ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక విషయమై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చేసిన యత్నం ఫలించలేదు.
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక విషయమై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చేసిన యత్నం ఫలించలేదు. టీఆర్‌ఎస్, టీడీపీలు తమ అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. అయితే, అన్ని పార్టీలు ఎవరికి వారు అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో మద్దతివ్వటం సాధ్యం కాదని, తాము కూడా అభ్యర్థిని బరిలోకి దించుతామని ఆయన తేల్చినట్లు సమాచారం. దీంతో భట్టివిక్రమార్క వెనుదిరిగి వెళ్లిపోయారు.