సచిన్‌ చాలెంజ్‌కు కోహ్లి ఓకే

Virat Kohli Reply to Sachin Tendulkar Challenge - Sakshi

ముంబై: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విసిరిన చాలెంజ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్వీకరించాడు. మూడు రోజుల క్రితం సచిన్‌ 'కిట్‌ అప్‌ ఇండియా' పేరిట ఓ ఛాలెంజ్‌ని విసిరిన సంగతి తెలిసిందే. నేను నాకు ఇష్టమైన క్రికెట్ ఆడి వీడియోను షేర్‌ చేశాను. మీరు మీకిష్టమైన ఆట ఆడి మీరు మీ వీడియోలను షేర్‌ చేయండి. మీరందరు ఎప్పుడు ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని సచిన్‌ కామెంట్ పెట్టారు.

సచిన్‌ వీడియోను షేర్‌ చేయడంతోపాటు భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్‌, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్‌ కోహ్లి పేర్లను ట్యాగ్ చేస్తూ ఈ చాలెంజ్‌ స్వీకరించాల్సిందిగా కోరాడు. తాజాగా సచిన్‌ విసిరిన సవాల్‌ను కోహ్లి స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి పోస్టు చేశాడు. ఈ వీడియోలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కిట్‌ను కోహ్లి ధరించాడు. ఎరుపురంగు కాలి ప్యాడ్లు, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున ఆడే సమయంలో వాడే హెల్మెట్‌ను కోహ్లి పెట్టుకున్నాడు. మరొకవైపు సచిన్ టెండూల్కర్ చాలెంజ్‌ని పీవీ సింధు కూడా స్వీకరించింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top