తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ | good news for telangana govt employees | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

Nov 30 2016 1:44 AM | Updated on Sep 27 2018 9:08 PM

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ - Sakshi

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది.

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. వచ్చే నెల 1న ఉద్యోగులకు జీతంలో 10 వేల రూపాయలు నగదు చేతికిచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించింది. దేశమంతా నోట్ల కష్టాలతో అల్లాడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం తెలంగాణ ఉద్యోగులకు ఊరట కలిగించనుంది.

పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ చూసిన ‘నో క్యాష్‌’ బోర్డులు దర్శమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ఉద్యోగ సంఘాలు ఆర్బీఐకి విజ్ఞప్తి చేశాయి.

మరోవైపు సర్కారు బ్యాంకుల్లో ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement