'చంద్రబాబు దారుణం చేస్తున్నారు' | cm chandrababu naidu doing things against dalits: ysrcp mla Isaiah | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు దారుణం చేస్తున్నారు'

Jan 3 2017 1:49 PM | Updated on May 29 2018 3:48 PM

'చంద్రబాబు దారుణం చేస్తున్నారు' - Sakshi

'చంద్రబాబు దారుణం చేస్తున్నారు'

దళిత ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవమానించడం దారుణం అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గౌరు సుచరిత, ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు: దళిత ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవమానించడం దారుణం అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గౌరు సుచరిత, ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాలాంటి ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పునాదులు వేసింది వైఎస్‌ఆర్‌ అని వారు మరోసారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలున్న నియోజకవర్గాల అభివృద్ధికి బాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం తడకనపల్లెలో నిర్వహించిన జన్మభూమి సభలో నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భిక్షేనని అన్న విషయం తెలిసిందే. ముచ్చుమర్రి ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్సేనని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది కూడా ఆయనేనని తెలిపారు. ఐజయ్య వైఎస్‌ పేరు ప్రస్తావించగానే సభలో పాల్గొన్న ప్రజలు ఈలలు, కేకలతో హర్షధ్వానాలు చేశారు. కానీ, చంద్రబాబు మాత్రం వెంటనే ఐజయ్య మైక్‌ను కట్‌ చేసి మాట్లాడకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు తీరుపట్ల మంగళవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement