
బుమ్రా బంతిని నేరుగా వికెట్ల కొట్టడంతో రనౌట్‌గా ఒక్క బంతి..
న్యూఢిల్లీ : యార్కర్ల కింగ్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మైమరిపించే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. గురువారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే బుల్లెట్ రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతిని అక్సర్ పటేల్ ఢిఫెన్స్ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ ఆ బంతిని బుమ్రా అందుకోవడంతో పరుగును విరమించుకొని వద్దు.. వద్దు.. అని నాన్‌స్ట్రైకర్‌కు చెబుతూ వెనక్కి వెళ్లాడు. కానీ అప్పటికే నాన్‌స్ట్రైకర్ కీమో పాల్ సగం పిచ్ దాటేశాడు. అక్సర్ వెనక్కి వెళ్లడంతో వెనుదిరిగే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా బంతిని నేరుగా వికెట్ల కొట్టడంతో రనౌట్‌గా ఒక్క బంతి ఆడకుండానే నిరాశగా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారులు బూమ్స్ బుల్లెట్ రనౌట్ అంటూ సోషల్ మీడియాలో పంచుకోగా.. నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బుమ్రా.. బౌలింగ్‌తోనే కాదు.. ఫీల్డింగ్‌తోను అదరగొట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
WATCH: BOOM's Bullet run-out ⚡️⚡️
— IndianPremierLeague (@IPL) 18 April 2019
Full video here 📽️📽️https://t.co/6bnDhGuiwk #DCvMI pic.twitter.com/yz6fYVTxNi