‘టేలర్‌.. నాలుక ఎందుకు బయటకు తీస్తావ్‌’

Why Do You Put Tongue Out Every Time You Score 100, Harbhajan - Sakshi

న్యూఢిల్లీ: తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో వందకు పైగా వన్డేలు, వంద టీ20లు ఆడిన ఘనత న్యూజిలాండ్‌ వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ది. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో తన వందో మ్యాచ్‌ను పూర్తి చేసుకున్న టేలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి కివీస్‌ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాగా, ప్రస్తుతం 99 టెస్టులతో ఉన్నాడు రాస్‌ టేలర్‌. ఇంకో మ్యాచ్‌ ఆడితే టెస్టు ఫార్మాట్‌లో కూడా  ‘సెంచరీ’ కొట్టేస్తాడు ఈ వెటరన్‌. అది టీమిండియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లోనే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిసాడు టేలర్‌. ఇప్పుడు ఆ అరుదైన రికార్డే టేలర్‌ను ఊరిస్తోంది. ఇదిలా ఉంచితే, నిన్న టీమిండియాతో జరిగిన వన్డేలో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ ఫార్మాట్‌లో 21వ శతకం నమోదు చేశాడు.(ఇక్కడ చదవండి: మూడేళ్ల తర్వాత అయ్యర్‌-టేలర్‌!)

అయితే టేలర్‌ తాను ఎక్కువ జోష్‌కు లోనయ్యే సందర్భంలో నాలుకను బయటకు తీస్తూ ఉంటాడు. సెంచరీ సాధించే క్రమంలో అయితే కచ్చితంగా నాలుకతో తన సెలబ్రేషన్స్‌ చేసుకుంటాడు టేలర్‌. ఇలా నాలుక ఎందుకు బయటకు తీస్తాడు అనేది చాలామంది క్రికెట్‌ అభిమానుల్లో మెదిలే ప్రశ్నే. అయితే ఇప్పుడు అదే అనుమానం మన వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు వచ్చింది. దీన్ని తన మనసులోకి ఉంచుకోలేక ట్వీటర్‌ వేదికగానే టేలర్‌ను అడిగేశాడు. ‘ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడావ్‌ టేలర్‌. వెల్‌డన్‌. కానీ నాకో విషయం చెప్పాల్సి ఉంది. నువ్వు సెంచరీ చేసిన ప్రతీసారి నాలుకను ఎందుకు బయటకు తీస్తావ్‌’ చెప్పు అంటూ హాస్యపూరిత ఎమోజీని పోస్ట్‌ చేసి మరీ అడిగాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top