బీజేపీకి శివసేన షాక్‌ | demonetization notes proposal should be removed: shiv sena | Sakshi
Sakshi News home page

బీజేపీకి శివసేన షాక్‌

Nov 15 2016 6:45 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీకి శివసేన షాక్‌ - Sakshi

బీజేపీకి శివసేన షాక్‌

బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన షాకిచ్చింది.

ముంబై: బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు బుధవారం తలపెట్టిన మార్చ్‌లో శివసేన పాల్గొంటోంది.

ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని ప‍్రతిపక్షాలు తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేన కూడా మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలకు మద్దతుగా నిలిచింది. తృణమాల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. రేపటి మార్చ్‌లో పాల్గొనాల్సిందిగా మమత కోరగా, ఉద్ధవ్‌ అంగీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement