కేఎస్ దర్శకత్వంలో సుదీప్ | Sudeep's next is a thriller with KSR | Sakshi
Sakshi News home page

కేఎస్ దర్శకత్వంలో సుదీప్

Nov 23 2014 2:25 AM | Updated on Sep 28 2018 4:53 PM

కేఎస్ దర్శకత్వంలో సుదీప్ - Sakshi

కేఎస్ దర్శకత్వంలో సుదీప్

కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ హీరోగా నటించనున్న తమిళ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్నారు.

కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ హీరోగా నటించనున్న తమిళ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఈ చిత్రం ఇంతకుముందే ప్రారంభం కావలసింది. కేఎస్ రవికుమార్ ఈ చిత్ర కాల్‌షీట్స్‌ను రజనికాంత్ లింగ చిత్రానికివాడుకోవడంతో సుదీప్ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. లింగ చిత్రా న్ని వేగంగా పూర్తి చేయాలని భావించిన రజనీకాంత్ అందుకు సమర్థుడైన దర్శకుడు కేఎస్ రవికుమార్  అని భావించి ఆయనతో చర్చించి సుదీప్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా సుదీప్ తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో రజనీకాంత్ చిత్రం లింగ ప్రస్తుతం పూర్తి అయ్యింది. దీంతో సుదీప్, కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. దీని గురించి సుదీప్ తెలుపుతూ రజనీకాంత్ అభిమానుల్లో తాను ఒకరినని ఆయన త్వరగా చిత్రం చేయాలని తాను ఆశిస్తున్నానన్నారు.
 
 అందువలనే రజనీకాంతే స్వయంగా ఫోన్ చేసి కేఎస్ రవికుమార్‌కు ఇచ్చిన కాల్‌షీట్స్ అడగడంతో మరుమాట లేకుండా ముందు అలాగే అన్నానని చెప్పారు. ఇక  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తాను నటించనున్న చిత్రం గురించి ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అయితే ఇదో థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఏడాది క్రితమే రవికుమార్ ఈ కథతో తనను కలిశారని తానైతే ఈ కథలో హీరో పాత్రకు బాగుంటానని ఆయన భావించారన్నారు. నాన్ ఈ చిత్రంలో తమిళ ప్రేక్షకులకు కాస్త దగ్గరయ్యానని ఈ చిత్రంతో వారి ప్రేమాభిమానాన్ని మరింతగా పొందుతాననే నమ్మకం ఉందన్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వ నైపుణ్యం గురించి బాగా తెలుసని ఆయన దర్శకత్వంలో నటించడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని సుదీప్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement