కోహ్లి ప్రశ్నకు యువీ సమాధానం ఇలా..

Yuvraj Has A Rib Tickling Answer To Kohlis Question - Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అడిగిన ప్రశ్నకు చిలిపిగా సమాధానం ఇచ్చాడు సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. కొద్ది రోజుల్లో ప్రపంచకప్‌ కోసం విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు.. ఇంగ్లండ్‌ వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సరదాగా గడుపుతున్న కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. తాను గతంలో తీసుకున్న ఫోటోనే ఉంచి ‘ఈ నగరం పేరేంటి?’ అని అడిగాడు.

ఈ పోస్టుకు 20లక్షలకు పైగా లైకులు రాగా 24,000 మందికి పైగా బదులిచ్చారు. ఇందులో చాలా మంది విరాట్‌ కోహ్లి ప్రశ్నకు సరిగ్గానే సమాధానం ఇచ్చారు. అయితే యువీ మాత్రం ‘కోట్కాపురాలా కనిపిస్తోంది? ఏమంటావు హర్భజన్‌’ అని సమాధానం ఇచ్చాడు. అయితే విరాట్‌ పెట్టిన చిత్రం చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌ నగరానిది. అక్కడి ఓల్డ్‌టౌన్‌ స్క్వేర్‌ వద్ద తీసుకున్న చిత్రమది. ఇంతకీ ‘కోట్కాపుర’ ఏంటో తెలుసా? పంజాబ్‌లోని ఓ చారిత్రక నగరం. అది పత్తి మార్కెట్‌కు ప్రసిద్ది గాంచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top