23న సీఎంగా అమ్మ ప్రమాణం | Jayalalithaa elected AIADMK Legislature party leader | Sakshi
Sakshi News home page

23న సీఎంగా అమ్మ ప్రమాణం

May 20 2016 6:48 PM | Updated on May 24 2018 12:08 PM

23న సీఎంగా అమ్మ ప్రమాణం - Sakshi

23న సీఎంగా అమ్మ ప్రమాణం

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 23న ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 23న ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

అన్నాడీఎంకే శాసనసభ పక్షం నాయకురాలిగా జయలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమై జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్నాడీఎంకే నాయకులు గవర్నర్ రోశయ్యను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే విజయం సాధించిన సంగతి తెలిసిందే. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలవడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ ప్రతిసారీ అధికార మార్పిడి జరుగుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం జయలలిత రికార్డు సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement