లైంగిక దాడి కేసులో దోషికి ఏడేళ్ల కారాగారం | Man gets seven year jail for raping infant | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో దోషికి ఏడేళ్ల కారాగారం

Jan 2 2015 12:21 AM | Updated on Jul 23 2018 9:13 PM

రెండున్నర ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిన్నారులు ‘జాతీయ సంపద’గా పేర్కొంటూ

న్యూఢిల్లీ : రెండున్నర ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిన్నారులు ‘జాతీయ సంపద’గా పేర్కొంటూ ఈ మేరకు శిక్ష విధించినట్లు అదనపు జడ్జి ఇల్లా రావత్ తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నేపాల్‌కు చెందిన రాంసింగ్‌ఏడేళ్ల కారాగార శిక్షతోపాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ‘చిన్నారుల సంక్షేమం, సంరక్షణ ప్రతి నాగరిక సమాజం లక్షణం, అదే దేశ సంపదకు గీటురాయి , మొత్తం సమాజం క్షేమం, అదే అభివృద్ధి పెరుగుదలను సూచిస్తుంది’ అని జడ్జి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాధిత చిన్నారికి రూ. లక్ష నష్టపరిహారాన్ని అందజేయాలని ఢిల్లీ సామాజిక న్యాయ సేవా సంస్థను ఆయన ఆదేశించారు. జనవరి 2013న నిందితుడు బాలికపై అత్యంత పాశవికంగా తల్లిఎదుటనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి కోర్టు నివేదించారు.నేరం రుజువుకావడంతో దోషికి కోర్టు పై శిక్ష విధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement