
27న ఆంబళ ఆడియో
ఆంబళ చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఆంబళ చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. పూజై వంటి విజయవంతమైన చిత్రం తరువాత నటుడు విశాల్ తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంతో నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం ఆంబళ. అదే విధంగా అరణ్మణై వంటి హిట్ చిత్రం తరువాత సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంబళ. నటి హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఊటీ, పొల్లాచిలలో సాగుతోంది. మధురిమ, మాధవీలత, రమ్యకృష్ణ, కిరణ్ రాథోడ్, తులసి, ఐశ్వర్య, ప్రభులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో యువ నటుడు వైభవ్ కీలక పాత్ర పోషించడం విశేషం. హిప్ హాప్ తమిళ సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రంలోని పళగిక్కలాం అనే పాట ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలై విశేష ఆదరణను పొందింది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. అదే విధంగా ముందుగానే నిర్ణయించిన ప్రకారం ఆంబళ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.