
బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోవడం విఫలమై ఓటమి చెందింది. దీనిపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ ప్రధానంగా తమ బౌలింగ్ విభాగంపై అసహనం వ్యక్తం చేశాడు కోహ్లి. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘మ్యాచ్ ఫలితాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. చివరి నాలుగు ఓవర్లలో మ్యాచ్ స్వరూపం మారిపోయింవది. మ్యాచ్ గెలవడానికి కీలకంగా భావించే ఆ సమయంలో బౌలర్లు ఆకట్టుకోలేదు. దీన్ని నేను కూడా సమర్థించలేను.
(ఇక్కడ చదవండి: బెంగళూరు చిన్నబోయింది)
మేమింకా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన సమయమిది. ఈ సీజన్‌లో మా ప్రదర్శన ఎవరికీ నచ్చలేదని నాకు తెలుసు. కీలక సమయాల్లో ధైర్యంగా బౌలింగ్ చేస్తేనే గెలుపును అందుకుంటా. రసెల్ లాంటి పవర్ హిట్టర్లను ఎదుర్కోవాలంటే ఇంతకు మించిన ప్రదర్శన మాకు అవసరం’ అని కోహ్లి తెలిపాడు. ఈ సీజన్‌లో ఇంకా ఆర్సీబీ బోణీ కొట్టలేదు. ఇది ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి.
(ఇక‍్కడ చదవండి: రసెల్‌కు ఆ బంతి వేసుంటే..!)