వరంగల్ జిల్లా సుబేదారి మహిళ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ జమున ఆత్మహత్యకు యత్నించారు.
మహిళా హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
Apr 20 2017 4:10 PM | Updated on Sep 5 2017 9:16 AM
వరంగల్ అర్బన్ : వరంగల్ జిల్లా సుబేదారి మహిళ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ జమున ఆత్మహత్యకు యత్నించారు. గురువారం ఉదయం ఆమె ఇంట్లోనే చేతి మణికట్టు కోసుకున్నారు. తీవ్ర రక్తస్రావం కావటంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి యత్నించి ఉంటుందని తోటి సిబ్బంది అంటున్నారు.
Advertisement
Advertisement