రాష్ట్రానికి అప్పులు.. కేసీఆర్‌కు ఆస్తులు
అప్పులు చేయడమే గొప్ప విషయం అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకుంటున్నారు.
హైదరాబాద్: అప్పులు చేయడమే గొప్ప విషయం అన్నట్లు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్‌లు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అరవై వేల కోట్లు, ఆరు లక్షల కోట్లు అంటూ కేసీఆర్ తలతిక్క వాదనలు చేస్తున్నారు. అభివృద్ధిలో మహారాష్ట్రతో పోలిక పెడుతున్న కేటీఆర్‌కు అక్కడి జనాభా 11 కోట్ల అన్న సంగతి గుర్తులేదా.. రాష్ట్రానికి అప్పులు, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరుగుతున్నాయి.
రెండేళ్లలో అత్యంత ధనికులగా కేసీఆర్ ఎలా మారారో చెప్పాలి. కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు 100 ఏళ్ల జైలు శిక్ష, వెయ్యి కొరడా దెబ్బలు పడతాయి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఆధారాలు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని’’ అన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వ నిజస్వరూపం తేలిపోయిందని.. కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నించారు.