గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం | Two deadbodies found after three drowned in water flow | Sakshi
Sakshi News home page

గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Aug 28 2016 8:29 AM | Updated on Sep 4 2017 11:19 AM

వాగులో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి.

ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ శివారులోని వాగులో శనివారం రాత్రి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం చినకోండ్రపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కూలిపనికి వెళ్లి వస్తూ వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహం ఉధృతమై ముగ్గురూ గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement