ప్రేమ పేరుతో అత్యాచారం... | Man arrested for raping girl in karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో అత్యాచారం...

Feb 2 2016 3:13 PM | Updated on Aug 20 2018 4:27 PM

ప్రేమ పేరుతో అత్యాచారం... - Sakshi

ప్రేమ పేరుతో అత్యాచారం...

ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేసి అటుపై సదరు యువతిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని మైసూరు పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

మైసూరు: ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేసి అటుపై సదరు యువతిని విక్రయించడానికి  ప్రయత్నిస్తున్న వ్యక్తిని మైసూరు పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... రాజస్థాన్‌కు  చెందిన నిందితుడు రవి వృత్తి పరంగా లారీడ్రైవర్. రాజస్థాన్, హరియానా నంచి తరచూ సరుకులు లోడ్ చేసుకొని మైసూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలో మైసూరు-బెంగళూరు రోడ్డులో ఉన్న టీకొట్టులో టీ తాగడానికి వస్తూ కొట్టు యజమాని కూతురుతో పరిచయం పెంచుకున్నాడు. తనని ప్రేమిస్తున్నాని,పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు.
 
 అమ్మాయి ఇంట్లో తనని రఫీ అని మారుపేరుతో పరిచయం చేసుకున్నాడు. గతవారం హరియానా నుంచి మైసూరు నంజనగూడుకు లోడుతో వచ్చి అక్కడికి టీ తాగడానికి దిగాడు. అక్కడే నాలుగురోజుల పాటు ఉన్న అతడు   సదరు యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తనతో పాటు రాజస్థాన్ రావాలని కోరాడు. దీంతో అమయాకంగా అతని మాటలు నమ్మిన యువతి అతడి వెంట వెళ్లిపోయింది. ఇదే ఆసరాగా చేసుకున్న రవి ఆమెపై అత్యాచారం చేశాడు.
 
 ఇదిలా ఉంటే తన కుమార్తె కనిపించలేదని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారీ డ్రైవర్‌పై అనుమానం ఉందని అతని ఫోన్ నెంబర్ ఇచ్చారు. దీని ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు యువతి హరియానాలో ఉన్నట్లు గుర్తించి అక్కడి వెళ్లడానికి సమాయాత్తమయ్యారు. విషయం తెలుసుకున్న నిందితుడు యువతిని బెంగళూరుకు తీసుకువచ్చి విక్రయించడానికి ఏర్పాట్లు చేశాడు. అతని సెల్‌ఫోన్‌పై నిఘా ఉంచిన పోలీసులు నిందితుడు బెంగళూరుకు వచ్చినట్లు గుర్తించి నిఘా వేసి అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement