సీఎం రేవంత్‌కు బండి సంజయ్‌ సహాయమంత్రి: ఎమ్మెల్యే వివేకానంద | Kutbullapur Mla Vivekananda Comments On Cm Revanth Bandi Sanjay | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు బండి సంజయ్‌ సహాయమంత్రి: ఎమ్మెల్యే వివేకానంద

Oct 27 2024 3:08 PM | Updated on Oct 27 2024 4:57 PM

Kutbullapur Mla Vivekananda Comments On Cm Revanth Bandi Sanjay

సాక్షి,హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డికి  బండి సంజయ్‌ సహాయమంత్రిలా తయారయ్యాడని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత వివేకానంద ఎద్దేవా చేశారు. తాజాగా రేవంత్‌, బండిసంజయ్‌ బంధం మరోసారి బయటపడిందన్నారు. అనుమతి లేకుండా పోలీసులు కేటీఆర్‌ బావమరిదికి చెందిన జన్వాడ ఫాంహౌజ్‌లో  సోదా చేయడంపై వివేకానంద ఆదివారం(అక్టోబర్‌ 27) స్పందించారు.

‘రాజ్‌ పాకాల పార్టీలో కేటీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. రాజ్‌పాకాల ఇంట్లో గెట్‌ టు గెదర్‌ పార్టీ చేసుకున్నారు. పోలీసులు సెర్చ్‌ వారంట్‌ లేకుండా ఇంట్లోకి వెళ్లారు. అక్కడ జరిగింది ప్రైవేట్‌ పార్టీ. లిక్కర్‌ ఎవరి ఇంట్లో ఉండదు. సీఎం, మంత్రుల ఇళ్లలో ఉండదా? 

తెలంగాణలో సంప్రదాయం ప్రతి ఇంట్లో లిక్కర్‌ ఉంటుంది. రేవంత్‌ చేతిలో అధికారులు కీలు బొమ్మలయ్యారు. ఇప్పుడు ఓవర్‌యాక్షన్‌ చేస్తున్న అధికారులు రిటైర్‌ అయినా సరే మేం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం’అని వివేకానంద హెచ్చరించారు. 

ఇదీ చదవండి: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌజ్‌లో రేవ్‌పార్టీ భగ్నం

Advertisement
 
Advertisement
Advertisement