తాప్సీకి కోపమొచ్చింది | taapsee pannu Anger on Journalist | Sakshi
Sakshi News home page

తాప్సీకి కోపమొచ్చింది

May 11 2015 2:50 AM | Updated on Sep 3 2017 1:48 AM

తాప్సీకి కోపమొచ్చింది

తాప్సీకి కోపమొచ్చింది

ఎప్పుడు నవ్వుతూ జాలీగా ఉండే నటి తాప్సీ. అలాంటి ఈ బ్యూటీ ఇటీవల చాలా ఆవేశానికి గురయ్యారు.

 ఎప్పుడు నవ్వుతూ జాలీగా ఉండే నటి తాప్సీ. అలాంటి ఈ బ్యూటీ ఇటీవల చాలా ఆవేశానికి గురయ్యారు. కారణం ఏమిటంటారనేగా మీ ప్రశ్న. నిజం చెప్పాలంటే విజయం అనే దప్పికతో చాలాకాలంగా కొట్టుమిట్టాడుతున్న నటి తాప్సీ. ఈ బహుభాషా నటికి చాలా కాలం తరువాత కాంచన-2 చిత్రం తన విజయ దాహార్తిని తీర్చింది. దీంతో పుల్‌జోష్‌లో కొచ్చేశారు. అంతేకాదు తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించే అవకాశాల్ని రాబట్టుకున్నారు. ప్రస్తుతం జయ్ సరసన కొత్త చిత్రంలో నటిస్తూ బిజీగా వున్న తాప్సీ ఇటీవల సినీ కార్యక్రమాల్లో చాలా ఉషారుగా పాల్గొంటున్నారు. అలాంటి సమయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న ఆమెను ఆగ్రహానికి గురి చేసింది.
 
 అది ఏమై ఉంటుందనేగా మీ ఆసక్తి. ఆ మధ్య జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఫుట్‌బాల్ క్రీడలో వెండి పతకాన్ని గెలుచుకున్న మ్యాథ్యూస్‌పో తో మీ ప్రేమాయణం ఎంత వరకు వచ్చిందన్న ప్రశ్నకు తాప్సీకి ఎక్కడలేని కోపం వచ్చేసిందట. దీంతో తన ప్రేమ గురించి చెప్పుకోవలసిన వారెవరైనా ఉంటే అది తన తల్లిదండ్రులేనన్నారు. వే రెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. కొన్ని నిజాలు ఇలా నిప్పులనే రగిలిస్తాయని పెద్దలంటుంటారు. అది ఇదేనేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement