త్వరలో విద్యుత్ భారం!? | Soon the electric load !? | Sakshi
Sakshi News home page

త్వరలో విద్యుత్ భారం!?

Oct 26 2014 11:18 PM | Updated on Sep 5 2018 3:44 PM

త్వరలో విద్యుత్ భారం!? - Sakshi

త్వరలో విద్యుత్ భారం!?

బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై విద్యుత్ చార్జీలు మోపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

16 శాతం చార్జీల పెంపునకు బెస్ట్ యోచన
అనుమతి కోసం ఎదురుచూపు    

 
ముంబై: బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై విద్యుత్ చార్జీలు మోపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకు అవసరమైన ప్రతిపాదన రూపొందించి అనుమతి కోసం మహారాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు పంపింది. అందులో 14 నుంచి16 శాతం వరకు విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని కోరింది. ఒకవేళ కమిషన్ నుంచి అనుమతి లభిస్తే ముంబై సహా పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లోని బెస్ట్ విద్యుత్ వినియోగదారులందరిపై విద్యుత్  భారం పడడం ఖాయం. ఆర్థిక ఇబ్బందులో చిక్కుకున్న బెస్ట్ సంస్థ గత యేడాదే 15 శాతం విద్యుత్ చార్జీలు పెంచింది. దీని వల్ల బెస్ట్ సంస్థకు రూ.125 కోట్లు లాభం చేకూరింది. కాని నష్టాల బాటలో నడుస్తున్న రవాణా శాఖను లాభాల బాటలో నడిపించలేకపోతోంది. ఇప్పటికే విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలవల్ల ముంబైకర్లు బేజారవుతున్నారు.

ఒకప్పుడు యూనిట్‌కు సరాసరి రూపాయి ఉండగా ప్రస్తుతం అదే యూనిట్‌కు నాలుగైదు రూపాయల చొప్పున బిల్లులు వేస్తున్నారు. బెస్ట్ ప్రధాన కార్యాలయాలకు వెళ్లి విచారించగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలుచేసి సరఫరా చేస్తున్నామని, అందుకే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు సమాధానమిస్తున్నారు. అదనంగా 14-16 శాతం చార్జీలు పెరిగితే బిల్లులు చెల్లించలేని దుస్థితి ఎదురుకావడం ఖాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement