ప్రజాసేవే లక్ష్యం | Medical student achieved six gold medals at the Visva-Bharati frame of mind | Sakshi
Sakshi News home page

ప్రజాసేవే లక్ష్యం

Mar 17 2016 2:38 AM | Updated on Sep 3 2017 7:54 PM

రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆరు బంగారు పతకాలు గెలుచుకున్న వైద్య విద్యార్థి విశ్వభారతి తెలిపారు.

ఆరు బంగారు పతకాలు సాధించిన వైద్య విద్యార్థి విశ్వభారతి  మనోగతం
 
బెంగళూరు: రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని  ఆరు బంగారు పతకాలు గెలుచుకున్న వైద్య విద్యార్థి విశ్వభారతి తెలిపారు. విభిన్న విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వైద్య విద్యార్థిని విశ్వభారతి బెంగళూరు మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆరు బంగారు పతకాలను అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు.  మూలతహా కారవార ప్రాంతానికి చెందిన విశ్వభారతి బెంగళూరులోనే నివసిస్తున్నారు.

బెంగళూరు మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం బుధవారమిక్కడి కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విశ్వభారతి ఆరు బంగారు పతకాలను అందుకున్నారు. విశ్వభారతి మాట్లాడుతూ....‘నిమ్హాన్స్‌లో న్యూరో సర్జన్ విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలనేది నా లక్ష్యం. విదేశాలకు వెళ్లాలన్న ఆశ నాకు ఎంతమాత్రం లేదు. ఇక్కడే ఉండి కర్ణాటకలోని మారుమూల ప్రాంతాలకు చెందిన పేదలకు వైద్య సేవలు అందించడానికే నేను ప్రాధాన్యత ఇస్తాను’ అని విశ్వభారతి తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ  పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement