నాకు ప్రాణహాని ఉంది: అనుపమ | Former Woman Police Officer Anupama Shenoy Claims Threat To Life | Sakshi
Sakshi News home page

నాకు ప్రాణహాని ఉంది: అనుపమ

Jun 11 2016 8:59 AM | Updated on Aug 28 2018 7:22 PM

నాకు ప్రాణహాని ఉంది: అనుపమ - Sakshi

నాకు ప్రాణహాని ఉంది: అనుపమ

సంచలన మాజీ పోలీస్ ఉన్నతాధికారిణి, కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుడ్లిగి డీఎస్పీ అనుపమ షెనాయ్ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బెంగళూరు: సంచలన మాజీ పోలీస్ ఉన్నతాధికారిణి, కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుడ్లిగి మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. కాగా ఎవరి నుంచి ప్రాణహాని ఉంది, బెదిరింపులు ఏమైనా వచ్చాయా అన్న విషయాలను ఆమె వెల్లడించలేదు. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్కు సంబంధించిన సీడీ, ఆడియోలను బెంగళూరులో మీడియా సమక్షంలో విడుదల చేయనున్నట్టు చెప్పారు.

అనుపమ రాజీనామా వ్యవహారం కర్ణాటకలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆమె రాజీనామా చేశారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన రాసలీలల వీడియో తన దగ్గర ఉందని, దాన్ని బయటపెడతానని ఆమె హెచ్చరించారు. కొన్ని రోజులు అజ్ఞాతంలో గడిపన అనుపమ రెండు రోజుల క్రితం కుడ్లిగి వచ్చారు. కాగా అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినందుకు బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement