బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు | fire accident at Fireworks-Centre in east godavari district | Sakshi
Sakshi News home page

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

Apr 4 2017 1:37 PM | Updated on Oct 2 2018 5:04 PM

తూర్పు గోదావరి జిల్లా తునిలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.

తుని: తూర్పు గోదావరి జిల్లా తునిలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. స్తానిక ఇసుకలపేటలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో రమేష్‌, దుర‍్గ, కాకిరెడ్డి అనే వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ తుని ఆస‍్పత్రికి తరలించారు.
 
రేకుల షెడ్డులో బాణాసంచా తయారు చేస్తుండగా ఒక‍్కసారిగా మంటలు చెలరేగి భారీ శబ‍్దంతో పేలుడు సంభవించింది. దాంతో షెడ్డులో తయారుచేసి నిల‍్వఉంచిన బాణసంచాకు మంటలు అంటుకుని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక‍్కడ పనిచేస్తున‍్న నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున‍్న పోలీసులు, అగ్నిమాపక సిబ‍్బంది సంఘటన స‍్థలానికి వెళ్ళి మంటలు ఆర‍్పేందుకు ప్రయత్నిస్తున్నారు.  బాణసంచా తయారీ కేంద్రం యజమాని విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సీహెచ్‌ రమణ అని, దుకాణానికి లైసెన‍్సు ఉందని అధికారులు తెలిపారు. సంఘటన స‍్థలాన్ని ఆర్టీవో విశ్వేశ‍్వరరావు, డీఎస్పీ రాజశేఖర్‌ పరిశీలించి విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement