పలు మార్గాల్లో ఏసీ బస్సులు | AC buses in on several routes | Sakshi
Sakshi News home page

పలు మార్గాల్లో ఏసీ బస్సులు

May 5 2015 11:57 PM | Updated on Sep 3 2017 1:29 AM

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటి (ఎమ్మెమ్మార్డీఏ) పలు మార్గాల మధ్య ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తోంది...

- ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానించిన ఎమ్మెమ్మార్డీయే
- తొలుత కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య..
- 25 బస్సుల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం
- వివిధ బస్సు తయారీ కంపెనీలకు లేఖ
సాక్షి, ముంబై:
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటి (ఎమ్మెమ్మార్డీఏ) పలు మార్గాల మధ్య ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తోంది. ఏసీ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా ఎమ్మెమ్మార్డీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను ఆహ్వానించింది. ఈ బస్సులను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్యలో అదేవిధంగా కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య వీలైనంత త్వరగా నడిపేందుకు యోచిస్తోంది.

ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల మధ్య రోజు ఉద్యోగ రీత్యా ప్రయాణించే వారికి మరింత మెరుగైన కనెక్టివిటీ ఇచ్చేందుకు ఈ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అయితే 10 ఏళ్ల కోసం వివిధ నమూనాలు గల 25 బస్సులను ఈ మార్గాల మధ్య నడిపేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. దీంతో తాము అర్హత గల ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానించామన్నారు. పేరొందిన జాతీయ అంతర్జాతీయ బస్సు ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది ఎమ్మెమ్మార్డీఏ టాటా మోటార్స్, వోల్వోలకు ఈ బస్సుల కొనుగోలు నిర్వహణ విషయమై ఓ లేఖ రాసింది.

అయితే వీరి నుంచి స్పందన కరువవడంతో ఎమ్మెమ్మార్డీ ఆర్‌ఎఫ్‌పీని ఆహ్వానించేందుకు నిర్ణయించింది. బెస్ట్ అయితే బాంద్రా, కుర్లా, సైన్‌ల మధ్య కనెక్టివిటి సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయనీ ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ మార్గాల మధ్య సరైన కనెక్టివిటీ లేకపోవడంతో ఆటోలు, ట్యాక్సీలకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందన్నారు. ప్రయాణికులు బస్సు ద్వారా బీకేసీ వెళ్లాలంటే సమీప బస్టాపుకు కనీసం కిలో మీటర్ మేర నడవాల్సి వస్తోందని, వారికార్యాలయాలు మెయిన్ రోడ్ నుంచి చాలా దూరంలో ఉన్నాయయని చెప్పారు.

దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్లు వెలువెత్తుతుండడంతో ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తున్నామని అధికారి వెల్లడించారు. ఇదిలా వుండగా, 2012లో బీకేసీ మధ్య కనెక్టివిటీపెంచేందుకు దాదాపు 15 నుంచి 20 బస్సులను బెస్ట్‌కు అందజేసేందుకు ఎమ్మెమ్మార్డీఏ నిర్ణయించింది. అయితే ఈ బస్సులను నడిపేందుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు వరకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ బస్సుల చార్జీలు బెస్ట్ బస్సుల కంటే కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే అలా చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు  భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement