అన్నాడీఎంకే మహిళానేత దారుణ హత్య | AIADMK party female leader murder | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే మహిళానేత దారుణ హత్య

Nov 6 2013 3:13 AM | Updated on Jul 30 2018 8:27 PM

అన్నాడీఎంకే మహిళా నాయకురాలిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలే అమింజికరైలో చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే మహిళా నాయకురాలిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలే అమింజికరైలో చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అమింజికరైకు చెందిన కస్తూరి అన్నానగర్ అన్నాడీఎంకే సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అమింజికరైలో ఆమె వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఐదుగురు కత్తులతో దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి ఉడాయిం చారు. రక్తపు మడుగులో పడిఉన్న కస్తూరిని స్థానికులు ఆస్పత్రికి తరలిం చేందుకు ప్రయత్నించారు. ఆమె అప్పటికే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న నగర పోలీసులు నిందితుల కోసం వేట మొదలెట్టారు. ఈ హత్య రాజకీయ కారణాలతో జరిగిందా? లేదా వ్యక్తిగత తగాదాలు, పాత కక్షల నేపథ్యంలో జరిగిందా? అన్న కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement