కరాటే మాస్టర్‌ కుమార్తె బ్రెయిన్‌డెడ్‌.. | Karate Master Daughter Brain Dead Organs Donated In Tamil Nadu | Sakshi
Sakshi News home page

చనిపోతూ ఐదుగురికి పునర్జన్మ!

Jun 12 2018 8:51 AM | Updated on Jun 12 2018 8:51 AM

Karate Master Daughter Brain Dead Organs Donated In Tamil Nadu - Sakshi

బ్రెయిన్‌డెడ్‌ అయిన రథి (ఫైల్‌)

అన్నానగర్‌: తిరుచ్చికి చెందిన కరాటే మాస్టర్‌ కుమార్తె బెంగళూర్‌లో జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన ఆమె ఆవయవాలను కుటుం బీకులు దానం చేశారు. దీంతో ఐదుగురికి పునర్జన్మ లభించింది. తిరుచ్చికి చెందిన ప్రసిద్ధ కరాటే మాస్టర్‌ వాసుదేవన్‌. తిరుచ్చి పాఠశాల, కళాశాలలో, పోలీసు శిక్షణ కళాశాలలో కరాటే నేర్పిస్తున్నారు. ఈయన కుమారులు వెంకట్, ముత్తుకుమార్, కుమార్తె రథి(38). ఈమెకి వివాహం జరిగి బెంగళూర్‌లో భర్త ఆనందపిళ్ళై, పిల్లలతో నివసిస్తున్నారు.

రెండు రోజుల కిందట బెంగళూర్‌లో రథి స్కూటిలో వెళుతూ ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంట నే ఆమెని అక్కడున్న ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. కానీ ఆదివారం ర«థి బ్రెయిన్‌డెడ్‌ చెందింది. దీంతో అవయవదానం చెయ్యడానికి కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆమె గుండె, రెండు మూత్రపిండాలు, కళ్లు, కాలేయాన్ని డాక్టర్ల బృందం సహాయంతో తీసి దానంగా ఆయా ఆస్పత్రులకు ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement