముందు నీ కుర్చీకింద ఉన్న బాంబు గురించి చూసుకో.. నీ పక్కన ఉన్నవారు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో.. నీ మంత్రులే నిన్ను ముంచుతారు. ఒకరేమో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. మరొకరు ఢిల్లీలో అధిష్టానం వద్దకు రహస్యంగా వెళ్లివస్తున్నారు. మరొకరు హెలికాప్టర్ ఇవ్వలేదని అలిగారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను డీల్ చేయడం తర్వాత.. ముందు నీవు ఐదేళ్లు పదవిలో ఉండేలా చూసుకో.. ఐదేళ్ల తర్వాత నిన్ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. ఏడాది అవుతోంది.. మంత్రివర్గ విస్తరణ చేసుకోలేవు. కనీసం చీఫ్‌విప్, డిప్యూటీ స్పీకర్‌ను నియమించుకోలేకపోయావు..’అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ను వాడుకొని కేసీఆర్‌ను ఫినిష్ చేశానని, బావను ఉపయోగించి బామ్మర్దిని ఫినిష్ చేయిస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నీకు సీఎం పదవి కేసీఆర్ భిక్షే ‘నీ సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే. నీకు, కేసీఆర్‌కు పోలికా? నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన త్యాగశీలి, సాధనాపరుడు. ఆయన ఉద్యమం చేసి తెలంగాణ తేకుంటే నీవు సీఎం అయ్యేవాడివే కాదు. నోరు తెరిస్తే అబద్ధాలు. నిన్ను చూస్తే గోబెల్స్ కూడా సిగ్గుపడేవాడు. ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. రుణమాఫీ పాక్షికంగానే చేశావు. 31 రకాల కోతలతో రుణమాఫీని గణనీయంగా తగ్గించావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోల్ చేసేది, వికెట్ తీసేది మేమే. కేసులకు భయపడం. హామీలు ఎగవేసిందుకు నేను సీఎంను ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటే నాపై బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బుల్డోజర్లు నడిపించి చంపేస్తామని సీఎం అంటే ఆయనపై మాత్రం కేసు నమోదు చేయడం లేదు..’అని హరీశ్ అన్నారు. కూల్చివేతలు, కమీషన్లకే వ్యతిరేకం ‘మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్ల కూల్చివేత, రియల్ ఎస్టేట్‌కు అప్పగించడం, కమీషన్లకు మాత్రమే వ్యతిరేకం. టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి వాడపల్లి వరకు పాదయాత్రకు నేను, కేటీఆర్ రెడీ.. తేదీ, సమయం చెప్పు. ఎవరూ లేకుండా వెళ్దాం. మల్లన్నసాగర్ కోసం 50 వేల ఎకరాలు ముంపునకు గురైందంటూ అన్నీ అసత్యాలే చెప్పావు. మేము సేకరించిందే 17 వేల ఎకరాలు. అందులో 3 వేలకు పైగా ప్రభుత్వ భూమి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మేం 2013 భూ సేకరణ చట్టం కంటే ఎక్కువ ఇచ్చాం. అయినా తక్కువ ఇచ్చామని ఆరోపించారు కదా.. అంతకంటే ఎక్కువ మీరు మూసీ నిర్వాసితులకు ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు? గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వండి. వారి ఉపాధికి ఒక్కో కుటుంబానికి రూ.7.5 లక్షలు ఇవ్వండి. పెళ్లి కానివారికి రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వండి. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలేవు. సందర్శకులు రాకుండా తాళం వేశావు. ఇప్పుడు మూసీలో మహాత్మాగాంధీ విగ్రహం పెడ్తానంటున్నావు. మూసీ సుందరీకరణకు కేసీఆర్ ముందే ప్రణాళికలు వేశారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీలోకి తీసుకుని రావడానికి రూ.1100 కోట్లతో ప్రణాళిక చేస్తే.. నీవు మరింత దూరం వెళ్లి మల్లన్నసాగర్ అంటూ రూ.7,000 కోట్లకు పెంచావు. ఎందుకంటే నీ కమీషన్ల కోసం..’అని మాజీమంత్రి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఢమాల్ ‘సీఎం నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. అదే సమయంలో ఢిల్లీ, ముంబయి, బెంగుళూరులో పెరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో రూ.4.86 లక్షల కోట్లు అప్పు చేస్తే, రూ.7.50 లక్షల కోట్ల అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే రూ. 80 వేల కోట్ల అప్పు చేశారు..’అని హరీశ్‌రావు తెలిపారు. బెటాలియన్ పోలీసుల డిస్మిస్లు, సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏక్ పోలీస్ హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తే పిలిచి చర్చించకుండా సస్పెండ్, డిస్మిస్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. -
నువ్వు చెప్పులు మోసిననాడు.. ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు!
సాక్షి, హైదరాబాద్: సంవత్సరంలో కేసీఆర్ పేరును మరిచిపోయేలా చేస్తానని మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ చరిత్ర అంటేనే కేసీఆర్ అని వ్యాఖ్యానిస్తూ రేవంత్‌రెడ్డికి, కేసీఆర్‌కు మధ్య ఉన్న తేడాలను పోలుస్తూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశా డు.. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు.. ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశా డు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు.. ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు! నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు.. ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోశాడు’ అని పేర్కొన్నారు. చిట్టినాయుడూ... నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? అని ఎద్దేవా చేశారు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు..ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణ యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోలుస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తూర్పారపట్టారు. మూసీ ప్రక్షాళన, ధాన్యం కొను గోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వ్యాఖ్యా నించారు. ఈ మేరకు ట్వీట్ ఇలా సాగింది. ‘మూసీపై ముందుకు– కొనుగోళ్లపై వెనక్కు, రామన్నపేటకు రైరై – కొనుగోలు సెంటర్లకు నైనై, దామగుండం ధనాధన్– ధాన్యం కొనుగోళ్లు ఢాంఢాం, కొనుగోళ్లకు దిక్కులేదు –కాంగ్రెస్ కోతలకు లెక్క లేదు, దళారులకు దండిగా – రైతన్నలకు దండగ ’అని ప్రాసలతో కవితాత్మక ధోరణిలో విమర్శించారు. ఎద్దేడ్చిన ఎవుసం – రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని వ్యాఖ్యానించారు.10 నెలల్లో ఎవరికోసం అంత రుణం?నమ్మి నానబొస్తే... పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ పాలన అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మే రకు ‘ఎక్స్’లో ట్వీట్ చేస్తూ ప్రభుత్వం తీసుకుంటు న్న అప్పులపై ధ్వజమెత్తారు. 60ఏళ్ల సమైక్య పాల కులకన్నా పది నెలల్లోనే అధిక రుణం ఎవరి కోసం? పదేళ్లలో సాధించిన ప్రగతికన్నా పది నెలల్లో ఏం సాధించారని ఈ అప్పులు? అని ప్రశ్నించారు.సీఐ దాడి ఘటనపై సీరియస్ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై వాట్సాప్ ద్వారా ప్రశ్నించిన మహబూబ్ నగర్ కు చెందిన భాస్కర్ ముదిరాజ్‌ను స్థానిక సీఐ అప్పయ్య బెల్ట్‌తో కొట్టిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్‌కు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి అడిగి తెలు సుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపుల కు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయపరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు కూడా వెళ్తామన్నారు. -
ముందు కుర్చీని కాపాడుకోవాలిగా: రేవంత్‌కు హరీష్ రావు చురకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ 100 సీట్లు రావడం ఖాయమని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష అని అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకూ.. నాకలోకానికి ఉన్న తేడా ఉందన్నారు.ఈ మేరకు తెలంగాణ భవన్లో బుధవారం మాట్లాడుతూ..‘మమ్మల్ని డీల్ చేయడం కాదు. సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలి. కుర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో ఉన్నాడు. పక్కనున్న వాళ్లే ఆయన్ను దించేయకుండా జాగ్రత్త పడాలి. ఐదేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్. సీఎం అయ్యేది కేసీఆర్. దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది. కాంగ్రెస్ ఖతం అయిపోయిందా?. రుణమాఫీ విషయంలో రేవంత్ రైతులను మోసం చేశారు. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా.. ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్ హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులును కూడా నింపలేడు.మూసీ సుందరీకరణకు మేము అనుకూలమే. అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి వ్యతిరేకం. మూసీ పేరిట కమీషన్లు, పేదల ఇళ్లను కూల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నాం. మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీ రాజమౌళి సినిమాను తలపిది. మూసీ బాధితులకు మల్లన్న సాగర్‌కు మించిన పరిహారం ఇవ్వాలి. మూసీ బాధితులకు గచ్చిబౌలి భూముల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. హైదరాబాద్ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు రావాలి’ అని సవాల్ విసిరారు. -
ఇచ్చింది కన్నా లాక్కున్నదే ఎక్కువ!.. రేవంత్ పాలనపై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘60 ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం.. ఎవరి కోసం?. పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు?. మీ ఆరు గ్యారంటీలు అర్ధ గ్యారంటీలుగా మిగిలి పోయాయి! అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి’’ అని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.‘‘కట్టింది కన్నా కూల్చిందే ఎక్కువ!. ఇచ్చింది కన్నా లాక్కున్నదే ఎక్కువ!. అర్థం లేని అప్పులు! ఎక్కే దిగే ఢిల్లీ ఫైట్లు!. ఆదాని ముందు పొర్లు దండాలు! ఇదేగా మీ పది నెలల పాలన?. పటిష్టమైన బంగారు రాష్ట్రాన్ని "చేతి"కి అందిస్తే.. భ్రష్టు పట్టిస్తున్నరు’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన 60ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం..ఎవరి కోసం?పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు? మీ ఆరు గ్యారంటీలు అర్థ గ్యారంటీలు గా మిగిలి పోయాయి! అప్పులు మాత్రం ఆకాశాన్ని… pic.twitter.com/A0EQOXYYcC— KTR (@KTRBRS) October 30, 2024 -
కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. గాంధీ భవన్లో కుల గణనపై జరిగిన అవగాహన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించుకున్నామని రేవంత్ అన్నారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతకాంగ్రెస్ క్యాడర్, నేతలపై ఉంది. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని సూచిస్తున్నా. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలి. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.’’ అని రేవంత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్తగ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టేసింది. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారు.’’ అని రేవంత్ వివరించారు.పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు. రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
నిధులు కేంద్రానివి.. పేరు ఇందిరమ్మదా?: రఘునందన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేసీఅర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. అలాగే, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. బీఆర్ఎస్కు ప్రజలు సీఆర్ఎస్ (రిటైర్ మెంట్)ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తాం. ఆరు నెలల కింద కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12వందల కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.సొమ్ము కేంద్రానిది అయితే ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇందిరమ్మ కమిటీలు ఇళ్ళ లబ్దిదారులను ఎంపిక చేస్తే అడ్డుకుంటాం. ఇందిరమ్మ కమిటీలకు ఒక విధానం లేదు. గతంలో సిరిసిల్ల, సిద్దిపేటను సుడా చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌ను కుడా చేసుకున్నారు. గ్రామ సభలు పెట్టీ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలి తప్పితే.. ఇందిరమ్మ కమిటీల ద్వారా కాదు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ భాగస్వామ్యం లేదు. ఇందిరమ్మ కమిటీలు చెల్లుబాటు కాదు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
తెలంగాణలో కుల గణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి సారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 6 నుంచి కుల గణన చేపట్టనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొనే అధికారులకు సహకరించాలని మంత్రి పొన్నం సూచించారు. పార్టీ పరంగా కూడా బాధ్యులను వేస్తామని, అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.కుల గణన చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేసినా విమర్శలు చేయడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందని విమర్శించారు. ‘50 శాతం పైబడిన బీసీ వర్గాలకు మేలు జరుగబోతోంది. దీనిని అయిన మెచ్చుకుంటారు అనుకున్నాం. దీపావళికి దావత్ చేసుకుంటే తప్పేంది అంటున్నారు. మీరు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం. చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించాం. వెనుకబడిన కులాల మీద బీఆర్ఎస్కు ప్రేమ లేదు. పార్టీ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మీరే ఉన్నారు. మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. కేిసీఆర్ ఫాం హౌస్ నుంచి ప్రెస్ నోట్ అయిన విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుంది’ అని తెలిపారు. -
నువ్వా! కేసీఆర్ పేరును తుడిచేది?: రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్దం నెలకొంది. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ చేసిన సంచలన వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ చెప్పులు మోసిన నాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడని తెలిపారు. పదవులు కోసం రేవంత్ పరితపిస్తున్న కాలంలో.. కేసీఆర్ తనకు ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడని గుర్తుచేశారు. ‘నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్’ అంటూ ఘాటుగా స్పందించారు.ఈ మేరకు ట్విటర్లో కేటీఆర్.. ‘నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడు. చిట్టినాయుడు. నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్.’ అని పేర్కొన్నారు.నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు! నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు…— KTR (@KTRBRS) October 30, 2024కాగా కేసీఆర్‌కు రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. ‘కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’ అంటూ పేర్కొన్నారు. -
కేటీఆర్ ఖేల్ ఖతం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలం చెల్లిన మందు. ఆయన పని అయిపోయింది. కేసీఆర్ కోసం కేటీఆర్‌ను వాడా. పది నెలల్లో కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేయించా. ఇప్పుడు బావను ఉపయోగించి బావమరిదిని ఫినిష్ చేయిస్తా. ఆ తర్వాత హరీశ్‌రావును ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ ఉనికి లేకుండా చేస్తా...’ అంటూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి అంటే తమకు చిచ్చుబుడ్లు గుర్తుకు వస్తాయని, కానీ వారికి మాత్రం సారాబుడ్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఏమీ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన విచారణల్లో ఎలాంటి కక్ష సాధింపులు ఉండబోవని, దర్యాప్తు సంస్థలు ఇచ్చే నివేదికల ప్రకారమే చర్యలుంటాయని చెప్పారు. ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్‌లో పర్యటించిన మీడియా ప్రతినిధులతో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మాకు నష్టం జరిగినా ప్రజలకు మేలు చేస్తాం ‘సీఎం కావాలన్నది నాకల. ఆ కల నెరవేరింది. కొత్తగా ఏదో కావాలనే కోరిక నాలో లేదు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడమే పని. నేను అనుకున్నది ఇచ్చిన ప్రజలకు మేలు చేయడమే నా ముందున్న లక్ష్యం. మాకు రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతాం. పనితీరులో నా స్టైల్ రాజమౌళిది.. రాంగోపాల్‌వర్మ లాంటిది కాదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోంది. కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయ్యింది. శ్రవణ్‌రావు వాస్తవాలు చెప్పడానికి ముందుకొచ్చాడు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు. ఏమీ చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు? ముందస్తు బెయిల్ ఎందుకు అడి గారు? ఇంటి దావత్లో క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు?..’ అని సీఎం ప్రశ్నించారు. హామీలు నెరవేరుస్తున్నాం.. ‘గత ప్రభుత్వం ఎంత గుడ్డిగా వ్యవహరించిందంటే.. కనీసం అధికారుల సర్వీసు రికార్డులు కూడా లేవు. రెవెన్యూ అధికారుల బదిలీల వ్యవహారంతో ఇది తేటతెల్లమైంది. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఏకంగా రూ.7 లక్షల కోట్ల భారం మోపారు. మేం పది నెలల్లో భూములు అమ్మలేదు, లీజుకు ఇవ్వలేదు. రాబడిలో లీకేజీలను అరికట్టాం. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాం. ఏకకాలంలో రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలలో తొలిరోజే వేతనాలు, పింఛన్లతో ప్రజలకిచ్చిన హామీలను నెర వేరుస్తున్నాం. రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.31 వేల కోట్లు పెట్టి ఇవ్వలేదని అంటున్నారు. అది కేవలం ప్రొవిజన్ కోసమే పెట్టాం తప్ప అదంతా ఇవ్వాలని కాదు. రైతులకు అవసరమైన మేరకు రూ.26 వేల కోట్లు ఖచ్చితంగా ఇస్తాం..’ ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థిక మాంద్యంతో రియల్టీ తగ్గుముఖం ‘హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఆర్థిక మాంద్యం కారణంగా రియల్టీ తగ్గుముఖం పట్టిందనే విషయం బీఆర్ఎస్ నేతలకు తెలియదా? గండిపేటలో అక్రమంగా కట్టిన బలిసినవాళ్ల ఇళ్లే కూలగొట్టాం. పేదల జోలికి వెళ్లడం లేదు. కూకట్‌పల్లిలో చిన్నారిని పరామర్శించిన కేటీఆర్ ఇల్లు కట్టిస్తారని అనుకున్నా. పుస్తకాల బ్యాగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు..’ అని సీఎం విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి – ప్రాజెక్టుపై ముందుకే..వెనక్కి తగ్గేదిలేదు – 18 నెలల్లో మూడు పద్ధతుల్లో డీపీఆర్ రెడీ – మేలైన మోడల్‌ను ఎంచుకుని పనులు ప్రారంభిస్తాం – తొలిదశలో జంట జలాశయాల నుంచి బాపుఘాట్ వరకు ప్రాజెక్టు – బాపూఘాట్ వద్ద అతిపెద్ద గాంధీ విగ్రహం, లండన్ ఐ, పెద్ద టవర్ మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తూ లేనిపోని ప్రచారాలతో ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వం తరహాలో కాకుండా మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వేయిసార్లు ఆలోచిస్తా. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నా. ఇక ముందడుగే. వెనుకడుగు వేసేది లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు సంస్థల కన్సారి్టయంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాం. రివర్ బెడ్ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో, అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్ వస్తుంది. ప్రభుత్వ, పీపీటీ, హైబ్రిడ్.. ఈ మూడు పద్ధతుల్లో వస్తుంది. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్‌ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుడతాం..’ అని సీఎం తెలిపారు. తొలిదశలో 21 కిలోమీటర్లు ‘తొలిదశలో బాపుఘాట్ వరకు మూసీ పునరుజ్జీవం చేపడతాం. జంట జలాశయాల నుంచి బాపుఘాట్ త్రివేణి సంగమం వరకు ఈ పనులు మొదలు పెడతాం. మల్లన్నసాగర్ నుంచి గండిపేట, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు తరలిస్తాం. ఆలోపు వంద శాతం నీటిని శుద్ధి చేస్తాం. అక్కడికి 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవం పూర్తవుతుంది. నవంబర్ తొలివారంలో మల్లన్నసాగర్ నుంచి జంట జలాశయాలకు నీటి తరలింపు ట్రంక్ లైన్ పనులకు టెండర్లను పిలుస్తాం. బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తాం. అతిపెద్ద బాపూ విగ్రహం ఏర్పాటు చేస్తాం. లండన్ ఐ (అతిపెద్ద జెయింట్ వీల్) ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి నగరమంతా వీక్షించేలా సియోల్ టవర్ తరహాలో పెద్ద టవర్ నిర్మిస్తాం. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ..రీ క్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్ చెప్పారు. నైట్‌లైఫ్‌కు వేదికగా హైదరాబాద్ ‘మూసీ సుందరీకరణతో ఆదాయ పరంగా మరో నగరం ఏర్పడుతుంది. రాత్రివేళల్లో మూసీ రివర్ ఫ్రంట్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరం పగలు మాత్రమే మేలుకుంటోంది. మూసీ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నైట్ లైఫ్‌కు వేదిక కానుంది. మూసీ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రజలనే అడుగుదాం రండి ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నా, ప్రతిపక్షాలకు ఏదైనా ఆలోచన ఉన్నా నాకందజేయాలి. ఒకవేళ కేటీఆర్, హరీశ్, ఈటల లాంటి నేతలకు నా దగ్గరకు రావడం మొహమాటం అనిపిస్తే సీఎస్‌ను లేదంటే మంత్రులను కలిసి ఇవ్వొచ్చు. మూసీని నగర జీవనాడిగా మార్చేందుకు కలిసి రండి. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. కేటీఆర్, ఈటల, హరీశ్ కూడా నాతో కలిసి రావాలి. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదాం. రూ.లక్షన్నర కోట్ల ఖర్చు కేవలం మూసీకే కాదు.. విశ్వనగర అభివృద్ధి కోసం. ట్రిపుల్ ఆర్, మెట్రో, గోదావరి జలాల తరలింపు, ఎస్టీపీల నిర్మాణం, రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా!.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు.మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు‘మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’ అంటూ కేటీఆర్ బావమరిది రాజు పాకాల విందుపై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు.. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు?. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు?దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి’’ అంటూ రేవంత్ ప్రశ్నలు గుప్పించారు.మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదు..మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదని.. ఎవరు అడ్డుకున్న మూసి పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతాం. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తాం. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తాం.’’ అని రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!‘‘బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగాము.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తాం. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెఫ్ట్‌తో అభివృద్ధి చేస్తాం. మూసి వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు. -
‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’
సాక్షి, మహబూబ్‌నగర్: హామీలు నెరవేర్చే వరకు సీఎం రేవంత్‌ను వదిలిపెట్టం అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్త పథకాలు అటుంచి పాత పథకాలను మూలకేశాడంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని.. కొర్రీలు పెట్టి రుణమాఫీకి ఎగనామం పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టిన పాలకుడు ఇచ్చిన మాట తప్పితే రాష్ట్రానికే అరిష్టం అంటూ వ్యాఖ్యానించారు.‘‘ఎనముల రేవంత్ కాదు.. ఎగవేతల రేవంత్. ఢిల్లీకి మూటలు పంపేందుకు.. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులిచ్చే సీఎంకు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు నిధులు లేవా? రైతుబంధు ఇవ్వని కాంగ్రెస్‌ను ఉరికించాలి. పత్తి రైతులకు మద్దతు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. డెడ్ లైన్లు మారాయి.. పత్రికల్లో హెడ్ లైన్లు మారాయి.. కాని రైతు రుణమాఫీ మాత్రం ఓ లైన్‌కు రాలేదు’’ అంటూ హరీష్‌రావు చురకలు అంటించారు.‘‘సర్కార్ దవాఖానాల్లో మందులు కూడా లేవు. 29 జీవోతో నిరుపేద నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు. పోలీసు పాలన సాగుతోంది. సీఎంకు పాలన మీద పట్టు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కరెంట్ బిల్లులు పెరగలేదు. వచ్చే అసెంబ్లీలో ప్రభుత్వం మెడలు వంచుతాం. అక్రమ కేసులు పెడుతూ.. కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. వారి పేర్లు డైరీల్లో రాసిపెడుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’’ అంటూ హరీష్‌రావు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి! -
ఫ్రస్టేషన్లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై ఫ్రస్టేషన్,డేస్పరేషన్‌లో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ మాపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయి. మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకి ధన్యవాదాలు. ప్రభుత్వం చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, కుతంత్రాలను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం.కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బీఆర్ఎస్ను టార్గెట్ చేయబోతున్నాయి. ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆగం కావొద్దు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం.తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న మన పోరాటం పైనే దృష్టి సారిద్దాం. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై వారిపైన ఒత్తిడి తెద్దాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. Failed Congress Govt and its CM in Telangana is desperate & frustrated with BRS thoroughly exposing their failures, corruption Thank you to all the BRS leaders & SM warriors for your efforts and support What we saw last two days was just the beginning of a long drawn battle…— KTR (@KTRBRS) October 29, 2024 -
పొంగులేటి బాంబుల కామెంట్స్.. జగదీష్‌రెడ్డి కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబుల కామెంట్స్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మంగళవారం(అక్టోబర్ 29) మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ బాంబులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ దోపిడీ బాంబులను అడ్డుకుంటాం. మా హాయాంలో తప్పు జరిగితే విచారణ జరుపుకోవచ్చు.కాంగ్రెస్ నేతల చిల్లర బెదిరింపులకు భయపడేది లేదు. మంత్రులు చిల్లర మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. పాలన చేతకాకనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ప్రజాస్వామికవాదిగా చెప్పుకునే పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నారు? పెద్దమనిషి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులే రోడ్డు ఎక్కటం చరిత్రలో ఇది మెదటిసారి.సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించటం అన్యాయం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆంధ్రకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.పండుగల సమయంలో 144సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. లోఓల్టేజీ కరెంట్‌తో ఇళ్ళల్లో వస్తువులు కాలిపోతున్నాయి. కమీషన్ రాదన్న కారణంగానే విద్యుత్ శాఖను ప్రభుత్వం గాలికొదిలేసింది. కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ ఆదాయం తగ్గలేదు.ఇప్పుడెందుకు తగ్గింది? పేదలకు చెందాల్సిన ఆదాయం మంత్రులు,కాంగ్రెస్ నేతలు తింటున్నారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకు కూడా 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు,రైతాంగానికి అర్థమైంది. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. పత్తిని కొనుగోలు చేయాలి.నాణ్యత లేని గుజరాత్ పత్తికి ఎక్కువ ధర ఇస్తున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి: సమస్యలు కొనితెచ్చుకుంటున్న తెలంగాణ సీఎం -
‘జన్వాడ ఫామ్‌హౌజ్’ అంటేనే వివాదం: ఎంపీ అనిల్ యాదవ్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అనిల్ యాదవ్ మంగళవారం(అక్టోబర్ 29) మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి బీఆర్ఎస్ వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి.రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి.కేటీఆర్‌కు అసలు బినామీ విజయ్ మద్దూరి.గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు.జన్వాడ ఫామ్‌హౌస్ అంటేనే కాంట్రవర్సీ. ఒక సారి దీపావళి విందని,మరోసారి గృహ ప్రవేశం అని అంటున్నారు.తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏం చేయాలనుకుంటోంది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడు.రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు విజయ్మద్దూరి మాట మారుస్తున్నాడు.పామ్ హౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు.ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది.కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని అని ప్రజలు అడుగుతున్నారు’అని అనిల్ యాదవ్ గుర్తుచేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో: కేటీఆర్ -
కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం(అక్టోబర్ 29) రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసుకుగాను కేటీఆర్‌కు కౌంటర్ నోటీసు పంపించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని బండిసంజయ్ తన రిప్లైలో స్పష్టం చేశారు.రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లీగల్ నోటీసు అంటూ బెదిరిస్తే భయపడేది లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ను కోరారు. కేటీఆర్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, ఇటీవల బండి సంజయ్ గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి ఆందోళనల్లో పాల్గొని అరెస్టయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బండి సంజయ్‌ని చర్చలకు పిలిచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ చదువులేని బండిసంజయ్ని గ్రూప్‌వన్‌పై చర్చలకు పిలిస్తే ఏం లాభం అని విమర్శించారు. రేవంత్, బండి సంజయ్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.దీనికి ఆగ్రహించిన బండి సంజయ్ కేటీఆర్‌పై వ్యక్తిగతంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకుగాను బండిసంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో -
కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా మంగళవారం(అక్టోబర్ 29) కేటీఆర్ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తోంది. కాంగ్రెస్,బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడులపై బీజేపీ,కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా లేదు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదు.దాడులు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారు. ఇది బీజేపీ,కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రో కో కాక మరేంటి?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీడీఎంఏగా శ్రీదేవి..హరీశ్‌కు ఐఅండ్‌పీఆర్ -
హైడ్రా బాధితురాలు బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోి హైడ్రా కూల్చివేతల బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. నగరంలోని హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలోనే బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించామని, ఇచ్చిన మాట ప్రకారం అండగా ఉంటామని తెలిపారు. బుచ్చమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు‘సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుముల నివాసం కూడా ఎఫ్టీఆఎల్ పరిధిలో ఉంది. ఆయనకు హైడ్రా నోటీసులు ఇస్తే.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. పేదలకు మాత్రం ఎలాంటి నోటీసులు, కోర్టు స్టేలు ఉండవు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు. హత్య. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, హైడ్రా అరాచకం పేరుతో జరిగిన హత్య. ప్రభుత్వం కనీసం సానుభూతి ప్రకటించలేదు.దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల పేదలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం. వాళ్ల కూతురికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఆమెకు పార్టీ తరపున మేము ఆపరేషన్ చేపిస్తాం, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తలసాని నేడు కొంత ఆర్థిక సాయం చేశారు.’ అని తెలిపారు. -
డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో పనిచేయవు.. కాంగ్రెస్‌పై హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారని ఆరోపించారు మాజీమంత్రి హారీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తోందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైంది?. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందర్నీ మోసం చేశారు. కనీసం 20వేల ఉద్యోగాలకు అయినా నోటిఫికేషన్ ఇచ్చారా?. కాంగ్రెస్ పాలన పట్ల ఏ వర్గం ఆనందంగా లేదు. రేవంత్ రెడ్డి విద్యార్థులను కూడా మోసం చేశారు. ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజురియింబర్స్‌మెంట్ ఇవ్వలేదు.రాష్ట్రంలో రైతులు తక్కువ ధరకు పంట అమ్ముకుంటున్నారు. బోనస్ కాదు కదా మద్దతు ధర కూడా దక్కడం లేదు. పత్తి, మొక్కజొన్న రైతులు కూడా నష్టపోతున్నారు. 317 జీవో పరిష్కరించలేదు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు తెలంగాణలో పనిచేయవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఫాంహౌజ్ పార్టీ: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్: పార్టీలు,పండగల దావత్‌లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్‌పాకాల జన్వాడ ఫాంహౌజ్ ఘటన మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.‘ఎవరైనా ఫంక్షన్లకు దావత్‌లు చేసుకోవచ్చు.కానీ దానికి కొన్ని నియమాలున్నాయి. ఎక్కువమందితో మందు పార్టీలు చేస్తే ఎక్సైజ్ ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎవరైనా దావత్ చేసుకోవచ్చు.ప్రజల్లో అపోహలు కలిగించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు.కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో సోదాలకు సీఎం మంత్రులకు ఏం సంబంధం.ఫిర్యాదులు వస్తే అధికారులు వారి పని వారు చేస్తారు.దీన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోడం సిగ్గుచేటు’అని పొన్నం మండిపడ్డారు. ఇదీ చదవండి: రేవ్‌పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్ -
రియల్ బూమ్ కాదు రియల్ బాంబు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సొంతింటి కలలు కలగానే మిగిలిపోయాయని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 28) ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.‘నీ మూసి ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులా మారింది. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్నా ఉన్నవి అమ్మాలన్నా దిక్కు లేకుండా పోయింది.కాసులపై నీ కక్కుర్తి నిర్ణయాలు తెలంగాణను అధోగతిపాలు చేస్తున్నాయి. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు విలవిలలాడుతున్నాయి. పదినెలల కాంగ్రెస్ పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే’అని కేటీఆర్ ట్వీట్లో దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఉపాధ్యాయులూ మేల్కొనండి సంపద పెంచే ఆలోచనలు మావి - ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవిమేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేడితిరినీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న - పాతవి అమ్మాలన్న భయమేనీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయేనీ మూసి ముష్ఠి… pic.twitter.com/W2bhQMBFSy— KTR (@KTRBRS) October 28, 2024 -
జన్వాడపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీ: కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీపడుతున్నట్లు జన్వాడ రేవ్ పార్టీ విషయంలో మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడు తూ ట్విట్టర్ టిల్లు బామ్మర్ది ఫామ్ హౌజ్‌లో రేవ్‌పార్టీ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందని, ఆ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కాంగ్రెస్ నుంచి ఒత్తిడి కొనసాగుతోందని, లిక్కర్ పార్టీయే తప్ప రేవ్‌పార్టీ కాదని బుకా యించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్ పార్టీపై సుద్దపూస ఏమంటాడో వేచి చూస్తున్నట్లు తెలిపారు.రేవ్‌పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారని, విదేశీ మద్యం బాటిళ్ల పేర్లను మాత్రమే ప్రస్తావించినట్లు తెలిసిందని అన్నారు. ట్విట్టర్ టిల్లు, ఆయన కుటుంబ సభ్యులను తప్పించి, ఈ కేసులో అనామకుల పేర్లను చేర్చుతున్నారని, తద్వారా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి బహుమతి ఇస్తోందని పేర్కొన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీధోరణి ప్రదర్శిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. సీసీ ఫుటేజీ సహా ఇతర ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, బడా నేతలతోసహా రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జన్వాడ పార్టీ వివరాలు బయటపెట్టాలిగజ్వేల్: జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్‌పార్టీ వివరాలన్నీ బయట పెట్టాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. -
సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సహాయమంత్రి: ఎమ్మెల్యే వివేకానంద
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిలా తయారయ్యాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత వివేకానంద ఎద్దేవా చేశారు. తాజాగా రేవంత్, బండిసంజయ్ బంధం మరోసారి బయటపడిందన్నారు. అనుమతి లేకుండా పోలీసులు కేటీఆర్ బావమరిదికి చెందిన జన్వాడ ఫాంహౌజ్‌లో సోదా చేయడంపై వివేకానంద ఆదివారం(అక్టోబర్ 27) స్పందించారు.‘రాజ్ పాకాల పార్టీలో కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. రాజ్‌పాకాల ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీ చేసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి వెళ్లారు. అక్కడ జరిగింది ప్రైవేట్ పార్టీ. లిక్కర్ ఎవరి ఇంట్లో ఉండదు. సీఎం, మంత్రుల ఇళ్లలో ఉండదా? తెలంగాణలో సంప్రదాయం ప్రతి ఇంట్లో లిక్కర్ ఉంటుంది. రేవంత్ చేతిలో అధికారులు కీలు బొమ్మలయ్యారు. ఇప్పుడు ఓవర్‌యాక్షన్ చేస్తున్న అధికారులు రిటైర్ అయినా సరే మేం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం’అని వివేకానంద హెచ్చరించారు. ఇదీ చదవండి: కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌజ్‌లో రేవ్‌పార్టీ భగ్నం