వివాహేతర సంబంధంపై ఆగ్రహం | wife kills her husbands lover | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంపై ఆగ్రహం

Aug 25 2017 11:54 AM | Updated on Jul 27 2018 2:21 PM

వివాహేతర  సంబంధంపై ఆగ్రహం - Sakshi

వివాహేతర సంబంధంపై ఆగ్రహం

తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో ఓ మహిళ మరో మహిళను దారుణంగా హత్య చేసింది.

► భర్త ప్రియురాలిని అంతమొందించిన భార్య
► ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్యభర్తల ప్రయత్నం
► పోలీసు కస్టడీలో నిందితులు
 
కర్ణాటక: తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో ఓ మహిళ మరో మహిళను దారుణంగా హత్య చేసిన  ఘటన నగరంలో కలకలం సృష్టించింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి బళ్లారి నగరంలోని బ్రూస్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో కొలిమి చౌక్‌ ప్రాంతంలోని సోమాద్రి వీధిలో నివాసం ఉంటున్న ఉమాదేవి(35)ని అదే కాలనీలో నివాసం ఉంటున్న చాముండేశ్వరీ ఇంటికి పిలిపించుకుని తన భర్త వెంకటేశ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు గొడవ పడింది.

ఇది తీవ్రం కావడంతో ఇద్దరూ పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చాముండేశ్వరీ ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో ఉమాదేవి గొంతుపై పొడిచింది. దీంతో ఉమాదేవి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటన జరిగిన సమయంలో చాముండేశ్వరీ భర్త ఇంట్లో లేడు. ఆ తర్వాత వచ్చిన అతను సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.  కేసు దర్యాప్తు చేపట్టిన బ్రూస్‌పేట పోలీసులు భార్యభర్తలిద్దరినీ అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇది ఇలా ఉండగా మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement