ఆనంద్ ‘హ్యాట్రిక్’ డ్రా | Viswanathan Anand stays ahead with draw against Sergey Karjakin | Sakshi
Sakshi News home page

ఆనంద్ ‘హ్యాట్రిక్’ డ్రా

Mar 20 2014 1:32 AM | Updated on Sep 2 2017 4:55 AM

ఆనంద్ ‘హ్యాట్రిక్’ డ్రా

ఆనంద్ ‘హ్యాట్రిక్’ డ్రా

భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో వరుసగా మూడో డ్రా ఫలితం ఎదురైంది. అయినప్పటికీ ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ నాలుగు పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

క్యాండిడేట్స్ చెస్ టోర్నీ
 ఖాంటీ మాన్‌సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో వరుసగా మూడో డ్రా ఫలితం ఎదురైంది. అయినప్పటికీ ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ నాలుగు పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
 
  రష్యా ఆటగాడు సెర్గెయ్ కర్జాకిన్ (2.5)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ డ్రాగా ముగించుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాడు దీటుగా స్పందించడంతో ఆనంద్ ఎత్తులు పారలేదు. చివరకు 33 ఎత్తుల్లో గేమ్ డ్రా అయింది. మిగతా మ్యాచ్‌ల్లో తొపలోవ్ (బల్గేరియా-3)... క్రామ్నిక్ (రష్యా-3)పై గెలుపొందగా, మమెద్యరోవ్ (అజర్‌బైజాన్-3)... స్విడ్లెర్ (రష్యా-3)ను కంగుతినిపించాడు. అరోనియన్ (ఆర్మేనియా-3.5)... అండ్రెకిన్ (రష్యా-2)తో డ్రా చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement