గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో ఓ రైతు బలవన్మరణం చెందాడు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో ఓ రైతు బలవన్మరణం చెందాడు. గ్రామానికి చెందిన కోటిరెడ్డి(42) మంగళవారం సాయంత్రం పొలానికని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు వెళ్లిచూడగా పొలంలో పురుగు మందుతాగి చనిపోయి ఉన్నాడు. అప్పులు తీర్చలేని మనోవేదనతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు.