త్రిషకు శుభాకాంక్షల వెల్లువ | Happy Birthday Trisha: Hansika, Taapsee Pannu, Vishal, Others Wish; 'Power' Actress Celebrates with Friends in Bangkok | Sakshi
Sakshi News home page

త్రిషకు శుభాకాంక్షల వెల్లువ

May 5 2015 1:40 AM | Updated on Sep 3 2017 1:25 AM

త్రిషకు శుభాకాంక్షల వెల్లువ

త్రిషకు శుభాకాంక్షల వెల్లువ

నటి త్రిష సంచలన తారల పట్టికలో చేరిపోయారు. ఇంతకుముందు ప్రేమ వ్యవహారాల విషయంలో నయనతార,

 నటి త్రిష సంచలన తారల పట్టికలో చేరిపోయారు. ఇంతకుముందు ప్రేమ వ్యవహారాల విషయంలో నయనతార, హన్సిక పేర్లు తరచూ మీడియాలో కనిపించేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని త్రిష భర్తీ చేస్తున్నారని చెప్పక తప్పదు. నటిగా పుష్కర కాలం పూర్తి చేసుకున్న ఈ చెన్నై చిన్నది సోమవారం తన 33వ పుట్టిన రోజు జరుపుకున్నారు.
 
  ఆమెకు పరిశ్రమలోని పలువురు ప్రముఖ హీరో హీరోయిన్లు, ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు విశాల్, మాధవన్, జయం రవి, తెలుగు నటుడు రానా దగ్గుబాటి, నటి తాప్సీ, హన్సిక, నిఖిషా పటేల్, కార్తిక, వరలక్ష్మి, దర్శకుడు సెల్వ రాఘవన్ తదితరులు త్రిషకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఆమెకు కాబోయే భర్త వరుణ్మనియన్ నుంచి శుభాకాంక్షలు వస్తాయా అన్నదే. ఎందుకంటే వీరి వివాహ నిశ్చితార్థం జరిగి నాలుగు నెలలు దాటింది.
 
  వివాహ తేదీ మాత్రం ఇప్పటికీ ఖరారు కాలేదు. అంతేగాక వీరి పెళ్లి ఆగిందన్న ప్రచారం మీడియాలో హోరెత్తుతోంది. ఈ విషయంపై త్రిష గాని, అటు వరుణ్మనియన్ గాని నోరు మెదపడం లేదు. వరుణ్మనియన్ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పక్షంలో ఓ రకంగా, లేనిపక్షంలో మరోరకంగా పెళ్లి గురించి పరిశ్రమ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement