తలకోన అడవుల్లో అటవీ అధికారులు మంగళవారం వేకువజామున ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు.
రూ.35 లక్షల ఎర్రచందనం స్వాధీనం
Nov 1 2016 2:07 PM | Updated on Oct 22 2018 1:59 PM
- నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
బాకరాపేట: చిత్తూరు జిల్లా బాకరాపేట సమీపంలోని తలకోన అడవుల్లో అటవీ అధికారులు మంగళవారం వేకువజామున ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. లారీని పట్టుకుని నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అటవీ అధికారులు పట్టుకున్న 45 ఎర్రచందనం దుంగల విలువ రూ.35 లక్షలు ఉంటుందని మదనపల్లె పారెస్ట్ డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నామని ఆయన చెప్పారు. లారీని బాకరాపేట అటవీ కార్యాలయానికి తరలించారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement