'అట్టహాసాలు ఆపి రైతులను పట్టించుకోండి' | komatireddy venkat reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

'అట్టహాసాలు ఆపి రైతులను పట్టించుకోండి'

Apr 22 2017 2:01 PM | Updated on Oct 1 2018 2:09 PM

అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిన తర్వాత ముఖ్యమంత్రికి రైతులు గుర్తుకురావడం సంతోషకరం..

హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిన తర్వాత ముఖ్యమంత్రికి రైతులు గుర్తుకురావడం సంతోషకరం.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి తాను రైతుల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లినా ఏనాడు స్పందించని కేసీఆర్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయని రైతు జపం చేస్తూ.. ఎరువుల కోసం డబ్బులు ఇస్తానంటున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
 
ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం రైతులను అసలే పట్టించుకోలేదు. మిర్చి, పత్తి, ధాన్యం రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌ పేరిట ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. ముఖ్యమంత్రి ఏది చేసినా అందులో తన స్వార్థం మాత్రమే ఉంటుంది. సీఎం ఇప్పటికైనా అట్టహాసాలు ఆపండి రైతుల గురించి ఆలోచించకుండా.. బిర్యానిలతో సభలు అవసరమా అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement