విరాట్‌ కోహ్లి వినూత్నంగా.. | Virat Kohlis Bottle Cap Challenge Comes With A Unique Twist | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి వినూత్నంగా..

Aug 11 2019 11:55 AM | Updated on Aug 11 2019 11:56 AM

Virat Kohlis Bottle Cap Challenge Comes With A Unique Twist - Sakshi

ట్రినిడాడ్‌: ఇటీవలి కాలంలో ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’ ఎంత పాపులారిటి పొందిందో మనందరికీ తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.  ఈ జాబితాలో తాజాగా భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేరిపోయాడు. అయితే ఈ బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ను కోహ్లి వినూత్నంగా ప్రయత్నించాడు. తన చేతిలో బ్యాట్‌ పట్టుకుని దాంతో బాటిల్‌ క్యాప్‌ను ఎగరుగొట్టాడు. సహజంగా ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’ అంటే.. మూత ఉన్న నీళ్ల బాటిల్‌ను ఒక కాలితో తంతూ ఓపెన్‌ చేయడమే.

అయితే కోహ్లి మాత్రం తన బ్యాట్‌తో ఈ చాలెంజ్‌ను పూర్తి చేయడం ఆకట్టకుంది. బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌లో తన దృష్టినంతా కేంద్రీకరించి.. ఎదురుగా ఉన్న బాటిల్‌ మూతను తన అద్భత బ్యాటింగ్‌ నైపుణ్యంతో తొలగించాడు. ఆ వీడియోకి కోచ్‌ రవిశాస్త్రి కామెంట్రీ తోడవ్వంతో మరింత వన్నె తెచ్చింది. ఈ వీడియోను కోహ్లి తన ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘ఎప్పటికీ చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా చేయడం ఉత్తమమే కదా’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement