కేసీఆర్‌ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు | Tammineni Veerabhadram comments on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు

Jan 16 2017 2:44 AM | Updated on Aug 14 2018 11:02 AM

కేసీఆర్‌ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు - Sakshi

కేసీఆర్‌ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు

తెలంగాణ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ కేవలం తన ఇంట్లో నలుగురికే ఉపాధి

సీపీఎం కార్యదర్శి తమ్మినేని

మహబూబాబాద్‌ రూరల్‌: తెలంగాణ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ కేవలం తన ఇంట్లో నలుగురికే ఉపాధి కల్పించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మహబూ బాబాద్‌ జిల్లాలోని జమాండ్లపల్లి, నడి వాడ, కంబాలపల్లిల్లో ఆదివారం కొనసా గింది.

వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్‌ తెలంగాణలో కార్పొరేట్‌ శక్తులకు ఇస్తున్న గుర్తింపు సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం ఉన్న అన్నివర్గాల ప్రజలకు బడ్జెట్‌లో స మాన వాటా కల్పించాలన్నారు. కేంద్రం లోని మోదీ మతోన్మాద ప్రభుత్వంతో కేసీఆర్‌ కుమ్మక్కు అవుతున్నారన్నారు. గిరి జనులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement