పారిపోను.. మడమ తిప్పను: పవన్ | i never escapes from problems: pawan kalyan | Sakshi
Sakshi News home page

పారిపోను.. మడమ తిప్పను: పవన్

Nov 10 2016 4:20 PM | Updated on Mar 23 2019 9:10 PM

పారిపోను.. మడమ తిప్పను: పవన్ - Sakshi

పారిపోను.. మడమ తిప్పను: పవన్

సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే తప్ప పారిపోయే వ్యక్తిని కాదని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎందాకైనా పోరాడతామని, మడమ తిప్పబోనని చెప్పారు.

అనంతపురం: సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే తప్ప పారిపోయే వ్యక్తిని కాదని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎందాకైనా పోరాడతానని, మడమ తిప్పబోనని చెప్పారు. గురువారం సాయంత్రం అనంతపురంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన
సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ మాట్లాడారు. అంతకంటే ముందు వీర జవానులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కాకినాడ సభ తర్వాత అనంతపురం రెండు వారాల కిందటే రావాల్సి ఉందని, సరిహద్దులో భారత జవాన్లు వీర మరణం పొందిన సమయంలో ప్రత్యేక హోదాపై మాట్లాడటం సరికాదని అనిపించిందని అందుకే ఆలస్యంగా సభ పెట్టాల్సి వచ్చిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement