సీఆర్డీఏపై పిటిషన్‌: విచారణ వాయిదా | Capital Farmers File Petition, HC Demands Explanation From CRDA | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏపై పిటిషన్‌: విచారణ వాయిదా

Feb 7 2017 2:25 PM | Updated on Oct 1 2018 2:09 PM

ఏపీ రాజధానికి భూములిచ్చిన వారి పట్టా భూములను సీఆర్డీఏ తక్కువ చేసి చూపిస్తుండడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి భూములిచ్చిన వారి పట్టా భూములను సీఆర్డీఏ అధికారులు తక్కువ చేసి చూపిస్తుండడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ల్యాండ్‌ పూలింగ్‌కు సహకరించిన వారిని ప్రభుత్వం మోసగించిందని, సీఆర్‌డీఏ అలధికారులు పట్టా భూములను తక్కువ చేసి చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement